Pawan Kalyan: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫిల్మ్ ప్రొడక్షన్ రీస్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. ఆయన సినిమా తీయబోయేది ఎవరితో? మేనల్లుడితోనా... అబ్బాయితోనా?
![Pawan Kalyan: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా? Ram Charan, Varun Tej, Sai Tej, Panja Vaisshnav Tej... With whom Pawan Kalyan is going to produce a movie? Pawan Kalyan: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/19/e9c0b256eac33b3c410d1624d0bab326_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే ఇంట్రెస్ట్. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని ఓ బ్యానర్ కూడా స్టార్ట్ చేశారు. 'గబ్బర్ సింగ్' సినిమాను ఆయనే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. లుక్ టెస్ట్ వరకూ ఆయన ప్రొడక్షన్ హౌస్ మీద పనులు జరిగాయి. ఆ తర్వాత బండ్ల గణేష్‌కు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ప్రొడ్యూస్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత శరత్ మరార్ నిర్మించిన రెండు మూడు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. నితిన్ 'ఛల్ మోహన్ రంగ'కు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పేరు పడింది. మళ్లీ ఇప్పుడు పవన్ ప్రొడక్షన్ చేయాలని అనుకుంటున్నారట. ఇంతకు ముందులా తన బ్యానర్ సమర్పణలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అందులో మెగా హీరో నటించనున్నారట.
మెగా ఫ్యామిలీలో యువ హీరోలకు లోటు లేదు. చిరు తనయుడు రామ్ చరణ్ స్టార్ హీరో. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కథల ఎంపిక వైవిధ్యం చూపిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరో ఒకరితో సినిమా ఉంటుందని టాక్. అబ్బాయిలు రామ్ చరణ్ లేదా వరుణ్ తేజ్ హీరోగా సినిమా చేస్తారా? లేదంటే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్... మేనల్లుళ్లు ఇద్దరిలో ఎవరితోనైనా సినిమా చేస్తారా? అనేది చూడాలి.
గతంలో రామ్ చరణ్ హీరోగా పవన్ కల్యాణ్ ఓ సినిమా నిర్మిస్తారని వినిపించింది. అలాగే... పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీలో మరో యువ హీరోను దృష్టిలో పెట్టుకుని 'కాటమరాయుడు' దర్శకుడు డాలీ ఓ కథను రెడీ చేశారు. ఒకవేళ ఆ కథతో సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటే... మేనల్లుళ్లు ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. త్వరలో పవన్ ప్రొడ్యూస్ చేయబోయే సినిమా గురించి, అందులో ఆయన నటించేదీ? లేనిదీ? స్పష్టత వస్తుందని ఇండస్ట్రీ టాక్.
Also Read: రావాలి సుధీర్... కావాలి రష్మీ!
Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు కరోనా అలా కలిసొచ్చింది. లేదంటేనా...
Also Read: పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. కలెక్షన్స్ విషయంలో రచ్చ రచ్చ..
Also Read: ‘బిగ్’ లీక్.. విజేత ఎవరో తెలిసిపోయింది.. షన్ముఖ్‌కు శ్రీరామ్ షాక్.. సిరి, మానస్ ఔట్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)