By: ABP Desam | Updated at : 15 Aug 2021 09:50 PM (IST)
Image Credit: Gemini Tv
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైపోతున్నారు. త్వరలో జెమినీ టీవీలో ప్రారంభం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ (EMK) అనే రియాలిటీ షోలో మొదటి ఎపిసోడ్‌లో హీరో రామ్ చరణ్ పాల్గొనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోమోను విడుదల చేశారు. ఆగస్టు 22 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం నుంచి బుధవారం వరకు రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుందని నిర్వాహకులు ప్రకటించారు.
ఇక ప్రోమో విషయానికి వస్తే.. RRR సినిమాతో అభిమానులను ఊరిస్తున్న రామ్, ఎన్టీఆర్‌లు స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చారు. రామ్ హోస్ట్ సీట్‌లో కూర్చోడానికి ప్రయత్నిస్తుంటే.. ఎన్టీఆర్ అడ్డుకుని ‘‘ఇది హోస్ట్ సీట్.. అది హాట్’’ సీట్ అని తెలిపారు. అయితే, నేను కొన్ని ప్రశ్నలు అడగానుకుంటున్నా అని రామ్ అనడంతో.. ‘‘బాబోయ్ నీకు దన్నం పెట్టేస్తా’’ అని ఎన్టీఆర్ అన్నారు. దీంతో రామ్ ‘‘ఆ ప్రశ్నలు ఇక్కడ ఎందుకులేండి’’ అంటూ హాట్ సీట్‌లో కూర్చున్నారు. మొత్తానికి ప్రోమో చూస్తుంటే.. మొదటి ఎపిసోడ్ తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకొనేలాగే ఉంది.
ప్రోమో వీడియో:
ఒకప్పుడు ఈ కార్యక్రమం.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో మాటీవీలో ప్రసారమయ్యేది. ఈ కార్యక్రమానికి అప్పట్లో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. మొదటి మూడు సీజన్స్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా నాలుగో సీజన్‌కు మాత్రం మెగాస్టార్ చిరంజీవి బాధ్యత వహించారు. దీని ప్రకారం చూస్తే ఎన్టీఆర్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ను సీజన్-5గా చెప్పుకోవచ్చు. అయితే, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే టైటిల్‌ను ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’గా మార్చడం ఒక్కటే ఇందులో మార్పు. అలాగే.. ఇప్పుడు ఈ షోను ‘మాటీవీ’కి బదులుగా ‘జెమినీ టీవీ’ ప్రసారం చేయనుంది. ఎన్టీఆర్ హోస్ట్ అనగానే ఈ షోపై అంచనాలు బాగా పెరిగాయి. తప్పకుండా ఈ షో.. మాంచి టీఆర్పీ ఇస్తుందని భావిస్తున్నారు. గత సీజన్లు కూడా మంచి టీఆర్పీ సొంతం చేసుకున్న నేపథ్యంలో నిర్వాహకులు ఈ షోపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.
Also Read: తన బాధ్యత నాదే.. నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం అదే, రష్మీ భావోద్వేగం.. సుధీర్ గుడ్ న్యూస్!
Also Read: బిగ్‌బాస్ సీజన్ 5 ప్రోమో.. బోర్‌డమ్‌కు గుడ్‌బై అంటూ గన్ పట్టిన నాగ్!
Also Read: ఖాకీ వదిలి లుంగీతో పవన్ కల్యాణ్ రచ్చ.. క్యాప్షన్ అక్కర్లేదంటూ రానాకు వార్నింగ్
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?