Big Boss 5 Telugu: షాకింగ్.. ‘బిగ్‌బాస్’ నుంచి ఆ సింగర్, యాంకర్ ఔట్! ఎందుకిలా చేశారు?
బిగ్ బాస్ సీజన్ 5కి ఏర్పాట్లు చకచకా సాగతున్నాయి. త్వరలోనే మీ నట్టింట్లో అంటూ ప్రోమో సందడి చేస్తోంది. అయితే ఇదిగో కంటిస్టెంట్స్ అంటూ ఇప్పటి వరకూ వైరల్ అయిన లిస్టులోంచి కొందరు తప్పుకున్నారు...ఎందుకంటే..
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ క్రేజ్ గురించి మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్ని భాషల్లోనూ మాంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ షో తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తిచేసుకోగా త్వరలో సీజన్ 5 ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ లు ఎవరా అని బిగ్ బాస్ షో లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపించాయి. కింగ్ నాగ్ హోస్ట్ చేయనున్న ఈ సీజన్ ను కూడా సెప్టెంబర్ లో మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే వినిపించిన జాబితాలోంచి కొందరు తప్పుకున్నారట.
ఎవరు తప్పుకున్నారంటే..
బిగ్ బాస్ సీజన్ 5 కంటిస్టెంట్స్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేసిన పేర్లు ఏంటంటే...యాంకర్ రవి, సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, గ్లామర్ యాంకర్ వర్షిణి, రఘు మాస్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, లోబో, సింగర్ మంగ్లీ, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, టీవీ9 ప్రత్యూష పేర్లు ఉన్నాయి. అయితే ఇందులో ఫైనల్ లిస్ట్ కంటెస్టెంట్లపై ఇప్పటికే ఏవీ షూట్ కూడా పూర్తిచేయగా హోస్ట్ నాగ్ మీద చేసిన ప్రోమో కూడా విడుదలైంది.
ఆగస్టు ఆఖరి వారంలో కంటిస్టెంట్స్ ని క్వారంటైన్ కు కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఏంటంటే.. యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ప్రస్తుతం మంగ్లీ గాయనీగా ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో బిగ్‌బాస్ షోకు నో చెప్పిందట. యాంకర్‌గా కెరీర్‌లో ఇప్పుడిప్పుడో జోరందుకుంటున్న వర్షిణి కూడా పలు షోలతో బిజీగా ఉన్న కారణంగా బిగ్‌బాస్ ఆఫర్ వదులుకున్నట్లు సమాచారం.
పలు సీరియల్స్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన నవ్యస్వామి కూడా ఈ షోలో పార్టిస్పేట్ చేయడం లేదని చెప్పిందట. షో రూల్స్ తను ఫాలో కాలేనని అందుకే తప్పుకుంటున్నా అని చెప్పిందని టాక్. సీరియల్స్ ద్వారా భారీగా సంపాదించుకుంటున్న నవ్యకి మంచి మంచి ఆఫర్లే వస్తున్నాయి. ఇలాంటి సమయంలో రోజుల తరబడి బిగ్ బాస్ హౌస్‌లో ఉండిపోతే కష్టమని భావిస్తోందట.
బిగ్‌బాస్ సీజన్ -5 ప్రోమో:
ఇప్పటివరకు తెలుగులో వచ్చిన నాలుగు సీజన్లు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు ఐదో సీజన్ కూడా అంతకుమించి అంటున్నారు నిర్వాహకులు. అయితే ప్రతి సీజన్లోనూ నాలుగైదు నెలల ముందు నుంచీ ఇదిగో కంటిస్టెంట్స్ లిస్ట్ అని వినిపించడం...ఆ తర్వాత వీళ్లు తప్పుకున్నారు వాళ్లు తప్పుకున్నారని చెప్పడం కామన్. ఏదేమైనా .. బిగ్ బాస్ షో ప్రారంభం రోజు ఎవరెవరు ఇంట్లో అడుగుపెడతారో చూడాలి మరి..
ALSO READ: బిగ్‌బాస్ సీజన్ 5 ప్రోమో.. బోర్‌డమ్‌కు గుడ్‌బై అంటూ గన్ పట్టిన నాగ్!