Naga Chaitanya: చైతు కామెంట్స్ సమంతను ఉద్దేశించేనా..?
తాజాగా చైతు మాట్లాడిన ఒక వీడియోను మాత్రం ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.
అక్కినేని నాగచైతన్య-సమంత తమ వివాహబంధాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అక్టోబర్ నెలలో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఈ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. చై-సామ్ విడిపోయి రెండు నెలలు దాటేసినా.. అభిమానులు మాత్రం ఇంకా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విడాకుల వ్యవహారంపై సమంత పలుసార్లు మీడియా ముందు మాట్లాడింది. విడాకుల నిర్ణయం తీసుకున్నప్పుడు చనిపోతానేమో అనుకున్నానని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. మరోపక్క చైతు మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు.
సాధారణంగానే సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు చైతు. ఇక డివోర్స్ తరువాత పెద్దగా మీడియా ముందుకొచ్చింది కూడా లేదు. దీంతో చైతు ఎక్కడా కూడా తన విడాకుల గురించి మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఇదిలా ఉండగా.. చైతు మాట్లాడిన ఒక వీడియోను మాత్రం ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారు.
ఇందులో చైతుని ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడరని హోస్ట్ ప్రశ్నించగా.. దానికి చైతు.. అన్ని రకాల పాత్రలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని.. కానీ తను పోషించే పాత్ర, సినిమా తన కుటుంబంపై ఎఫెక్ట్ చూపించకూడదని అన్నాడు. తన ఫ్యామిలీ ప్రతిష్టను తగ్గించే విధంగా ఉండే పాత్రలను ఎప్పటికీ చేయనని చెప్పాడు చైతు.
సమంతను ఉద్దేశించి కావాలనే చైతు ఈ కామెంట్స్ చేశారంటూ పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 'ఫ్యామిలీ మ్యాన్ 2' సినిమాలో సమంత బోల్డ్ పెర్ఫార్మన్సే వీరి విడాకులకు కారణమంటూ జరుగుతోన్న ప్రచారానికి చైతు వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రస్తుతం చైతు, సమంత తమ లైఫ్ లో చాలా బిజీ అయిపోయారు. వరుస సినిమాల్లో నటిస్తోన్న.. బిజీ స్టార్స్ గా మారారు.
Nee clarity @chay_akkineni 👌👌 pic.twitter.com/LAXv1T6AMz
— RishiQ (@risheek_king) December 10, 2021
Also Read:'పుష్ప' ఐటెం సాంగ్.. సమంత ఎంత తీసుకుందంటే..
Also Read: గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే..?
Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి