By: ABP Desam | Updated at : 19 Dec 2021 10:47 AM (IST)
'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్
కరోనా కారణంగా అనుకున్న సమయానికి చాలా సినిమాలు విడుదల కాలేదు. వాయిదాలు పడ్డాయి. 'ఆర్ఆర్ఆర్' కూడా అలా వాయిదా పడిన సినిమాయే. అయితే... ఆ సినిమాకు కరోనా ఓ విధంగా కలిసి వచ్చింది. ప్రేక్షకులకు కూడా! కరోనా లేదంటేనా... టెక్నికల్ పరంగా సినిమా యూనిట్ కొన్ని కంప్లీట్ చేయలేకపోయేది. ప్రేక్షకులు హై స్టాండర్డ్స్‌లో సినిమాను చూసే అవకాశాన్ని కోల్పోయేవారు. నట సింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' షోలో కరోనా తమకు, తమకు సినిమాకు ఏ విధంగా ఉపయోగపడినదీ రాజమౌళి చెప్పుకోచ్చారు.
''ఆర్ఆర్ఆర్' గురించి ఎవ్వరికీ తెలియని నిజం నా చెవిలో చెప్పండి. అందరం వింటాం" అని బాలకృష్ణ అడగ్గా... "మేం 'ఆర్ఆర్ఆర్'ను ఐమాక్స్, త్రీడీ, డాల్బీ విజన్ లో విడుదల చేస్తున్నాం. ఆ విషయం ట్రైలర్ లో కూడా చెప్పాం. అయితే... చివరి నిమిషం వరకూ ఆ ఫార్మాట్స్ లో విడుదల చేయగలమా? లేదా? ఇవ్వగలమా? లేదా? అని నేనే టెన్షన్ పడ్డాను. అయితే... కరోనా మూలంగా ఎక్కువ సమయం లభించడం, సినిమా వాయిదా పడటం వల్ల మూడు ఫార్మాట్స్ లో విడుదల చేస్తున్నాం" అని రాజమౌళి వెల్లడించారు. అదీ సంగతి! కరోనా లేకపోతే 'ఆర్ఆర్ఆర్'ను త్రీడీలో, ఐమాక్స్‌లో, డాల్బీ విజన్‌లో చూసే అవకాశాన్ని ప్రేక్షకులు మిస్ అయ్యేవారు అన్నమాట.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా... అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించారు. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.
Bhayaniki, Balayya ki sambandhame ledu!
Don't we all agree with @ssrajamouli garu? 😀
Watch the legendary trio have fun conversations and much more!
▶️https://t.co/a5Cwrj77kf#UnstoppableWithNBK Ep 5 Streaming now!#NandamuriBalakrishna @mmkeeravani pic.twitter.com/d8HTCO811B — ahavideoIN (@ahavideoIN) December 18, 2021
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read: పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. కలెక్షన్స్ విషయంలో రచ్చ రచ్చ..
Also Read: ‘బిగ్’ లీక్.. విజేత ఎవరో తెలిసిపోయింది.. షన్ముఖ్‌కు శ్రీరామ్ షాక్.. సిరి, మానస్ ఔట్!
Also Read: మహేష్ తో చేయాలనుకున్న కథ ఇదేనా..? సుకుమార్ ఏం చెప్పారంటే..?
Also Read: పెళ్లై పదిరోజులు కాకుండానే... విక్కీ ఏంటిది? కత్రినా ఏది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్
F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?
Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్
Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి