Maestro Film Update: ఇష్క్‌బాయ్‌ని బెదిరిస్తోన్న మిల్కీ బ్యూటీ.. చూపులతో కాదు తుపాకీతో..
అమాయకంగా కనిపిస్తోన్న నితిన్...తుపాకి గురిపెట్టిన తమన్నా...ఊహించుకోవడానికే ఏదోలా ఉంది కదా. నిన్నటి వరకూ క్యూట్ గా కవ్వించిన మిల్కీబ్యూటీ ఇప్పుడు విలన్ అవతారమెత్తింది.
నితిన్- తమన్నా- నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాస్ట్రో` విడుదలకు సిద్ధంగా ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం నితిన్ -తమన్నా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. నితిన్ బ్లేజర్ ధరించి సన్ గ్లాసెస్ లో స్టైలిష్ గా కనిపిస్తుండగా...తమన్నా గన్ చేతపట్టి హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఈ మూవీలో తమన్నా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర పోషిస్తోందని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా హీరోయిన్. ఇప్పటికే నితిన్..నభా పోస్టర్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.
ALSO READ: హీరో రామ్ చరణ్ జాతీయ జెండాను అవమానించారంటూ ట్రోల్స్? అసలు ఏం జరిగింది?
ALSO READ: చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?
తమిళంలో కూడా ఈ సినిమా రీమేక్ పనులు జరుగుతున్నాయి. కానీ తెలుగు రీమేక్ పై ఉన్నంత ఆసక్తి తమిళంపై లేదంటున్నారు ప్రేక్షకులు. కారణం సరైన నటులను ఎంపిక చేసుకోకపోవడమే. అవుట్ డేటెడ్ డైరెక్టర్ చేతిలో సినిమాను పెట్టడం ఓ కారణం అయితే... సీనియర్ హీరో ప్రశాంత్, టబు రోల్ కోసం సిమ్రాన్ ని తీసుకున్నారు. క్యాస్టింగ్‌తోనే సగం ఇంట్రెస్ట్ పోయిందంటున్నారంతా. ఈ సినిమాకు ముందుగా జేజే ఫ్రెడరిక్ అనే యంగ్ డైరెక్టర్‌ని తీసుకున్నారు. కానీ ఏం జరిగిందో.. ఏమో కానీ తనని తప్పించి.. ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్‌ను డైరెక్టర్‌గా తీసుకున్నారు. నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన త్యాగరాజన్ ఆ తరువాత దర్శకుడిగా మారి తన కొడుకుని హీరోగా పెట్టి సినిమాలు తీశారు. కానీ ఏది వర్కవుట్ కాలేదు. అలాంటి వ్యక్తి ‘అంధాధూన్’ లాంటి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ ని ఎంతవరకు డీల్ చేయగలరో అనే డిస్కషన్ జరుగుతోంది.
ALSO READ:వెంకటేష్ సినీ జర్నీకి 35 ఏళ్లు.. అద్భుతమైన వీడియోను షేర్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్
ALSO READ: మతిపోగొడుతున్న డాటరాఫ్ అతిలోకసుందరి..
ALSO READ: కుర్రాళ్ల గుండెలు పిండేసేలా హార్లీ డేవిడ్సన్ బైక్‌పై దివి హాట్ ఫొటోషూట్..
బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా, టబు నటించిన అంధాధూన్ అవార్డులు, రివార్డులు అందుకుంది. ఈ మూవీ తెలుగు రీమేక్ లో ఆయుష్మాన్ ఖురానా పాత్రలో నితిన్, టబు క్యారెక్టర్‌లో మిల్కీబ్యూటీ తమన్నా, రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. వాస్తవానికి టబు పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుందన్నారు... ఆతర్వాత నయనతార పేరు కూడా తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు తమన్నా ఫైనలైంది. ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్న చిత్ర యూనిట్ ఇంకా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేదు. పరిస్థితి చూసుకుని థియేటర్లలోనా...ఓటీటీలోనా అనేది నిర్ణయిస్తారు. పరిస్థితి అంతా సద్దుమనిగితే ఆఖరి నిముషంలో థియేటర్లో విడుదల చేసినా చేయొచ్చు.
ALSO READ: షాకింగ్.. ‘బిగ్‌బాస్’ నుంచి ఆ సింగర్, యాంకర్ ఔట్! ఎందుకిలా చేశారు?