Dhandoraa Awards : 'దండోరా'కు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు - తెలుగు వారి ప్రతిభ చాటే చిత్రం... గద్దర్ అవార్డ్స్‌పై మూవీ టీం హర్షం
Gaddar Awards 2025 : తెలంగాణ గద్దర్ అవార్డుల్లో దండోరా మూవీకి పురస్కారం వరించడంపై మూవీ టీం ఆనందం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీకి థాంక్స్ చెప్పింది.

Dhandoraa Team Thanks To Telangana Government For Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ 2025'లో రీసెంట్ సోషల్ డ్రామా 'దండోరా' సత్తా చాటింది. మూవీలో శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, రాద్య, అదితి భావరాజు తదితరులు కీలకపాత్రలు పోషించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ఈ మూవీని తెరకెక్కించారు. తమ సినిమాకు ప్రభుత్వ గుర్తింపు సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.
'మరిన్ని అవార్డులు'
'దండోరా' సినిమాను గుర్తించి అవార్డులు ప్రకటించిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి హీరో శివాజీ ధన్యవాదాలు తెలిపారు. 'ఎన్టీఆర్ గారు వేసిన ట్వీట్‌తో తెలుగు వారందరికీ ఈ మూవీ దగ్గరైంది. మార్క్ కె రాబిన్ గారికి అవార్డు రావడం ఆనందంగా ఉంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బెన్నీ గారికి థాంక్స్. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉంటుంది. తెలుగు వాళ్ల ప్రతిభను, సత్తా చాటే చిత్రమిది.
ఈ పాత్ర కోసం, లుక్ కోసం నేను చాలా వరకు రాత్రి పూట రెండు, మూడు గంటలే నిద్రపోయేవాడ్ని. నటన అంటే దైవంతో సమానం. రాధ్య అనే పాప పాత్ర లేకపోయి ఉంటే ఈ సినిమా నేను చేసేవాడ్ని కాదు. నవదీప్, నందు, బిందు మాధవి ఇలా అందరూ ఫైనెస్ట్ యాక్టర్స్. ఈ మూవీ ఇంకా చాలా దూరం వెళ్తుందని నమ్ముతున్నాను. మున్ముందు చాలా అవార్డులు వస్తాయని ఆశిస్తున్నా.' అని అన్నారు.
Also Read : 'కల్కి 2898AD' కోసం కమల్ హాసన్ రెమ్యునరేషన్ - 10 రోజులకు ఎంత తీసుకున్నారో తెలుసా?
శివాజీ గారి వల్లే...
'దండోరా' ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన అందరికీ థాంక్స్ చెప్పారు డైరెక్టర్ మురళీకాంత్. తమ సినిమాకు గుర్తింపు ఇచ్చినందుకు ప్రభుత్వానికి, జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. 'మార్క్ కె రాబిన్ మా సినిమాకి ప్రాణం. ఆయన, నేను కలిసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సినిమాకు పని చేశాం. ఇలాంటి అవార్డులు, గుర్తింపు వచ్చిన సమయాల్లోనే మన వద్ద ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలుస్తుంది. శివాజీ గారి వల్లే ఈ చిత్రం ఈ స్థాయికి వచ్చింది.' అని అన్నారు. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన వారందరికీ నిర్మాత రవీంద్ర బెనర్జీ థాంక్స్ చెప్పారు.
అతి పెద్ద గౌరవం
చిన్నప్పటి నుంచీ గద్దరన్న పాటలు వింటూ ఉండేవాడినని... ఈ రోజు గద్దర్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని మార్క్ కె రాబిన్ అన్నారు. 'ముందు నుంచీ మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియాకి, మాకు ఈ గుర్తింపు, అవార్డుల్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. గద్దర్ అన్న పాటలు చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడ్ని. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ రావడం నాకు పెద్ద గౌరవం లాంటిది. దండోరా అద్భుతమైన కథ. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్.' అని అన్నారు.
ట్రెండింగ్ వార్తలు























