News
News
X

Pushpa The Rise : 'దాక్కో దాక్కో మేక' సాంగ్ ప్రోమో.. అల్లు అర్జున్ ఊరమాస్ అవతార్..

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'పుష్ప'. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

FOLLOW US: 
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'పుష్ప'. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం 'పుష్ప ది రైజ్' సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ ను షురూ చేసింది చిత్రబృందం. ఆగస్టు 13న సినిమాలో ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.  'దాక్కో దాక్కో మేక' అంటూ సాగే ఈ పాటను దేవిశ్రీ సారథ్యంలో ఐదు భాషల్లో విశాల్‌ దడ్లానీ (హిందీ), విజయ్‌ ప్రకాశ్‌ (కన్నడ), రాహుల్‌ నంబియార్‌ (మలయాళం), శివమ్‌ (తెలుగు), బెన్నీ (తమిళం) అనే ఐదుగురు ప్రముఖ గాయకులు ఆలపించనున్నారు.
తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ ఊరమస్ గెటప్ లో కనిపించి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఈ చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక ఆగస్టు 13న విడుదల కాబోయే పాట ఇంకే రేంజ్ లో ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. 
 
ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక రెండో పార్ట్ కు సంబంధించిన సినిమా షూటింగ్ ను ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Published at : 11 Aug 2021 06:14 PM (IST) Tags: Allu Arjun Sukumar Pushpa Movie Pushpa The Rise Daakko Daakko Meka song promo Daakko Daakko Meka song

సంబంధిత కథనాలు

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Janaki Kalaganaledu October 3rd: ఎగ్జామ్ లో అదరగొట్టిన జానకి- జ్ఞానంబ ఇంట్లో మొదలైన శరన్నవరాత్రుల పూజ, చెడగొట్టేందుకు సిద్ధమైన మల్లిక

Janaki Kalaganaledu October 3rd: ఎగ్జామ్ లో అదరగొట్టిన జానకి- జ్ఞానంబ ఇంట్లో మొదలైన శరన్నవరాత్రుల పూజ, చెడగొట్టేందుకు సిద్ధమైన మల్లిక

Gruhalakshmi October 3rd Update: తులసి పోస్ట్ ఊస్ట్- నందు చేతికి పగ్గాలు, సామ్రాట్ చేసిన పనికి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయిన తులసి

Gruhalakshmi October 3rd Update: తులసి పోస్ట్ ఊస్ట్- నందు చేతికి పగ్గాలు, సామ్రాట్ చేసిన పనికి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయిన తులసి

Guppedanta Manasu October 3rd : ఇద్దరూ ఇద్దరే అసలు తగ్గడం లేదు- రిషి కోసం దేవయాని ముందు తలవంచిన మహేంద్ర

Guppedanta Manasu  October 3rd : ఇద్దరూ ఇద్దరే అసలు తగ్గడం లేదు- రిషి కోసం దేవయాని ముందు తలవంచిన మహేంద్ర

టాప్ స్టోరీస్

TRS News: జాతీయపార్టీలో తెలంగాణ అధ్యక్షుడు ఎవరు? ఆ ఛాన్స్ కేటీఆర్‌కే దక్కుతుందా?

TRS News: జాతీయపార్టీలో తెలంగాణ అధ్యక్షుడు ఎవరు? ఆ ఛాన్స్ కేటీఆర్‌కే దక్కుతుందా?

YSRCP MLA మేకతోటి సుచరితకు షాకిచ్చిన సొంత పార్టీ నేత, ఇంకెప్పుడంటూ నిలదీత !

YSRCP MLA మేకతోటి సుచరితకు షాకిచ్చిన సొంత పార్టీ నేత, ఇంకెప్పుడంటూ నిలదీత !

Congress Presidential Poll: 'పోటీ వద్దని చెప్పినా థరూర్ వినలేదు- చర్చకు నేను ఒప్పుకోను'

Congress Presidential Poll: 'పోటీ వద్దని చెప్పినా థరూర్ వినలేదు- చర్చకు నేను ఒప్పుకోను'

Hyderabad Traffic: నేడు హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఆ చుట్టుపక్కలకు వెళ్లొద్దు!

Hyderabad Traffic: నేడు హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఆ చుట్టుపక్కలకు వెళ్లొద్దు!