By: ABP Desam | Updated at : 16 Aug 2021 07:15 PM (IST)
పుష్ప, సర్కార్ వారి పాట లీకులపై సైబర్ పోలీసులకు మైత్రి మూవీ మేకర్స్ ఫిర్యాదు
కరోనా కొట్టిన దెబ్బనుంచి ఇండస్ట్రీ ఎప్పటికి బయటపడుతుందో తెలీదు...ఇలాంటి పరిస్థితుల్లో అంతో ఇంతో నష్టాన్ని పూడ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు టాలీవుడ్ వర్గాలు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో రకంగా లీకులు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న సినమా పెద్ద సినిమా అనే తేడాలేదు...కొబ్బరి కాయ కొట్టి షూటింగ్ మొదలైనప్పటి నుంచి గుమ్మడి కాయ కొట్టి ఆ మూవీ థియేటర్లోకి వచ్చేవరకూ ఇదో పెద్ద బెడద అయిపోయింది. షూటింగ్ స్పాట్ లో ఫొటోలు, వీడియోలతోపాటూ కొన్నిసార్లు ముఖ్యమైన సన్నివేశాలు, ఇంకొన్ని సార్లు సినిమాలకు సినిమాలే వచ్చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కి ఇదే పరిస్థితి ఎదురైంది.
ALSO READ: హీరో రామ్ చరణ్ జాతీయ జెండాను అవమానించారంటూ ట్రోల్స్? అసలు ఏం జరిగింది?
ఇప్పటికే సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ లీక్ కావడంతో చిత్రయూనిట్‌పై సూపర్ స్టార్ మహేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఈ మధ్య అల్లు అర్జున్ పుష్ప మూవీ నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదలకు ముందు రోజు రాత్రి ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. దీంతో అసలు ఎలా బయటకు వస్తున్నాయో అర్థంకాక చిత్ర యూనిట్ తలపట్టుకోవడంతోపాటూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ లీకువీరులు మాత్రం రెచ్చిపోతున్నారు. నిర్మాతలకు సినిమా రిలీజ్ చేయడం ఎంత కష్టమో, రిలీజ్ ముందు సదరు సినిమాలను లీకులు కాకుండా కాపాడుకోవడం అంతకుమించి కష్టం. ఇక రిలీజ్ తర్వాత పైరసీ కాకుండా ఆపలేకపోతున్నామని మరింత బాధపడుతున్నారు.
ALSO READ: వెంకటేష్ సినీ జర్నీకి 35 ఏళ్లు.. అద్భుతమైన వీడియోను షేర్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్
రీసెంట్‌గా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రాలు పుష్ప, సర్కారువారిపాట సినిమాలకు సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఓ దశలో అయితే నిర్మాతలు కావాలనే లీకులు చేస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే లీకుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
‘‘రీసెంట్‌గా మేం చేస్తున్న సినిమాలు సర్కారువారిపాట, పుష్పకు సంబంధించిన కంటెంట్ బయటకు రావడం మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. ఎవరో ఈ పనులను చేసి రాక్షసానందాన్ని పొందుతున్నారు. ఇటువంటి పనుల వల్ల ప్రేక్షకుల్లో సినిమాపై ఉండే ఎగ్జైట్‌మెంట్ పోతుంది. కాబట్టి మా మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. తప్పు చేసిన వారిని పట్టుకుని శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దు’’ అంటూ ఓ లెటర్‌ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్‌లో విడుదల చేసింది
ALSO READ: షాకింగ్.. ‘బిగ్‌బాస్’ నుంచి ఆ సింగర్, యాంకర్ ఔట్! ఎందుకిలా చేశారు?.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా.. సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప... క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. అలాగే మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న సర్కారు వారి పాట సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు.
ALSO READ: 'పుష్ప' ఫస్ట్ సింగిల్ మామూలుగాలే.... ఫ్యాన్స్‌కు పూనకాలే..
Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్
Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు
Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్
Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ
Chinmayi Sripada: డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిన్మయి
PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన
TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం
Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?
DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!