అన్వేషించండి
Bigg Boss 5 Telugu Winner: మచ్చా.. సన్నీ గెలిచేశాడు.. మనసులే కాదు 'బిగ్ బాస్' ట్రోఫీ కూడా..
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా సన్నీ నిలిచాడు.

(Image credit: starmaa/hotstar)
బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 106 రోజుల పాటు ఈ షో నడిచింది. 19 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలవ్వగా.. చివరికి ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. వారిలో ముందుగా సిరి, మానస్ ఎలిమినేట్ అయ్యారు. ఆ తరువాత శ్రీరామచంద్ర ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు. ఫైనల్ గా సన్నీ, షణ్ముఖ్ లు హౌస్ లో ఉండడంతో వారిద్దరిలో టెన్షన్ పెరిగిపోయింది. ఎప్పుడూ కూడా విన్నర్, రన్నరప్ ని స్టేజ్ పై అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఈసారి హౌస్ నుంచే నేరుగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్తామని నాగార్జున అన్నారు. నటి ఫరియా అబ్దుల్లాను హౌస్ లోకి పంపించి షణ్ముఖ్, సన్నీల టెన్షన్ ని ఈజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆమెతో కలిసి సన్నీ, షణ్ముఖ్ డాన్స్ లు చేశారు. ఆ తరువాత వారిద్దరితో చిన్న గేమ్ ఆడించారు. అందులో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్పకుండా టెన్షన్ పెట్టారు. బిగ్ బాస్ మీతో గేమ్ ఆడారంటూ.. నాగార్జున మరింత టెన్షన్ పెట్టారు.
ఫైనల్ గా నాగార్జున హౌస్ లోకి వెళ్లి సన్నీ, షణ్ముఖ్ లను స్టేజ్ పైకి తీసుకొచ్చారు. చాలా మంది షణ్ముఖ్ గెలవాలని కోరుకున్నారు. కానీ ఎక్కువ ఫాలోయింగ్ సన్నీ సంపాదించడంతో అతడే ట్రోఫీ కొట్టేశాడు. నాగార్జున చేతుల మీదుగా సన్నీకి ట్రోఫీ అందించారు. దీంతో సన్నీ ఆనందానికి అవధుల్లేవు. తన తల్లికి ట్రోఫీ గెలుస్తానని మాటిచ్చాడు సన్నీ. ఇచ్చిన మాట నిలబెట్టుకొని తన తల్లిపై ప్రేమను చాటుకున్నాడు. సన్నీ ట్రోఫీ అందుకోగానే.. అతడి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మానస్, కాజల్ కూడా చాలా సంతోష పడ్డారు.
నిజానికి హౌస్ లోకి కంటెస్టెంట్ గా సన్నీ ఎంట్రీ ఇచ్చినప్పుడు అతడిపై పెద్దగా అంచనాలు లేవు. పైగా హౌస్ మేట్స్ చాలా మంది అతడితో గొడవ పడుతూ కనిపించేవారు. సన్నీ కూడా చాలా పొగరుగా బిహేవ్ చేసేవాడు. కానీ మెల్లమెల్లగా అందరికీ కనెక్ట్ అయిపోయాడు. తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను అలరించాడు. సన్నీ టాప్ 5లోకి రాగానే.. అతడే విన్నర్ అని అభిమానులు ఫిక్సయిపోయారు. దానికి తగ్గట్లుగానే భారీ మెజారిటీతో అతడిని గెలిపించారు.
Also Read: బాలకృష్ణ వీక్నెస్ మీద కొట్టిన రాజమౌళి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion