Bandla Ganesh: మెగాస్టార్ చిరును పొగిడేసిన పవన్ భక్తుడు... ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో సినిమా వారికి యాభై శాతం ఫీజు తగ్గింపు
బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో ఈసారి మెగాస్టార్ చిరును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
మెగా ఫ్యామిలీ అభిమానినని, పవన్ భక్తుడినని బండ్ల గణేష్ బహిరంగంగానే చెప్పుకుంటారు. తన చేతలు, పోస్టుల ద్వారా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. తాజాగా చిరును ఉద్దేశించి ఆయన పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు ఓ వీడియోను జతచేశారు. అందులో చిరంజీవి యోధ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్ లో మాట్లాడుతూ కనిపించారు. సినీ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్ లలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని, వారిలో ఎంతో మంది వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పారు. వారికి ఏదైనా సాయం చేస్తే బావుంటుందని ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ వారిని కోరారు. వెంటనే ఆ సెంటర్ నిర్వాహకులు చిరంజీవి విజ్ఞప్తిని ఒప్పుకున్నారు. మా మూవీ అసోసియేషన్ సభ్యులతో పాటూ, సినిమాలలో 24 క్రాఫ్ట్ లలో పనిచేస్తున్న అందరికీ తమ సంస్థ ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తుందని ప్రకటించారు. ఆ వీడియోను పోస్టు చేసిన బండ్ల గణేష్ ‘సర్ మీరు సూపర్... మీ గురించి మాట్లాడటానికి పదాలు లేవు సర్’ అని క్యాప్షన్ పెట్టారు.
గతంలో కూడా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ పై ప్రశంసలు కురిపించారు. సాధారణ కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరడం అంటే సాధారణ విషయం కాదని అన్నారు. ఆయన పుట్టినరోజంటే మెగా అభిమానులకు పండుగరోజేనని అన్నారు. చిరు జీవిత కథను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, భావితరాలకు ఆయన జీవితం స్పూర్తి నింపుతుందని అన్నారు. ఈ పనిచేయాలని తాను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్టు చెప్పారు.
@KChiruTweets sir Meeru super ………No words about you sir 👌👌👌👌👌🙏🙏🙏🙏 pic.twitter.com/VNF5qa07XX
— BANDLA GANESH. (@ganeshbandla) November 18, 2021
Read Also: హీరో సూర్యకు బెదిరింపులు... ఇంటి చుట్టూ పోలీసు భద్రత
Read Also: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!
Read Also: ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్.. స్త్రీ ఎవడికీ దాసి కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా.. ఖబడ్దార్
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి