Illu Illalu Pillalu Serial Today March 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్‌ని చితక్కొట్టిన రామరాజు! కేసు పెట్టిన అమూల్య! నర్మద, ప్రేమల పరిస్థితేంటి?
Illu Illalu Pillalu Serial Today Episode March 18th | అమూల్యని కిడ్నాప్ చేశాడని రామరాజు విశ్వక్‌ని చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode భాగ్యం శ్రీవల్లితో నువ్వు ఒట్టి అమాయకురాలివి..ఈ లోకంలో ఎలా బతుకుతావా అని భయపడ్డాం కానీ నువ్వు అదును చూసి వాళ్ల పని భలే పట్టావ్.. ఇక ఆ నర్మద,ప్రేమల్ని ఎవరూ నమ్మరు.. వేదవతి తర్వాత ఇంటి అధికారం నీదే అని అంటుంది. అమూల్యని మనమే విశ్వక్ దగ్గరకు తీసుకెళ్లామని లీక్ కాలేదు కదా అని భాగ్యం అడిగితే అంతా నేను మ్యానేజ్ చేశా.. మొత్తం ప్రేమ, నర్మదల మీదకు తోసేశా అని శ్రీవల్లి చెప్తుంది.
భాగ్యం కూతురితో ప్రేమ, నర్మదలు మనకి దొరికారు అని సంబరపడిపోవద్దు.. ఇంట్లో అందరినీ గమనిస్తూ ఉండు.. ముఖ్యం మీ ఆయన్ను గమనించు,, ఏమైనా చేసే ముందు నాకు చెప్పు నీ సొంత తెలివి తేటలు వద్దు అని చెప్తుంది భాగ్యం. మరోవైపు విశ్వక్ మందు తాగుతూ అమూల్య పీడ అయిపోయిందని రేపటి నుంచి తన అన్నలు వచ్చి తన కాలు పట్టుకొని బతిమాలుతారని అంటాడు. ఇక రామరాజు, తిరుపతి కూడా మందు తాగుతూ ఉంటారు. తిరుపతి బావతో వాడి కాలు విరగ్గొట్టాలి బావ,,.మన ఇంటి ఆడపిల్లని కిడ్నాప్ చేస్తాడా.. వాడి కాళ్లు చేతులు విరగ్గొట్టేయాలి అంటాడు. నేనే ఆ పని చేస్తా అని రామరాజు వెళ్తాడు. తిరుపతి వద్దని చెప్పినా రామరాజు వెళ్లిపోతాడు.
చందు ఇద్దరు తమ్ముళ్లతో మీరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు కానీ మీ భార్యలు ఏ విషయం మీకు చెప్పడం లేదు.. మీతో పంచుకోవడం లేదు.. ఇంత జరిగిన తర్వాత కూడా మీ భార్యలు మీకు విషయం చెప్పుంటే చెల్లి పరిస్థితి ఈ రోజు ఇలా ఉండేది కాదు కదా.. నాకు నాన్న పెళ్లి చేశారు.. కానీ నా భార్య ప్రతీది నాకు చెప్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి మామయ్య పరువు, అత్తకు సాయం చేయడం ఇదే తన పనులు.. మిగతా ఏ విషయాల్లోనూ వేలు పెట్టదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న మీ భార్యలు మాత్రం మీ చెప్పు చేతల్లో లేరు అని అంటాడు. శ్రీవల్లి వచ్చి వాళ్లేదో చిన్న పిల్లలు వదిలేయ్ బావ.. అయినా మన మంచి కోసం ఆలోచించి అలా చేసుంటారు అని అంటుంది. ఏది మంచి వదిన.. ప్రేమ తన ఇంటికి సపోర్ట్ చేసింది అని ధీరజ్ అంటాడు. సాగర్ కూడా నర్మదకి పొగరు అని అంటాడు. వాళ్లకి బుద్ధి రావాలి,, మీలా మారాలి అని అంటారు. శ్రీవల్లి మనసులో వీళ్లు నా గురించి చాలా ఊహించుకుంటున్నారు.. నా గురించి తెలిస్తే పరిస్థితి ఏంటో అని అనుకుంటుంది.
సాగర్ నర్మద సంగతి చెప్తా అని గదిలోకి వెళ్తాడు. ఇంతలో తిరుపతి వచ్చి రామరాజు విశ్వక్‌ని కొట్టడానికి వెళ్లాడని ధీరజ్‌తో చెప్తాడు. రామరాజు విశ్వక్‌ని చితక్కొడతాడు. ధీరజ్ వెళ్లి రామరాజుని ఆపి వాడి సంగతి నేను చూసుకుంటా వదిలేయ్ నాన్న అని తండ్రిని తీసుకెళ్తాడు. విశ్వక్ ఫ్రెండ్స్ విశ్వక్‌ని ఇంటికి తీసుకెళ్తారు. సాగర్ నర్మద బెడ్ మీద ఉంటే చాప, దిండు కింద వేసుకుంటాడు. అదేంటి అని నర్మద అడుగుతుంది. దానికి సాగర్ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అని అంటాడు. ధీరజ్, ప్రేమల మధ్య కూడా సేమ్ అదే సంభాషణ జరుగుతుంది. సాగర్, ధీరజ్ ఇద్దరూ భార్యల మీద అరుస్తారు. నేను నీకు అన్నీ చెప్పాలి.. కానీ నువ్వు నాకు ఏం చెప్పవు.. నా చెల్లిని ఇన్ని రోజులు నా శత్రువుల ఇంట్లో ఉంచాలని చూశావ్ కనీసం నాకు ఒక్క మాట చెప్పాలి అనిపించలేదా అని అడుగుతారు. మొగుడిలా నీ దగ్గర నాకు విలువ లేదా.. అని సాగర్ నర్మదని అడుగుతాడు. నర్మద, ప్రేమ ఇద్దరూ ఏడుస్తారు.
ధీరజ్ అమూల్యని తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు అన్నయ్యా అని అమూల్య అడిగితే చెప్తాను పద అని తీసుకెళ్తాడు. ధీరజ్ ఎస్‌ఐ గారితో విశ్వక్ మీద కిడ్నాప్ కేసు పెట్టాలి అని మొత్తం ఎస్‌ఐకి చెప్తారు. అమూల్య మొత్తం ఎస్‌ఐ గారికి చెప్తుంది. పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారు. మరోవైపు రామరాజు ఇంట్లో ఉగాది వేడుకలు మొదలవుతాయి. వేదవతి భర్తకి ఉగాది పచ్చడి పంచుతుంది. అమూల్య గురించి అడిగితే ధీరజ్ బయటకు తీసుకెళ్లాడని ప్రేమ చెప్తుంది. ఇంట్లో చెప్పకుండా ఎందుకు తీసుకెళ్లాడు అని వేదవతి అడిగితే గుడికి తీసుకెళ్లుంటాడు అని రామరాజు అంటాడు. ఇక నర్మద, ప్రేమలు ఉగాది పచ్చడి కోసం చేయి చాస్తే వేదవతి వల్లీకి ఇచ్చి అందరికీ ఇవ్వమని అంటుంది. రామరాజు, వేదవతిలు ఇన్‌డైరెక్ట్‌గా పచ్చడిలో పులుపు, చేదు రుచులు గురించి మాట్లాడుతూ నర్మద, ప్రేమల్ని అంటారు. వల్లీ కావాలనే ఇక నుంచి అయినా అత్తయ్యా, మామయ్య అర్థం చేసుకోవాలని చెప్తున్నారు అంటే వదిలేయ్ అమ్మా మమల్ని అర్థం చేసుకోవడానికి అందరూ వల్లీలు కాదు కదా అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ట్రెండింగ్ వార్తలు






















