News
News
X

Bigg Boss 5 Telugu Winner: 'మగాడివైతే రా ఆడు అన్నారు..' ఇప్పుడు గెలిచి చూపించాడు.. సన్నీ గెలుపుకి కారణాలివే.. 

సన్నీ బిగ్ బాస్ ట్రోఫీ అందుకోవడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన వీజే సన్నీ.. 18 మంది కంటెస్టెంట్స్ ని వెనక్కి నెట్టి ట్రోఫీ అందుకున్నాడు. నిజానికి సన్నీ బిగ్ బాస్ లో అడుగుపెట్టే వరకు జనాలకు పెద్దగా తెలియదు. రవి, షణ్ముఖ్, ప్రియా, శ్రీరామచంద్ర ఇలా పేరున్న కంటెస్టెంట్స్ హౌస్ లో ఉండడంతో సన్నీని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. పైగా.. హౌస్ మేట్స్ లో అతడంటే ఎవరికీ పడేది కాదు. దీంతో అందరూ అతడిని టార్గెట్ చేస్తూ గేమ్ ఆడేవారు. మొదటివారంలోనే షణ్ముఖ్ తో జరిగిన ఆర్గుమెంట్ తో హైలైట్ అయ్యాడు సన్నీ. ఎవరు తనను ఎన్ని మాటలు అంటున్నా.. తన గేమ్ ని మాత్రం పక్కన పెట్టలేదు. ఓపక్క జనాలను ఎంటర్టైన్ చేస్తూనే.. హౌస్ మేట్స్ కి చుక్కలు చూపించేలా గేమ్ ఆడాడు. అతడు ట్రోఫీ అందుకోవడానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం!

సిరి నిందలు..: బ్యాటిన్స్ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడారు. సన్నీ కూడా తన గేమ్ ఆడే సమయంలో సిరి దగ్గర ఉన్న బ్యాటిన్స్ ను తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ దానికి ఆమె నానా రచ్చ చేసింది. సన్నీ తన టీషర్ట్ లో చేయి పెట్టాడని నిందలు వేసింది. షణ్ముఖ్ కూడా సిరిని సపోర్ట్ చేస్తూ.. సన్నీని తిట్టాడు. ఒక అమ్మాయి టీషర్ట్ లో చేయి పెట్టడానికి సిగ్గు లేదా అంటూ సన్నీపై విరుచుకుపడ్డాడు షణ్ముఖ్. తను అలా చేయలేదని సన్నీ ఎంతగా చెప్పినా వినలేదు. ఫైనల్ గా వీకెండ్ లో నాగార్జున వచ్చి వీడియో చూపించి సన్నీ తప్పు లేదని నిరూపించడంతో అతడు హైలైట్ అయ్యాడు. ఇదే సమయంలో షణ్ముఖ్ కి క్లాస్ కూడా పీకారు నాగార్జున. నిజం తెలియకుండా.. ఒక మనిషి మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని చెప్పడంతో.. వెంటనే సన్నీకి సారీ చెప్పాడు షణ్ముఖ్. ఒక విధంగా ఈ ఇన్సిడెంట్ సన్నీకి ప్లస్ అయింది. 

'మగాడివైతే రా ఆడు'..: మొదట్లో ప్రియా, సన్నీల మధ్య ఈక్వేషన్స్ బాగానే ఉండేవి. కానీ మెల్లగా ఇద్దరిమధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రియాకి సన్నీ అంటే అసలు పడేది కాదు. దీంతో అతడిని కావాలని రెచ్చగొట్టేది. ఎగ్స్ టాస్క్ లో ప్రియా గేమ్ ఆడకుండా అందరి ఎగ్స్ ని దొంగతనం చేయాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో సన్నీ ఎగ్స్ ని కూడా దొంగిలించే ప్రయత్నం చేయగా.. అతడు ప్రియాను పక్కకు తోసేశాడు. దీంతో ఆమె ఫైర్ అయిపోయి.. సన్నీని అరేయ్.. ఒరేయ్ అంటూ మర్యాద లేకుండా మాట్లాడింది. 'మగాడివైతే రా వచ్చి ఆడు', 'చెంప పగిలిపోద్ది' అంటూ విరుచుకుపడింది. సన్నీకి ఎంత కోపమొచ్చినా.. చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడాడు. ఈ విషయంలో వీకెండ్ లో నాగార్జున.. ప్రియాను మందలించారు. మర్యాద లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ నుంచి సన్నీ గేమ్ పై జనాల ఫోకస్ పెరిగింది. 

హంటర్ టాస్క్..: నామినేషన్స్ కి సంబంధించి హంటర్ టాస్క్ జరిగినప్పుడు ఎక్కువమందిని నామినేట్ చేసే ఛాన్స్ సన్నీకే వచ్చింది. ఈ టాస్క్ లో ప్రియా మరోసారి సన్నీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. రవిని సిల్లీ రీజన్ తో నామినేట్ చేస్తే.. సన్నీ దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రియాకి షాకిచ్చాడు. ఈ టాస్క్ తో సన్నీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. 

హౌస్ మేట్స్ జీరో సపోర్ట్..: కెప్టెన్ అవ్వడానికి సన్నీ అన్ని టాస్క్ లు ఎంతో శ్రద్ధగా ఆడాడు. 'ఆకలిరాజ్యం' టాస్క్ లో కెప్టెన్సీ కంటెండర్ గా సన్నీ గెలిచాడు. కానీ శ్రీరామ్, శ్వేతా, సన్నీలలో హౌస్ మేట్స్ లో ఏడుగురు సన్నీని పొడిచారు. సరైన కారణాలు చెప్పకుండా అందరూ కావాలనే సన్నీని టార్గెట్ చేశారు. ఆ సమయంలో సన్నీ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. కానీ తన బాధను బయటకి చూపించకుండా.. ధైర్యంగా నిలబడ్డాడు. ఇది ఆడియన్స్ లో సన్నీ ఫాలోయింగ్ మరింత పెరగడానికి దోహదపడింది. 

నవ్వుతూ మాట్లాడే గుణం..: హౌస్ లో ఎవరితో ఎన్ని గొడవలు జరిగినా.. నెక్స్ట్ డే మళ్లీ వెళ్లి ప్రేమగా పలకరిస్తాడు సన్నీ. చాలా మందికి సన్నీలో నచ్చే క్వాలిటీ ఇది. ఏదీ కూడా క్యారీ ఫార్వార్డ్ చేయడు. 

స్నేహానికి ఇచ్చే వాల్యూ..: హౌస్ లో సన్నీని చూసిన తరువాత చాలా మంది అలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని కోరుకుంటారు. స్నేహానికి అంత వాల్యూ ఇస్తాడు సన్నీ. తను ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు సన్నీ. మానస్, కాజల్ లతో అతడి స్నేహం ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. 

ఎవిక్షన్ పాస్..: ఎవిక్షన్ పాస్ ని తనకోసం సంపాదించి పెట్టిన కాజల్ కోసమే ఆ పాస్ ను ఉపయోగించి అందరి మనసులు దోచుకున్నాడు సన్నీ. అంతేకాదు.. టాస్క్ లలో తన జోక్స్ తో పంచ్ లతో అందరినీ నవ్వించాడు. హోటల్ టాస్క్ లో సన్నీ పెర్ఫార్మన్స్ సీజన్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఇక శ్రీరామ్ ఆరోగ్యం పాడైనప్పుడు అతడి కోసం సన్నీ గేమ్ ఆడడం, శ్రీరామ్ ను తన భుజాలపై మోస్తూ అతడిపై కేర్ చూపించడం ఇవన్నీ కూడా సన్నీ విజయానికి దోహదం చేశాయి. 

Also Read:బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 'మిర్చి' బ్యూటీ.. గుండెబరువెక్కిస్తున్న ఎమోషనల్ ట్వీట్

Also Read:సన్నీ.. అంటే పొగరనుకున్నారా పవర్.. బిగ్ బాస్ విన్నర్..

 

Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?

Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Dec 2021 11:19 AM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Telugu Winner Bigg Boss 5 Telugu Winner Sunny sunny trophy

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu Episode 30: ఇనయాను మళ్లీ రెచ్చగొట్టిన శ్రీహాన్, టైటిల్ కొట్టి తీరుతా అంటూ శపథం చేసిన ఇనయా, నామినేషన్స్ డే హీట్

Bigg Boss 6 Telugu Episode 30: ఇనయాను మళ్లీ రెచ్చగొట్టిన శ్రీహాన్, టైటిల్ కొట్టి తీరుతా అంటూ శపథం చేసిన ఇనయా, నామినేషన్స్ డే హీట్

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: దసరా సందడంతా బిగ్‌బాస్ హౌస్‌లోనే, ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా ఉండదు

Bigg Boss 6 Telugu: దసరా సందడంతా బిగ్‌బాస్ హౌస్‌లోనే, ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా ఉండదు

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: హౌస్ లో మోస్ట్ కన్నింగ్, మోస్ట్ మానిప్యులేటివ్ పర్సన్ అతడే - గీతూ కామెంట్స్, శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

టాప్ స్టోరీస్

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీపీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీపీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !