Roses in first night: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?

తొలిరాత్రి అనగానే ప్రతి ఒక్కరికీ పూలతో అలంకరించిన మంచమే గుర్తుకు వస్తుంది. అయితే, వాటిలో తప్పకుండా రోజా పూలను ఉపయోగించాలట. ఎందుకో తెలుసా?

FOLLOW US: 

పెళ్లయిన కొత్త జంటకు మరుపురాని రాత్రి.. ‘ఫస్ట్‌నైట్’. రెండు మనసులను ఒక్కటి చేసే ఈ మధురమైన రాత్రి గురించి జంటలు ఎన్నో కలలుగంటారు. సృష్టికి మూలమైన శృంగార కేళికి సిద్ధమవుతారు. తొలిరాత్రి అనగానే ప్రతి ఒక్కరి మదిలో.. పూల అలంకరణే గుర్తుకు వస్తుంది కదూ. మన సినిమాల్లో కూడా ఫస్ట్ నైట్ సీన్లను చాలా రిచ్‌గా చూపిస్తారు. దీంతో ప్రతి ఒక్కరూ తమ తొలిరాత్రి అంత గ్రాండ్‌గా ఉండాలని భావిస్తారు. 

ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. పెళ్లి మండపాలనే కాదు, ఫస్ట్ నైట్ బెడ్‌ చిత్రాలను సైతం స్టేటస్‌గా పోస్ట్ చేసుకుని నేటితరం మురిసిపోతున్నారు. అయితే, తొలిరాత్రిలో పూల అలకరణ అనేది కేవలం ఫొటోల కోసమో, వీడియోల కోసమో చేసేది కాదు. దాని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బెడ్ మీద పరిచే రోజా పూలు కొత్త జంటకు ఎంతో మేలు చేస్తాయట. అందుకే, తొలిరాత్రి తప్పకుండా బెడ్ మీద రోజా పూలను లేదా వాటి రేకులను చల్లాల్సిందేనని అంటున్నారు. మరి దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా!

రోజా పూల గురించి చెప్పుకొనే ముందు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉపయోగించే మల్లెపూలు గురించి తెలుసుకుందాం. తొలిరాత్రికి ఆ గది మల్లెపూలతో పరిమళిస్తుంది. ఆ గదిలోకి అడుగుపెట్టే ఎవరికైనా సరే మూడ్ మారిపోవల్సిందే. ఆ వాసన మెదడుకు ఎంతో హాయిని అందిస్తుంది. అలాగే గులాబీల పరిమళం కూడా వధువురుల్లో కోరికలను ప్రేరేపిస్తాయట. పెళ్లి హడావిడిలో అలసిపోయిన ఆ జంటకు గులాబీల వాసన నరాలను రిలాక్స్ చేసి మంచి మూడ్‌ను అందిస్తుందట. దానివల్ల ఆ రాత్రి వారు మనసు విప్పి మాట్లాడుకోడానికి అవకాశం కలుగుతుందట. 

తొలిరాత్రి అంటే చాలామందికి అదే మొదటి అనుభవం. ముఖ్యంగా శృంగారం గురించి ఓనమాలు నేర్చుకొనే రాత్రి అది. ఈ నేపథ్యంలో చాలామంది బిడియంతో ఉంటారు. భయంతో వణికిపోతుంటారు. అలాంటివారికి గులాబీలు ఆహ్లాదాన్ని అందిస్తాయి. ముఖ్యంగా ఎర్ర గులాబీలు ఇరువురి మధ్య ప్రేమను ప్రేరేపిస్తాయి. గులాబీల వాసన శృంగార ప్రేరణ కలిగిస్తాయి. ఫలితంగా వారు ఎలాంటి ఆందోళన లేకుండానే ఆ పరిమళాల మధ్య ఆ అనుభవాన్ని పొందుతారు. 

గులాబీ రేకులను పాలు, పరమాన్నంలో కూడా కలుపుతారు. ఎందుకంటే గులాబీలు లైంగిక కోరికలను ప్రేరేపించే సహజమైన ఔషదంగా పనిచేస్తుంది. వాటిని తీసుకోవడం వల్ల ఇరువురిలో శృంగార కోరికలు పెరిగి.. తొలిరాత్రి చక్కని అనుభూతి లభిస్తుందనే కారణంతో మన పెద్దలు గులాబీలను తొలిరాత్రిలో భాగం చేశారు. మల్లెపూలు, లిల్లీ పూలు తరహాలో గులాబీలు ఘాటైన పరిమళాన్ని అందించవు. కానీ, ఎన్ని రోజులైనా ఆ వాసన తాజాగానే అనిపిస్తుంది. కాబట్టి.. మీ ఇంట్లో ఎవరిదైనా పెళ్లి ఉంటే.. ఫస్ట్ నైట్ డెకరేషన్‌లో రోజా పూలనే ఎక్కువగా వాడండి. 

Published at : 06 Aug 2021 12:29 PM (IST) Tags: First night decoration first night Roses in first night Roses uses Flower decoration in first night తొలిరాత్రి రోజా పూల అలంకరణ

సంబంధిత కథనాలు

Sesame Oil: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం

Sesame Oil: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం

Mutton Pickel: మటన్ నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలైనా తాజాగా ఉంటుంది

Mutton Pickel: మటన్ నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలైనా తాజాగా ఉంటుంది

Menstrual Flow: సమయానికి పీరియడ్స్ రావాలా? అయితే వీటిని తరచూ తినండి

Menstrual Flow: సమయానికి పీరియడ్స్ రావాలా? అయితే వీటిని తరచూ తినండి

Maggi: పిల్లల కోసం మ్యాగీని ఇలా వండి హెల్తీ మీల్‌గా మార్చేయండి

Maggi: పిల్లల కోసం మ్యాగీని ఇలా వండి హెల్తీ మీల్‌గా మార్చేయండి

Chocolate: మూడ్ బాగోలేదా? వెంటనే ఓ చాక్లెట్‌ ముక్కను నోట్లో వేసుకోండి

Chocolate: మూడ్ బాగోలేదా? వెంటనే ఓ చాక్లెట్‌ ముక్కను నోట్లో వేసుకోండి

టాప్ స్టోరీస్

No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !

No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !

IND vs SL Womens: రికార్డు సృష్టించిన స్మృతి మంథన, షెఫాలీ వర్మ - ఒక్క వికెట్ కూడా పడకుండా!

IND vs SL Womens: రికార్డు సృష్టించిన స్మృతి మంథన, షెఫాలీ వర్మ - ఒక్క వికెట్ కూడా పడకుండా!

Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!

Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!

IND Vs ENG 5th Test England Target: 245 పరుగులకు టీమిండియా ఆలౌట్ - ఇంగ్లండ్ లక్ష్యం భారీనే అయినా!

IND Vs ENG 5th Test England Target: 245 పరుగులకు టీమిండియా ఆలౌట్ - ఇంగ్లండ్ లక్ష్యం భారీనే అయినా!