Ram Charan: హీరో రామ్ చరణ్ జాతీయ జెండాను అవమానించారంటూ ట్రోల్స్? అసలు ఏం జరిగింది?
సెలబ్రిటీలంటేనే ఎప్పటికీ వారిపై ఓ కన్నేసి ఉంచుతుంటారు జనం. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీస్ షేర్ చేసే కొన్ని ఫోటోలు ఊహించని విధంగా ట్రోల్ అవుతుంటాయి. రామ్ చరణ్ విషయంలో ఇదే జరిగింది. ఏం జరిగిందంటే....
భారతదేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ.. వారికి నివాళులర్పిస్తూ భారతీయులందరూ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. సెలబ్రిటీలంతా సోషల్ మీడియా ద్వారా ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం జాతీయ జెండాను అవమానించారంటూ విపరీతంగా ట్రోల్స్ చేశారు నెటిజన్లు.
Also Read: ఆన్ టైమ్ కు ఆర్ఆర్ఆర్ వస్తుందా..? చరణ్ ఎందుకు అలా అన్నాడు..?
హ్యాపీ మెుబైల్స్ అనే సంస్థకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. స్వాత్యంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సదరు సంస్థ పేపర్ ప్రకటన ఇచ్చింది. అందులో చరణ్ జాతీయ జెండాను పట్టుకున్నట్లు ఉంది. అయితే జెండా మధ్యలో అశోక చక్రం లేదు. దీంతో అశోక చక్రం లేకుండా జాతీయ జెండాను అవమానించారంటూ పెద్ద ఎత్తున నెటిజనులు ట్రోలింగ్ చేశారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ లో 'దోస్తులు'.. ఎంజాయ్ చేస్తున్నారుగా..
2002 జాతీయ జెండా చట్టం ప్రకారం ఇలా అశోక చక్రం లేకుండా జెండా ప్రదర్శించడం అనేది ఓ నేరం. దీంతో ఈ ఇష్యూ చర్చల్లో నిలిచింది. చెర్రీపై ట్రోలింగ్ ఊపందుకోవడంతో సంస్థ నిర్వాహకులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వ్యాపార ప్రకటనల కోసం జాతీయ జెండాను ఉపయోగించకూడదు. ‘‘యాడ్స్ ఇచ్చేటప్పుడు జాతీయ జెండాలా ఉండే త్రివర్ణ పతాకాన్ని మాత్రమే వాడాలి. అందుకే అశోక చక్రం లేకుండా ఉన్న జాతీయ జెండాను వాడాం’’ అంటూ సదరు సంస్థ క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పటికైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో మళ్లీ ఎవరైనా ఆజ్యం పోస్తారో చూడాలి.
Also Read: ఎవరు మీలో కోటీశ్వరులు.. రామ్ చరణ్‌తో ఎన్టీఆర్ ఎంట్రీ, ప్రోమో అదుర్స్!
ఇక చెర్రీ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో...కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తైయింది. అందులో ఓ పాటను చిరు, చరణ్‌లపై పిక్చరైజ్ చేయనున్నారు. మరో సాంగ్‌ను రామ్ చరణ్, పూజా హెగ్డే లపై షూట్ చేస్తారు. దీంతో సినిమాకు గుమ్మడి కాయ కొట్టేస్తారు. మరోవైపు చరణ్.. శంకర్ దర్శకత్వంలో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్టు సమాచారం.