అన్వేషించండి

Suriya: హీరో సూర్యకు బెదిరింపులు... ఇంటి చుట్టూ పోలీసు భద్రత

జైభీమ్ సినిమాతో ఒక్కసారి వార్తల్లోకి వచ్చాడు సూర్య. తాజాగా ఆయనకు పోలీసులు భద్రత కల్పించారు.

హీరో సూర్య తాజా సినిమా ‘జై భీమ్’. అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. నిజజీవిత కథ ఆధారంగా తీసిన ఈ సినిమా ఎంతో మంది ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా హీరోనే కాదు నిర్మాత కూడా సూర్యనే. తమిళంతో పాటూ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. 1993లో జరిగిన యథార్థ జీవిత కథనే సినిమాగా తెరకెక్కించాడు సూర్య. చంద్రు అనే న్యాయవాది పార్వతి అనే గిరిజన తెగకు చెందిన మహిళకు అండగా నిలిచి, ఆమె భర్త మరణం వెనుక రహస్యాన్ని చేధించడమే కథ. పార్వతి భర్త రాజకన్ను పోలీస్ కస్టడీలోనే మరణించాడని నిరూపించేందుకు చంద్రు పడిన కష్టాన్ని సూర్య సినిమాలో చూపించారు. కాగా ఈ సినిమాలో తమ వర్గాన్ని కించపరిచారంటూ వన్నియర్ సంఘం ఆరోపించింది. అంతేకాదు చిత్రయూనిట్ కు లీగల్ నోటీసులు కూడా పంపింది. 

అంతటితో ఆగలేదు ఆ సంఘం నాయకులు. సూర్యను ఎవరైనా కొడితే లక్షరూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడ సంచలనంగా మారాయి. అంతేకాదు సూర్యకు వ్యక్తిగతంగా కూడా బెదిరింపులు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు సూర్య ఇంటికి భద్రత కల్పించారు. చెన్నైలోని ఆయన నివాసం చుట్టూ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. సూర్యను ఇంట్లోనే ఉండమని కోరారు పోలీసులు. పళని సామి అనే వ్యక్తి సూర్యను కొడితే డబ్బులిస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు... అతడిపై పోలీసుల కేసునమోదు చేశారు. 

సూర్యకు పెరుగుతున్న మద్దతు
కేవలం వన్నియర్ వర్గం వారు మాత్రమే సూర్యను, జై భీమ్ సినిమాను వ్యతిరేకిస్తున్నారు. మిగతా వర్గాలు సినిమాకు, సూర్యకు చాలా మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూర్యకు మద్దతు పెరుగుతోంది. ‘వి స్టాండ్ విత్ సూర్య’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. 

Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Diviki Diviki Song Lyrics : జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ - వదినా మరదళ్ల అల్లరి పాట... హుషారెత్తించే లిరిక్స్
జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ - వదినా మరదళ్ల అల్లరి పాట... హుషారెత్తించే లిరిక్స్
Vaishnav Tej Hanuman 2 : హనుమాన్ సీక్వెల్‌లో మెగా హీరో - బిగ్ సర్ప్రైజ్‌తో పాటు ట్విస్ట్ కూడా...
హనుమాన్ సీక్వెల్‌లో మెగా హీరో - బిగ్ సర్ప్రైజ్‌తో పాటు ట్విస్ట్ కూడా...
Godavari Serial Today November 21st: 'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
Drishyam The Conclusion OTT : ఓటీటీలోకి 'దృశ్యం 3' - అజయ్ దేవగణ్ క్రైమ్ థ్రిల్లర్ అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి 'దృశ్యం 3' - అజయ్ దేవగణ్ క్రైమ్ థ్రిల్లర్ అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
IND VS NZ 1st Test Highlights: వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget