సంపూ ‘బజార్ రౌడీ’ ట్రైలర్.. కాలితో తన్నితే బైకు గాల్లోకి లేచింది, డైలాగ్స్ అదుర్స్!
‘రౌడీలకి రామాయణం చెప్తే రావణాసురుడిని ఫాలో అవుతారు కానీ రాముడ్ని కాదు’.. అంటూ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడీ’ సినిమాతో వచ్చేస్తున్నాడు.
నటుడు సంపూర్ణేష్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ పేరు వింటేనే నవ్వులు విరుస్తాయి. ‘హృదయ కాలేయం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సంపూ.. ఆ తర్వాత పెద్ద హిట్ కొట్టలేదు. అయితే, వెరైటీ టైటిల్స్‌తో ముందుకొస్తూ.. తన లక్ పరీక్షించుకుంటూనే ఉన్నాడు. అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాలలో అతిథి పాత్రలలో కూడా నటించాడు. ఇటీవల ‘కొబ్బరిమట్ట’ సినిమాతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ‘కాలీఫ్లవర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంపూ.. తాజాగా ‘బజార్ రౌడీ’ సినిమాతో ఫుల్ యాక్షన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిర్మాతలు మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Also Read: చిరు vs మోహన్ బాబు.. ‘మా’ ఎన్నికల్లో.. ఎవరి పంతం నెగ్గనుంది?
ట్రైలర్‌లో సంపూ ఉగ్రరూపం చూపించాడు. యాక్షన్ హీరోలా ఫైట్లు చేస్తూ రచ్చ చేస్తున్నాడు. అంతేకాదు.. తనదైన శైలిలో డైలాగులతోనూ దుమ్ము రేపుతున్నాడు. ‘‘ఎనుబోతులను తినే రాబందువు కూడా పక్షి జాతేరా’’ అంటూ సంపూ ఓ ఫైట్ సీన్‌తో ట్రైలర్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ‘‘రౌడీలకు రామాయణం చెబితే రావణాసురుడిని ఫాలో అవుతారు కానీ, రాముడ్ని కాదు’’ అనే మరో డైలాగ్ కూడా ఈ ట్రైలర్‌లో హైలెట్. కాలితో తన్నితే.. బైకు గిరాగిరా తిరిగి సంపూ దగ్గరకు రావడం.. సింహంలా రౌడీల మీదకు దూకడం.. ఒకటి ఏమిటీ.. ఇంకా అలాంటి సీన్లు చాలానే ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమాలో సంపూ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?
ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు సరసన మహేశ్వరి హీరోయిన్‌గా కనిపించనుంది. సాయాజీ షిండే, కత్తి మహేష్, కరాటే కళ్యాణి, షఫీ, పృధ్వీరాజ్, నాగినీడు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు డి.వసంత నాగేశ్వరరావు తెలిపారు. K S క్రియేషన్స్ పతాకంపై సంధి రెడ్డి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకెందుకు ఆలస్యం.. సంపూ ‘బజార్ రౌడీ’ ట్రైలర్ చూసేయండి మరి.
వీడియో:
Also Read: జిమ్‌లో మెగాస్టార్‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?
Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!