అన్వేషించండి
Bigg Boss 5 Telugu Winner: సన్నీ.. అంటే పొగరనుకున్నారా పవర్.. బిగ్ బాస్ విన్నర్..
బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన సన్నీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..
![Bigg Boss 5 Telugu Winner: సన్నీ.. అంటే పొగరనుకున్నారా పవర్.. బిగ్ బాస్ విన్నర్.. Bigg Boss 5 Telugu winner sunny profile Bigg Boss 5 Telugu Winner: సన్నీ.. అంటే పొగరనుకున్నారా పవర్.. బిగ్ బాస్ విన్నర్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/67643e916575bb8896cd1165759fbdeb_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బిగ్ బాస్ విన్నర్.. (Image credit: starmaa/hotstar)
బిగ్ బాస్ సీజన్ 5 లో 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకడిగా ఎంట్రీ ఇచ్చిన సన్నీ.. అందరిని దాటుకొని టాప్ ప్లేస్ కి చేరుకున్నాడు. మొదటి రెండు, మూడు వారాల్లో సన్నీ మాస్క్ వేసుకొని ఉన్నాడని.. అతడు బయట ఇలా ఉండడంటూ రవి, సిరి చాలా సార్లు మాట్లాడుకున్నారు. నిజానికి సన్నీ తనలానే ఉంటూ.. నాగార్జున ఇచ్చే ఇన్ పుట్స్ ను ఫాలో అవుతూ.. తన గేమ్ స్టైల్ ని మార్చుకున్నాడు. ఎలాంటి టాస్క్ ఇచ్చినా.. తన హండ్రెడ్ పెర్సెంట్ ఇచ్చేవాడు. గెలవడమంటే సన్నీకి చాలా ఇష్టం. అందుకే ఎంత కష్టమనిపించినా.. గివప్ మాత్రం చేసేవాడుకాదు. ఒక స్టేజ్ వచ్చేసరికి బిగ్ బాస్ షోపై ప్రేక్షకులకు విసుగొచ్చింది. అలాంటి సమయంలో సన్నీ తన గేమ్ ప్లేతో, బిహేవియర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
కేవలం సన్నీ కోసం మాత్రమే బిగ్ బాస్ షో చూసేవారు లక్షల్లో ఉంటారు. అతడికి కోపం ఎక్కువే.. కానీ వెంటనే నార్మల్ అయిపోతాడు. స్నేహానికి అతడు ఇచ్చే వాల్యూ, పక్కవాళ్లు ఎన్ని మాటలన్నా మర్చిపోయి వాళ్లతో సరదాగా ఉండడం వంటి విషయాలు సన్నీకి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. 'లేబుల్ లేదు మామా..' అంటూ టాస్క్ లో ఎంతో ఇన్నోసెంట్ గా సన్నీ బాధపడిన తీరు, ఏదైనా టాస్క్ లో ఓడిపోయినా.. ఎవరైనా మాటలన్నా 'అపానా టైం ఆయేగా' అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకునే విధానం.. ఇలా సన్నీ గురించి మాట్లాడుకోవాలంటే చాలానే ఉంటాయి. హోటల్ టాస్క్ లో అతడి పెర్ఫార్మన్స్ సీజన్ మొత్తానికే ఒక హైలైట్. బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీ చూపించినప్పుడు కూడా సన్నీని మాత్రమే చాలా బాగా ఎలివేట్ చేశారు. 'సన్నీ మీ టైం వచ్చేసింది' అంటూ పరోక్షంగా అతడే విన్నర్ అంటూ చెప్పకనే చెప్పారు.
సన్నీ బ్యాక్ గ్రౌండ్..
1989 ఆగష్టు 17న ఖమ్మంలో జన్మించిన సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. ఖమ్మంలోనే స్కూల్, ఇంటర్ పూర్తి చేసుకున్న సన్నీ.. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీకామ్ పూర్తి చేశాడు. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తితో ఉన్న సన్నీకి తన తల్లి కళావతి కూడా సపోర్ట్ చేయడంతో ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాడు. చిన్న వయస్సులో సన్నీ వేసిన 'అల్లాద్దీన్' అనే నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది. ఓ ఛానెల్ లో 'జస్ట్ ఫర్ మెన్' అనే టీవీ షోకి యాంకర్‌గా పనిచేసే ఛాన్స్ రావడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా కూడా కొంతకాలం పని చేశాడు.
పాపులర్ ఛానెల్ లో ప్రసారమవుతున్న 'కళ్యాణ వైభోగం' అనే సీరియల్ లో ముందుగా జయసూర్య అనే ప్రధానపాత్రలో సన్నీని తీసుకున్నారు. తన నటనతో అభిమానులను సంపాదించుకున్న సన్నీ.. ఆ తరువాత కొన్ని కారణాలతో సీరియల్ నుంచి తప్పుకున్నాడు. త్వరలోనే సన్నీ హీరోగా 'సకలగుణాభిరామ' అనే సినిమా విడుదల కానుంది. బిగ్ బాస్ హౌస్ లోని వెళ్లకముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ సన్నీ హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత సినిమాను రిలీజ్ చేద్దామని వెయిట్ చేశారు. ఇప్పుడు సన్నీ విన్నర్ గా ట్రోఫీ అందుకొని మరీ బయటకొచ్చాడు కాబట్టి కచ్చితంగా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది.
Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు కరోనా అలా కలిసొచ్చింది. లేదంటేనా...
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion