Lakshmi Manchu: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?
లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్ అయ్యింది. అయితే... అది రియల్ యాక్సిడెంట్ కాదు. రీల్ యాక్సిడెంట్! ఏమైంది? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
లక్ష్మీ మంచుకు గాయపడ్డారు. ఆమెకు రక్తం కారేలా గాయాలు అయ్యాయి. ఆమె చేతి వేళ్ళకు బలంగా దెబ్బ తగలడం వల్ల రక్తం వచ్చినట్టు ఉంది. గాయం కారణంగా జీన్స్ చిరిగిందా? లేదంటే రిప్డ్ జీన్స్ వేసుకువడం వల్ల గాయలు అయినప్పుడు మోకాలి దగ్గర చిన్న గాయమైందా? అన్నట్టు ఉంది. ఈ ఫొటోలను లక్ష్మీ మంచు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఆమెకు ఏమైంది? అని అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది కంగారు పడ్డారు. అయితే... అవి నిజమైన గాయాలు కావు. రియాల్ యాక్సిడెంట్ కాదు, రీల్ యాక్సిడెంట్! షూటింగ్ కోసం ఆ విధంగా ఆమె మేకప్ వేసుకున్నారు. అదీ సంగతి!
ప్రస్తుతం లక్ష్మీ మంచు మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. మలయాళంలో స్టార్ హీరో మోహన్ లాల్ సినిమాలో లక్ష్మీ మంచు నటిస్తున్నారు. అలాగే, ఆమె చేతిలో తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఓ సినిమాలో ఆమె ఫైట్ సీన్స్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను బట్టి అర్థం అవుతోంది. తొలుత గాయమైన చెయ్యి, మోకాలి ఫొటోలు పోస్ట్ చేయడంతో చాలామంది నిజంగా యాక్సిడెంట్ అయ్యిందని అనుకున్నారు. ఆమెకు మెస్సేజ్ లు చేశారు. దాంతో లక్ష్మీ మంచు అసలు విషయం చెపారు.
"ఓకే... ఓకే... నా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన రక్తం ఉన్న ఆ చెయ్యి, మోకాలి ఫొటోలు ఓ షూటింగ్‌లోనివి. రియల్ యాక్సిడెంట్ కాదు. చాలా మంది ప్రజలు నా గురించి ఆలోచిస్తారని తెలిసి చాలా సంతోషం వేసింది. లవ్ యు ఆల్" అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు. ఈ ఏడాది 'పిట్టకథలు' యాంథాలజీతో లక్ష్మీ మంచు ఓటీటీ వీక్షకుల ముందుకు వచ్చారు. రెండు మూడు టీవీ షోల్లోనూ సందడి చేశారు. నెక్స్ట్ ఇయర్ ఆమె నటించిన మూడు నాలుగు సినిమాలు విడుదల అయ్యేలా ఉన్నాయి.
Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు కరోనా అలా కలిసొచ్చింది. లేదంటేనా...
Also Read: పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.. కలెక్షన్స్ విషయంలో రచ్చ రచ్చ..
Also Read: ‘బిగ్’ లీక్.. విజేత ఎవరో తెలిసిపోయింది.. షన్ముఖ్‌కు శ్రీరామ్ షాక్.. సిరి, మానస్ ఔట్!
Also Read: మహేష్ తో చేయాలనుకున్న కథ ఇదేనా..? సుకుమార్ ఏం చెప్పారంటే..?
Also Read: పెళ్లై పదిరోజులు కాకుండానే... విక్కీ ఏంటిది? కత్రినా ఏది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి