Venkatesh: వెంకటేష్ సినీ జర్నీకి 35 ఏళ్లు.. అద్భుతమైన వీడియోను షేర్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్
రామానాయుడి తనయుడిగా ‘కలియుగ పాండవులు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ హీరోగా 35 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ‘సురేష్ ప్రొడక్షన్స్’ విడుదల చేసిన వీడియో ఇది.
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినా తన టాలెంట్ తో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేశ్. హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 35 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఆడియన్స్‌ని ఆకట్టుకుని.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చారు. హీరోగా వెంకటేశ్ 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సురేష్ ప్రొడక్షన్స్’ వెంకటేష్ నటించిన తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి రీసెంట్ మూవీ ‘నారప్ప’ వరకు నటించిన సినిమాలను ఓ స్పెషల్ వీడియోగా రిలీజ్ చేసింది.
దగ్గుబాటి అభిమానులకు కిక్కిచ్చే వీడియోను మీరూ చూడండి:
అభిమానులందరకీ పేరు పేరునా థ్యాంక్స్ చెబుతున్నా. మరో పదేళ్లో-ఇరవై ఏళ్లో తెలీదు కానీ నటిస్తూనే ఉంటా అంటూ చివర్లో వెంకీ మాటలతో వీడియో ముగించారు.
Also Read: మాటల మాంత్రికుడితో వెంకటేశ్.. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్‌కి మించి అంటున్న ఫ్యాన్స్
వారసత్వం ఎంట్రీ వరకే ఉపయోగపడుతుంది. ప్రతిభ ఉంటే ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కగలం అని నిరూపించిన హీరో వెంకటేశ్. టాలీవుడ్‌లో సక్సెఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో ‘కలియుగ పాండవులు’ మూవీతో తొలి అడుగు వేశారు వెంకటేశ్.’ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1986 ఆగస్టు 14న విడుదలైంది. విజయ్ అనే పాత్రతో ప్రేక్షకులకి పరిచయమైన వెంకటేశ్ తొలి ప్రయత్నంలోనే నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్య కథల్ని ఎంపిక చేసుకుని టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్.. ఎక్కువ రీమేక్ సినిమాల్లో నటించడమే కాదు, సక్సెస్ అందుకున్న నటుడిగానూ రికార్డు సృష్టించారు.
మల్టీస్టారర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వెంకీ.. ఓ వైపు కుటుంబ కథలతో అలరిస్తూనే.. మరోవైపు యూత్, మాస్‌ను మెప్పించే కథల్లోనూ సత్తా చాటుకున్నారు. ఉత్తమ నటుడిగా ఏడు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ‘ఎఫ్ 3 మూవీతో బిజీగా ఉన్న వెంకీ.. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మరో మూవీకి కమిటయ్యారు. ‘F2’ సూపర్ హిట్ అందుకోవడంతో వెంకీ-వరుణ్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘F3’ భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ‘F2’లో ఉన్న పాత్రలే ‘F3’లో కూడా ఉంటాయని చెప్పిన అనిల్ రావిపూడి.. కథ మాత్రం వేరే ఉంటుందని ఇప్పటికే చెప్పారు. ఈ సినిమాలో వెంకటేష్ పాత్రకు రేచీకటి, వరుణ్ తేజ్ పాత్రకు నత్తి ఉంటుందని టాక్. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘నారప్ప’ పాత్రతో ఆకట్టుకున్న వెంకీ.. త్వరలోనే ‘దృశ్యం 2’ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించనున్నారు.
ఏదేమైనా 35 యేళ్ల సినీ ప్రయాణంలో 70కి పైగా సినిమాలు చేసిన ఈ విక్టరీ హీరో.. ఇప్పటికీ హీరోగా ప్రేక్షకుల అభిమానం అందుకుంటూనే ఉన్నారంటే గ్రేటనే చెప్పాలి. అందుకే.. ఆయన ‘విక్టరీ’ వెంకటేశ్ అయ్యారు.