Love Story: వినాయక చవితి నాడు ‘లవ్ స్టోరీ’ చెప్పనున్న నాగచైతన్య , సాయిపల్లవి

సారంగదరియా సాంగ్ యూ ట్యూబ్ రికార్డులు తిరగరాసింది..మిగిలిన పాటలూ అదుర్స్ అనిపించాయి. మ్యూజికల్ గా హిట్టైన లవ్ స్టోరీ మూవీ కోసం ఆసక్తి ఎదురు చూస్తున్న సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది మూవీ టీమ్...

FOLLOW US: 

లవ్ స్టోరీ మూవీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చేప్పింది మూవీ టీమ్... వినాయకచవితి సందర్భంగా వచ్చేస్తున్నాం అని ట్వీట్ చేశాడు హీరో నాగచైతన్య. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'లవ్ స్టోరీ'. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ మూవిని తెరకెక్కించాడు. సమ్మర్ లో రిలీజ్ కావల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతానికి కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో  తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి ఓపెన్ అవుతున్నాయి. దీంతో సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది మూవీ టీమ్. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

'లవ్ స్టోరీ' రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ సందర్భంగా మేకర్స్ ఓ బ్యూటిఫుల్ పోస్టర్  విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య - సాయి పల్లవి ఇద్దరూ ఉల్లాసంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పరుగెత్తుతూ కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 10న ఈ మూవీ థియేటర్ రిలీజ్ కు రావడం అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపబోతోంది.

Also Read: భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్

ఇప్పటికే విడుదలైన ‘లవ్ స్టొరీ’ ఫస్ట్ లుక్ పోస్టర్స్, పాటలకు అదిరిపోయే స్పందన వచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్ వ్యూస్ లో 'సారంగ దరియా' సాంగ్ ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. 'హే పిల్లా', 'నీ చిత్రం చూసి..' పాటలు కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాయి. లవ్ స్టొరీ మ్యూజికల్ గా హిట్ అవడంతో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్ - ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయని తెలుస్తోంది.

Also Read: పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?

'లవ్ స్టొరీ' చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పవన్ సి.హెచ్ సంగీత దర్శకుడు. రాజీవ్ కనకాల - ఈశ్వరీ రావు - దేవయాని  కీలక పాత్రల్లో నటించారు. ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను హీరో నాగచైతన్య కూడా తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ ట్వీట్‌ను ఇక్కడ చూడండి. 

నాగ చైతన్య ట్వీట్:

Also Read: తగ్గేదే లే అంటున్న లీకు వీరులు.. తగ్గిస్తామంటున్న బన్నీ

Also Read: షాకింగ్.. ‘బిగ్‌బాస్’ నుంచి ఆ సింగర్, యాంకర్ ఔట్! ఎందుకిలా చేశారు?

Published at : 18 Aug 2021 12:13 PM (IST) Tags: Sai Pallavi love story Naga Chaitnya Release Date Announced Septemver 10 Vinayaka chavithi

సంబంధిత కథనాలు

Meena Husband Died: బ్రేకింగ్ న్యూస్ - హీరోయిన్ మీనా భర్త మృతి

Meena Husband Died: బ్రేకింగ్ న్యూస్ - హీరోయిన్ మీనా భర్త మృతి

Ranga Ranga Vaibhavanga: ఆర్జే కాజల్, మెహబూబ్‌తో జతకట్టిన వైష్ణవ్ తేజ్, కేతిక - కొత్తగా లేదేంటో!

Ranga Ranga Vaibhavanga: ఆర్జే కాజల్, మెహబూబ్‌తో జతకట్టిన వైష్ణవ్ తేజ్, కేతిక - కొత్తగా లేదేంటో!

Manasanamaha: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మన తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమః'!

Manasanamaha: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మన తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమః'!

Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్

Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్

Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!

Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!

టాప్ స్టోరీస్

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..

Janasena Janavani  :

IND vs IRE, 1st Innings Highlights: దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌ సూపర్‌ షో- ఐర్లాండ్‌కు భారీ టార్గెట్

IND vs IRE, 1st Innings Highlights: దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌ సూపర్‌ షో- ఐర్లాండ్‌కు భారీ టార్గెట్

IPS AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు

IPS AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు