MP Nusrat : డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
ప్రేమించి..వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదంటే ఎవరైనా నిరాశ పడతారు. కానీ ఆ ఎంపీ మాత్రం సంతోషపడింది. ఓ సమస్య తీరిపోయినట్లు ఫీలవుతోంది. ఆ ఎంపీ హీరోయిన్ కూడా..! అంత సంతోషం ఎందుకంటే ?
బెంగాల్ ఎంపీ నుస్రత్ జహాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో గెలవక ముందు హీరోయిన్. బెంగాలీలో స్టార్ స్టేటస్సే ఉంది. ఆమె నిఖిల్ జైన్ అనే వ్యక్తిని ప్రేమించింది.2019 జూన్ నెలలో టర్కీలోని ఓ పర్యాటక ప్రాంతంలో బంధుమిత్రులందర్నీ తీసుకెళ్లి ఘనంగా పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమె ఎంపీ కావడంతో ఆ పెళ్లికి భారీ ప్రచారం కూడా వచ్చింది.
Also Read : నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో నిఖిల్ జైన్ ఓ సారి హఠాత్తుగా వివాదాస్పదమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే నుస్రత్ జహాన్ ప్రెగ్నెంట్ అని.. ఆమె కడుపులో ఉన్న బిడ్డతో తనకేమీ సంబంధం లేదని ప్రకటించారు. తాము ఆరు నెలల నుంచి దూరంగా ఉంటున్నామని ప్రకటించారు. ఇది హాట్ టాపిక్ అయింది. ఈ విషయాన్ని నుస్రత్ కూడా ఖండించలేదు. అంతే కాదు అనూహ్యమైన ప్రకటన చేసింది. నిఖిల్‌తో తన పెళ్లి చెల్లదని స్పష్టం చేసింది. టర్నీ చట్టాల ప్రకారం చేసుకున్న పెళ్లి ఇండియాలో చెల్లుబాటు కాదని నిఖిల్ తన భర్త కాదని స్పష్టం చేసింది.
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
నుస్రత్ చెప్పిన పెళ్లి చెల్లుతుందా లేదా అన్నదానిపై కన్నా అప్పట్నుంచి ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరు అన్న చర్చే ఎక్కువ నడిచింది. చివరికి ఆమె పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ బర్త్ సర్టిఫికెట్‌లో తండ్రి పేరును బెంగాలీ నటుడు, బీజేపీ నేత అయిన యశ్ దాస్ గుప్తా పేరు రాసింది. దీంతో ఓ సస్పెన్స్ వీడినట్లయింది. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. సహజీవనం చేసి బిడ్డను కన్నారు.
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
అయితే టర్కీలో నిఖిల్‌తో జరిగిన పెళ్లి చెల్లదని అధికారిక ధృవీకరణ లేకపోతే చిక్కులు వస్తాయి . కానీ ఆ పెళ్లి చెల్లదని ఆమె కోర్టుకెళ్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎందుకైనా మంచిదని నిఖిలే తమ పెళ్లి చెల్లదని ప్రకటించాలని కోర్టుకెళ్లారు. విచారణ కోల్‌కతా నగరంలోని ఓ కోర్టు ఆమె గత వివాహం చెల్లదని తీర్పునిచ్చింది. దీంతో ఎంపీ అయిన హీరోయిన్‌కు ఓ పెద్ద సమస్య తప్పినట్లయింది.
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి