Balakrishna & Raviteja : రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షోకు తొలి రెండు ఎపిసోడ్స్ తర్వాత కొంత విరామం వచ్చింది. కానీ, ఇప్పుడు లేదు. జోరుగా, హుషారుగా బాలకృష్ణ టాక్ షోను ముందుకు తీసుకు వెళ్తున్నారు. #Unstoppable #NBK
నట సింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్'. ఐదో ఎపిసోడ్‌కు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అతిథులుగా వచ్చారు. అది విడుదల చేసిన మరుసటి రోజే ఆరో ఎపిసోడ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చేశారు బాలకృష్ణ. క్రిస్మస్‌కు ముందు రోజు... డిసెంబర్ 24 ఆ ఎపిసోడ్ విడుదల చేస్తామని చెప్పేశారు.
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని 'అన్‌స్టాపబుల్' ఆరో ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. 'అఖండ' విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ సినిమాకు ముందు ఆయన రవితేజ హీరోగా 'క్రాక్' సినిమాకు దర్శకత్వం వహించారు. టాక్ షోలో హీరోలు ఇద్దరూ కలిసి దర్శకుడిని ఓ ఆట ఆడుకున్నట్టు ఫొటోలు చూస్తే తెలుస్తోంది. బాలకృష్ణను అభిమానులు 'గాడ్ ఆఫ్ మాసెస్' అని, రవితేజను 'మాస్ మహారాజ్' అంటారు. సినిమా వేడుకల్లో ఇద్దరూ కలిసి కనిపించింది తక్కువ. ఇద్దరి మధ్య బాండింగ్ ఈ టాక్ షోతో బయటపడే అవకాశం ఉంది.
#UnstoppableWithNBK is getting a MASS makeover. 🔥🔥
— ahavideoIN (@ahavideoIN) December 19, 2021
The God of Masses #NandamuriBalakrishna is joined by our Mass Maharaja @RaviTeja_offl and director @megopichand.
Let's get KRACKed.
Episode 6 premieres Decemeber 24. pic.twitter.com/FVfMPl9oQb
చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క సారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయన్ని డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో.
— Gopichandh Malineni (@megopichand) November 13, 2021
నా బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా life time achievement కంటే lifetime responsibilityగా భావిస్తూ.జై బాలయ్య pic.twitter.com/6NG75pWQbZ
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు కరోనా అలా కలిసొచ్చింది. లేదంటేనా...
Also Read: పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. కలెక్షన్స్ విషయంలో రచ్చ రచ్చ..
Also Read: ‘బిగ్’ లీక్.. విజేత ఎవరో తెలిసిపోయింది.. షన్ముఖ్‌కు శ్రీరామ్ షాక్.. సిరి, మానస్ ఔట్!
Also Read: మహేష్ తో చేయాలనుకున్న కథ ఇదేనా..? సుకుమార్ ఏం చెప్పారంటే..?
Also Read: పెళ్లై పదిరోజులు కాకుండానే... విక్కీ ఏంటిది? కత్రినా ఏది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి