Salaar Movie : క్యాజువల్ లుక్ లో ప్రభాస్.. 'సలార్' వీడియో లీక్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పక్క 'రాధేశ్యామ్' సినిమాను పూర్తి చేస్తూనే మరోపక్క 'సలార్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పక్క 'రాధేశ్యామ్' సినిమాను పూర్తి చేస్తూనే మరోపక్క 'సలార్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 'కేజీఎఫ్' లాంటి సెన్సేషనల్ సినిమాను రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ ను చూపించబోతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ మొదలుపెట్టింది.
ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికోసం విలన్ ఉండే ఓ డెన్ సెట్ ను తయారు చేయించారు. ప్రభాస్ పాల్గొనే ఈ యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా సెట్స్ నుండి ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ క్యాజువల్ గా టీషర్ట్ వేసుకొని నడిచొస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'కేజీఎఫ్' టెక్నికల్ టీమే పని చేస్తుంది. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
#Prabhas Full Video 💥💥 #Salaar Yesterday Shoot Time pic.twitter.com/ztrmSs7zNw
— RUPESH CHOWDARY ™ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@Rupesh_NC) August 11, 2021
#Salaar king at his place#prabhas pic.twitter.com/N6JkKVYKJI
— Darasai Sindya (@sindya_darasai) August 11, 2021
#Salaar 🦁 in back.... 👑 pic.twitter.com/CTh0pj6x8T
— Deepu darling❤Eluru Rebel.S (@deepudarling20) August 11, 2021
RRR : ఆన్ టైమ్ కు ఆర్ఆర్ఆర్ వస్తుందా..? చరణ్ ఎందుకు అలా అన్నాడు..?
RRR Movie: ఎన్టీఆర్ తలకు గాయం.. జక్కన్న షూట్ చేస్తుంటే కట్ చెప్పిన రామ్ చరణ్