By: ABP Desam | Updated at : 19 Aug 2021 11:32 AM (IST)
ఉక్రెయిన్లో షూటింగ్ పూర్తైన సందర్భంగా రాజమౌళి టీమ్ సంబరాలు
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టు మొదటి వారంలో సినిమా చివరి షెడ్యూల్ కోసం హీరోలతో సహా “ఆర్ఆర్ఆర్” టీం మొత్తం ఉక్రెయిన్ వెళ్లిన వెళ్లింది. ఈ సినిమా షూటింగ్ బుధవారం పూర్తైంది. దీంతో బుధవారానికే (ఆగస్టు 18) యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నాడు. బుధవారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో క్యాజువల్ లుక్‌లో కన్పించిన యంగ్ టైగర్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అదే రోజు సాయంత్రం దర్శకుడు రాజమౌళితో పాటు “ఆర్ఆర్ఆర్” టీం అంతా కలిసి షూటింగ్ పూర్తయిన సందర్భంగా సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి కేక్ కట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
RRR టీం మొత్తం హైదరాబాద్ వచ్చాక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ డేట్ పై నెలకొన్న సస్పెన్స్ కు ఈ ప్రెస్ మీట్ లో తెరపడనుంది. 'RRR' మూవీ ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీ మార్చుకుంది. ముందుగా 2020 జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత 2021 జనవరి 8న పక్కా థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. అయితే అనివార్య పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది. చివరగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ డేట్ కూడా మారుతుందనే చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఈ నెలాఖరున నిర్వహించే ప్రెస్ మీట్ లో రాజమౌళి దీనిపై క్లారిటీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.
ఇక డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై డీవీవీ దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' మూవీలో రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్ర పోషిస్తుండగా, హాలీవుడ్ నటి ఒలివియా ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. శ్రియా శరణ్, అజయ్ దేవ్ గణ్ , సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: Love Story: వినాయక చవితి నాడు ‘లవ్ స్టోరీ’ చెప్పనున్న నాగచైతన్య , సాయిపల్లవి
Also Read: భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్
Also Read: పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?
Also Read: తగ్గేదే లే అంటున్న లీకు వీరులు.. తగ్గిస్తామంటున్న బన్నీ
Also Read: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!
Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?
The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి
Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!
HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్డే సర్ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!
Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
IND vs NZ 3rd T20: శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ - చివరి టీ20లో భారత్ భారీ స్కోరు
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Union Budget 2023: ఇది బ్యాలెన్స్డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్