Venkatesh Rana Web Series: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!
కృష్ణం వందే జగద్గురుంలో ఓ సాంగ్ లో కలసి స్టెప్పులేసిన బాబాయ్- అబ్బాయ్ త్వరలో కలసి నటించబోతున్నారు. చాలా రోజుల క్రితమే ఈ వార్త వచ్చినప్పటికీ..రీసెంట్ గా సురేష్ బాబు ట్వీట్ తో అఫీషియల్ అయింది...
ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓటీటీ హవా నడుస్తోంది. ఎప్పటికప్పుడూ సరికొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ అవుతున్నాయి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్. అందుకే స్టార్ హీరో హీరోయిన్స్ కూడా డిజిటల్ అరంగేట్రం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడీ రూట్లో అడుగేస్తున్నాడు విక్టరీ వెంకటేష్. అదికూడా అబ్బాయ్ రానాతో కలసి. వెంకీ-రానా కలసి నటిస్తే చూడాలని దగ్గుపాటివారి అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇది వరకు రానా హీరోగా నటించిన కృష్ణం వందే జగద్గురమ్ సినిమాలో ఓ పాటలో వెంకటేశ్ తళుక్కున మెరిశాడు. అయితే వీరిద్దరూ పూర్తిస్థాయి పాత్రల్లో నటిస్తే చూడాలన్న ఫ్యాన్స్ కోరిక ఇన్నాళ్లకు నెరవేరబోతోంది.
Also Read: వెంకటేష్ సినీ జర్నీకి 35 ఏళ్లు.. అద్భుతమైన వీడియోను షేర్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్
వెంకటేశ్, రానా దగ్గుబాటి ఓ హిందీ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారని... దీన్ని ఇతర భాషల్లోని అనువాదం చేసి విడుదల చేస్తారని, ప్రముఖ డిజిటల్ ఛానెల్ నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తుందని ఎప్పటి నుంచో వార్తలొచ్చాయ్. అయితే వెంకీ-రానా వారివారి కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండడంతో అఫీషియల్ గా ప్రకటించలేదు. ఇప్పుడీ విషయంపై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత సురేష్‌బాబు. ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో చర్చించిన సురేష్ బాబు... వెంకటేష్ కొత్త ప్రాజెక్ట్ విషయమై పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. వెంకీ త్వరలో నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ హిందీ వెబ్‌సిరీస్ చేయనున్నాడని చెప్పారు. ఇందులో రానా కూడా నటిస్తాడని చెప్పాడు.
Also Read: దక్షిణాది సినిమాల సత్తా చాటిన క్రియేటివ్ దర్శకుడు… హ్యాపీ బర్త్ డే శంకర్…
విభిన్నమైన కథాంశంతో రూపొందనున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళుతుందని చెప్పారు. హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందా? యాక్షన్ కోణంలో సాగుతుందా? అన్నది స్పష్టత ఇవ్వలేదు.
Also Read: సంపూ ‘రౌడీ బజార్’ ట్రైలర్.. కాలితో తన్నితే బైకు గాల్లోకి లేచింది, డైలాగ్స్ అదుర్స్!
వెంకటేశ్ ప్రస్తుతం ‘ఎఫ్ 3 మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మరో మూవీకి కమిటయ్యాడు. ‘F2’ సూపర్ హిట్ అందుకోవడంతో వెంకీ-వరుణ్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘F3’ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ సినిమా గురించి చెప్పడానికేమంది. గతంలో మాటలందించిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి ఏ రేంజ్ లో హిట్టయ్యాయో... దర్శకుడిగా వెంకీతో చేస్తోన్న ఫస్ట్ మూవీ అంతకుమించి అంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు రానా హీరోగా నటించిన ‘విరాట పర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తారా లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తోన్నాడు రానా. మొత్తంమీద వెంకీ-రానా వారివారి ప్రాజెక్టుల నుంచి రిలీవ్ అయిన వెంటనే వెబ్ సిరీస్ హడావుడి మొదలుకానుంది..
Also Read: జిమ్‌లో మెగాస్టార్‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్