Pushpa First Single 'పుష్ప' ఫస్ట్ సింగిల్ మామూలుగాలే.... ఫ్యాన్స్‌కు పూనకాలే..
ఈ మధ్యకాలంలో దేనికి రానంత హైప్ 'పుష్ప' సినిమా ఫస్ట్ సింగిల్ కి వచ్చింది.

ఈ మధ్యకాలంలో దేనికి రానంత హైప్ 'పుష్ప' సినిమా ఫస్ట్ సింగిల్ కి వచ్చింది. నిజానికి స్టార్ హీరో సినిమా నుండి ఒక పాట వస్తుందంటే మహా అయితే ఆ ఒక్కరోజు పాట ట్రెండింగ్ లో ఉంటుంది. కానీ 'పుష్ప' విషయంలో అలా కాదు. వారం రోజులుగా ఈ పాట ట్రెండింగ్ లో ఉంటోంది. 'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే ఈ పాటను ఈరోజు విడుదల చేశారు. అయితే ప్రోమో సాంగ్ అని, సాంగ్స్ పోస్టర్స్ అని చాలా హైప్ తీసుకొచ్చి పాటను రిలీజ్ చేశారు.
Also Read : Allu Arjun's Pushpa Update: 'పుష్ప' టీమ్ కి పెద్ద షాక్.. రిలీజ్ కి ముందే పాట లీక్..
నిన్న రాత్రి ఈ పాట లీకైంది. కానీ అది దేవిశ్రీప్రసాద్ పాడిన వెర్షన్. మెయిన్ సాంగ్ ను మాత్రం సింగర్ శివమ్ తో పాడించారు. మొత్తం ఐదు భాషల్లో విడుదలైన ఈ పాటను ఒక్కో భాషల్లో ఒక్క సింగర్ తో పాడించారు. తెలుగులో శివం, హిందీలో విశాల్ దడ్లాని, కన్నడంలో విజయ ప్రకాష్, తమిళంలో బెన్నీ దయాల్, మలయాళంలో రాహుల్ నంబియార్ పాటని ఆలపించారు. పాటలో బన్నీ మాస్ అవతారం మాములుగా లేదు. ఈ పాట విన్న ఫ్యాన్స్ కు పూనకాలే.
Also Read : Pushpa The Rise : 'దాక్కో దాక్కో మేక' సాంగ్ ప్రోమో.. అల్లు అర్జున్ ఊరమాస్ అవతార్..
సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ను డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. రెండో భాగాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ధనుంజయ్, అజయ్, శత్రు, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.
#PushpaFirstSingle 🔥#DaakkoDaakkoMeka - https://t.co/ZhnWFST5v2#OduOduAadu - https://t.co/w3hEHlNeHE#OduOduAade - https://t.co/VU2j5MoksO#JokkeJokkeMeke - https://t.co/CwZ1d7boFM#JaagoJaagoBakre - https://t.co/n4X6RdIyZs#PushpaTheRise@alluarjun @ThisIsDSP @aryasukku pic.twitter.com/FjJs7XjvZs
— Mythri Movie Makers (@MythriOfficial) August 13, 2021
Before You Go
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















