అన్వేషించండి

Shyam Singha Roy Teaser: ‘శ్యామ్ సింగరాయ్’ టీజర్.. స్త్రీ ఎవడికీ దాసి కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా.. ఖబడ్దార్

నానీ హీరోగా.. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాజ్’ టీజర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది.

నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం డిసెంబర్ 24న విడుదల కానుంది.  ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే చిత్రంపై ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో సినిమా అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదల చేసిన ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ పాటకు కూడా మాంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్‌ను విడుదల చేసింది. 

‘‘అడిగే అండ లేదు. కలబడే కండ లేదని.. రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే.. కాగితం కడుపు చీల్చుకుపుట్టి.. రాయడమే కాదు, కాలరాయడం కూడా తెలుసిన.. అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే..’’ అంటూ.. ‘శ్యామ్ సింగ రాయ్’ క్యారెక్టర్, టైటిల్‌ను టీజర్‌లో చూపించారు. చివర్లో ‘స్త్రీ ఎవడికీ దాసి కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా.. ఖబడ్దార్’ అంటూ నాని.. బెంగాలీలో చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో ఈ స్టోరీ నడుస్తుంది. అయితే.. ఈ టీజర్‌లో కేవలం నాని క్యారెక్టర్‌ను మాత్రమే పరిచయం చేశారు. సాయి పల్లవి అలా కనిపించి.. మాయమైంది. చివర్లో కృతి శెట్టి-నానిల లిప్ లాక్‌తో టీజర్ ముగిసింది. అయితే, మరో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్‌‌కు మాత్రం ఈ టీజర్‌లో స్థానం దక్కలేదు. ఆమె పాత్రను చూడాలంటే.. అభిమానులు ట్రైలర్ రిలీజ్ వరకు అగాల్సిందే. 

‘శ్యామ్ సింగ రాయ్’ తెలుగు టీజర్‌ను ఇక్కడ చూసేయండి: 

సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’లో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యదేవ్ జంగా కథ అందించిన ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today July 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీతో పార్టీకి వెళ్లిన ఐషు – ఇందు, రాజుల మధ్య రొమాన్స్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీతో పార్టీకి వెళ్లిన ఐషు – ఇందు, రాజుల మధ్య రొమాన్స్‌
Illu Illalu Pillalu Serial Today July 30th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నిజంగానే నన్ను అనాథని చేసేసింది! ప్రేమ, ధీరజ్‌ల రోదన! టార్గెట్‌ నర్మద!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నిజంగానే నన్ను అనాథని చేసేసింది! ప్రేమ, ధీరజ్‌ల రోదన! టార్గెట్‌ నర్మద!
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
Jagadhatri Serial Today JULY 29th: శ్రీవల్లిని బలవంతంగా లాక్కెళ్లిన పాపారాయుడు...చంపేయమంటూ రౌడీలకు అప్పగింత
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని బలవంతంగా లాక్కెళ్లిన పాపారాయుడు...చంపేయమంటూ రౌడీలకు అప్పగింత

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Shubman Gill Reclaims No1 ODI Rank: వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. Rankingsలో భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
Embed widget