Venkatesh: పెద్ద చిన్నా అని ఏమీ లేదు... మళ్లీ నా సినిమాలు థియేటర్లకు వస్తాయ్! - వెంకటేష్
వెంకటేష్, మీనా జంటగా హిట్ సినిమా 'దృశ్యం'కు సీక్వెల్‌గా రూపొందిన సినిమా 'దృశ్యం 2'. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు.
![Venkatesh: పెద్ద చిన్నా అని ఏమీ లేదు... మళ్లీ నా సినిమాలు థియేటర్లకు వస్తాయ్! - వెంకటేష్ Hero Daggubati Venkatesh about Drushyam 2 telugu movie, OTT release and others Venkatesh: పెద్ద చిన్నా అని ఏమీ లేదు... మళ్లీ నా సినిమాలు థియేటర్లకు వస్తాయ్! - వెంకటేష్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/18/908384a8510c8da339daa065a837037f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
"కుటుంబ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లకు రావడానికి సందేహిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి సినిమాలకు 30, 40 మంది కూడా థియేటర్లలో కనిపించడం లేదు. అందుకని, 'దృశ్యం 2' మేకర్స్ ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు" అని హీరో వెంకటేష్ అన్నారు. ఆయన నటించిన 'దృశ్యం 2' ఈ నెల 25న ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'ఓటీటీకి దృశ్యం 2 పర్ఫెక్ట్ అనుకుంటున్నారా?' అని ప్రశ్నించగా... అయన పై విధంగా స్పందించారు.
థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకోవడం పట్ల కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. థియేటర్లలోకి పెద్ద సినిమా వస్తే బావుంటుందని అనుకుంటున్నారని వెంకటేష్‌తో అనగా... "పెద్ద చిన్న అని ఏమీ లేదు. కరోనా సమయంలో మేకర్స్ తీసుకున్న నిర్ణయం ఇది. నేను ఎక్కువ ఆలోచించను. మళ్లీ థియేటర్లకు సినిమాలు వస్తాయి కదా" అని ఆయన చెప్పారు. "నేను నా పని చేస్తాను. ఆ తర్వాత వదిలేస్తాను" అని వెంకటేష్ అన్నారు.
ఒరిజినల్ మూవీతో పోలిస్తే... తెలుగులో పెద్దగా మార్పులు చేయలేదని వెంకటేష్ తెలిపారు. ఓ మూడు, నాలుగు సీక్వెన్సులు కొత్తగా యాడ్ చేశామన్నారు. అయితే... ఫస్ట్ మూవీతో పోలిస్తే, 'దృశ్యం 2'లో ఫ్యామిలీ ఎమోషన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయని ఆయన అన్నారు. రాంబాబు (సినిమాలో ఆయన పోషించిన పాత్ర పేరు) మామూలోడు కాదని, అతడిని చూస్తే ఇలా కూడా ఆలోచిస్తారా? అని అనిపిస్తుందని వెంకటేష్ చెప్పారు. 'దృశ్యం' చూడనివాళ్లకూ 'దృశ్యం 2' నచ్చుతుందని అన్నారు. ఒకవేళ ఎవరైనా చూడాలని అనుకుంటే ఓటీటీలో అందుబాటులో ఉందని తెలిపారు. 'దృశ్యం 2'లో ఫస్ట్ మూవీ నటించిన మీనా, కృతిక, ఎస్తర్ అనిల్, నదియా, నరేష్ తదితరులు నటించారు. మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్ డైరెక్ట్ చేశారు.
Also Read: నయనతార... వచ్చింది... నటించింది... గెలిచింది! - సమంత
Also Read: కోతులకు అరటిపళ్లు తినిపిస్తున్న సల్మాన్ ఖాన్, ఆయన మేనల్లుడు... వీడియో చూశారా?
Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...
Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
Also Read: మెగాస్టార్ చిరును పొగిడేసిన పవన్ భక్తుడు... ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో సినిమా వారికి యాభై శాతం ఫీజు తగ్గింపు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)