NTR: 'పద్దతిగా లేదు..' ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్..
ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ఆయన స్టేజ్ పైనుంచే అభిమానులను హెచ్చరించారు.
రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తోన్న సంగతి తెలిసిందే. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం అగ్రెసివ్ గా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా రీసెంట్ గా ముంబైలో 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ ఇలా చాలా మంది ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ వేడుకకు వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
అయితే ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ఆయన స్టేజ్ పైనుంచే అభిమానులను హెచ్చరించారు. ఈవెంట్ మొదలైనప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ హంగామా చేశారు. ఆ తరువాత అక్కడున్న బారికేడ్లు, ఇతర నిర్మాణాలపైకెక్కి గోల చేశారు. బాగా అరుస్తూ ఈవెంట్ కి అడ్డంకిగా మారారు. దీంతో కరణ్ జోహార్ అసహనం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ అన్న మీ అభిమానులను ఎవరూ ఆపలేరు.. తారక్ ఫ్యాన్స్ ను ఇలా ఎప్పుడూ చూడలేదంటూ ఆయన అన్నారు. దీంతో ఎన్టీఆర్ వెంటనే రియాక్ట్ అవుతూ.. అభిమానులను హెచ్చరించారు. ''పద్దతిగా లేదు.. కిందకి దిగండి.. దిగుతారా దిగరా..? కిందకి దిగండి అందరూ.. కిందకి దిగి ఎంజాయ్ చేయండి. మన రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చాము.. మన గురించి అందరూ బాగా మాట్లాడుకోవాలి'' అంటూ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ ఈవెంట్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఇచ్చిన స్పీచ్ ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని.. 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైన నాలుగు నెలల వరకు మరో సినిమా విడుదల చేసే ధైర్యం ఎవరు చేయలేరంటూ కామెంట్స్ చేశారు.
Also Read: 'మగాడివైతే రా ఆడు అన్నారు..' ఇప్పుడు గెలిచి చూపించాడు.. సన్నీ గెలుపుకి కారణాలివే..
Also Read:బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 'మిర్చి' బ్యూటీ.. గుండెబరువెక్కిస్తున్న ఎమోషనల్ ట్వీట్
Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి