News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Hari Hara Veera Mallu Release: భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్

మూడేళ్లు..ఏడాది..అప్పుడప్పుడు 6నెలలు..ఈ గ్యాప్ కి ఫిక్సైపోయారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అలాంటిది కేవలం 3 నెలల గ్యాప్ లో పవన్ సినిమాలు రిలీజ్ అంటే...ఇంకేం కావాలే...చాల్లే ఇదిచాల్లే అంటున్నారు అభిమానులు.

FOLLOW US: 
Share:

మొదట్లో ఏడాదికో సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్...అప్పుడప్పుడు ఏడాదికి రెండు సినిమాలు చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు. పొలిటికల్ ఎంట్రీతో వకీల్ సాబ్ సినిమాకు మూడేళ్లు గ్యాప్ తీసుకున్నప్పటికీ... ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని సంబరాలు చేసుకున్నారు అభిమానులు. మరి ఇప్పటి వరకూ ఓ లెక్క.....ఈసారి మరో లెక్క అంటున్నాడు పవన్ కళ్యాణ్. మూడేళ్లు.. ఏడాది.. ఆరునెలలు కాదు.. కేవలం మూడే నెలల గ్యాప్ లో సందడి చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. ఆ రెండు ప్రాజెక్టులు భారీ అంచనాలున్నవే కావడం విశేషం.


వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ‘వకీల్ సాబ్’తో వచ్చి హిట్ కొట్టాడు. త్వరలో ‘భీమ్లా నాయక్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా కంటే ముందు ప్రారంభించిన ‘హరి హర వీరమల్లు’ మాత్రం భీమ్లానాయక్ తర్వాతే రానుంది. కెరీర్‌లో తొలిసారి పవన్ కళ్యాణ్ చారిత్రక పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా మొఘలాయి రాజులను  ఎదిరించిన ’హరి హర వీరమల్లు’ ప్రతాపం తెరపై ఎలా ఉండబోతుందో అని  ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

Also Read: తగ్గేదే లే అంటున్న లీకు వీరులు.. తగ్గిస్తామంటున్న బన్నీ

హరిహర వీరమల్లులో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి  ఏ ఎం రత్నం నిర్మాత. ఇప్పటికే కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా కరోనా ప్రభావంతో వాయిదా పడింది. ఈ మధ్యే కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్. విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ నటిస్తున్నారు.

‘భీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్:

సంక్రాంతికి ‘భీమ్లానాయక్’: ముందుగా హరిహర వీరమల్లు సినిమాను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ షూటింగ్ లేట్ అవడంతో పాటూ...అదే సమయానికి  పవన్ కళ్యాణ్ మరో మూవీ ‘భీమ్లా నాయక్’ డేట్ ఫిక్స్ చేశారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే... భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్‌ను పరిచయం చేశాం కానీ ఇదే టైటిల్ ఫిక్స్ కాదంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో రానా పాత్రను పరిచయం చేసిన తర్వాత మరో పేరు ప్రకటిస్తామంటున్నారు. కానీ ఇప్పటికే మాస్‌లో ‘భీమ్లా నాయక్’ టైటిల్ వెళ్లిపోయింది. నిర్మాతలు భీమ్లా నాయక్ కాకుండా మరో పేరు పెడతారన్నది ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

ఖుషి రిలీజ్ రోజే హరి హర వీరమల్లు: ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’  27 ఏప్రిల్ 2022న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. పైగా అదే డేట్‌లో ‘ఖుషీ’ విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో సెంటిమెంట్ కలిసొస్తుందనే ఉద్దేశ్యంతో హరి హర వీరమల్లు’కు అదే విడుదల తేదిని ఖరారు చేస్తారనేది ఇన్‌సైడ్ టాక్. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ‘హరి హర వీరమల్లు’ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు   ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫ్యాన్స్ కోసం మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తున్నట్టు  సమాచారం.

 ఇంత తక్కువ గ్యాప్ ఇదే ఫస్ట్ టైం: 1996లో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.... ఆతర్వాత 1997లో గోకులంలో సీత మూవీ చేశాడు. 1998లో మాత్రం సుస్వాగతం, తొలిప్రేమలో రెండు మూవీస్ లో నటించాడు.  ఆ తర్వాత తమ్ముడు, బద్రీ, ఖుషీకి ఒక్కో ఏడాది గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్...ఖుషి తర్వాత జానీతో వచ్చేందకు  రెండేళ్లు సమయం పట్టింది. మళ్లీ 2006,2011,2012 లో రెండు రెండు సినిమాలతో వచ్చాడు. మళ్లీ అత్తారింటికి దారేది గోపాల గోపాలకి మధ్య రెండేళ్లు పట్టింది. 2015 లో గోపాల గోపాల ఆ తర్వాత  సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, 2018 అజ్ఞాతవాసివరకూ ఏడాదికోసినిమా చేస్తూ వచ్చాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ లో ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఈ సారి అంతకుమించి అన్నట్టు కేవలం మూడు నెలల గ్యాప్ లో అంటే సంక్రాంతికి భీమ్లానాయక్, సమ్మర్ ఆరంభంలో హరి హర వీరమల్లుతో వచ్చి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడని టాక్.

Also Read: ఇష్క్‌బాయ్‌ని బెదిరిస్తోన్న మిల్కీ బ్యూటీ.. చూపులతో కాదు తుపాకీతో..

Also read: స్టార్ హీరోలా..అయినా తగ్గేదేలే అంటున్న లీకువీరులు..సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ పెద్దలు

Also Read: షాకింగ్.. ‘బిగ్‌బాస్’ నుంచి ఆ సింగర్, యాంకర్ ఔట్! ఎందుకిలా చేశారు?

Also Read: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!

Published at : 18 Aug 2021 11:48 AM (IST) Tags: pawan kalyan Krish Movie Hari Hara Veera Mallu Bhemla Nayak Release Date

ఇవి కూడా చూడండి

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

టాప్ స్టోరీస్

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ

Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ

Ujjain Rape Case: 'నా కొడుకుని ఉరి తీయాలి', ఉజ్జయిని రేప్ కేసు నిందితుడి తండ్రి డిమాండ్

Ujjain Rape Case: 'నా కొడుకుని ఉరి తీయాలి', ఉజ్జయిని రేప్ కేసు నిందితుడి తండ్రి డిమాండ్

బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు

బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు