News
News
X

KTR-Mahesh Babu: తిరిగిచ్చేద్దాం అన్న కేటీఆర్.. ఇలాంటోళ్లు ఉండాలన్న మహేశ్... ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్

మనం పుట్టి పెరిగిన ఊరికి ఎంతో కొంత తిరిగిచ్చేయాలి లేదంటే లావైపోతాం అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. ఇప్పటికీ ఆ డైలాగ్ స్ఫూర్తి కొనసాగుతోంది.

FOLLOW US: 

సినిమాల్లో నెగిటివ్ తప్ప పాజిటివ్ అంశాలు ఎవరు పట్టించుకుంటార్లే అనుకునేవారే ఎక్కువ. కానీ చెప్పాల్సిన విధంగా చెబితే ఏళ్లు గడిచినా ఆ ఇంపాక్ట్ అలాగే ఉంటుంది. మహేశ్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా  ఈ కోవకు చెందినదే. ఈ మూవీ తర్వాత చాలామంది ఎన్ ఆర్ ఐ లు తమ సొంతూర్ల అభివృద్ధికి కృషి చేశారు. మరికొందరు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ హడావుడి అంతా చూసి  సినిమా హీట్ ఎన్నాళ్లు కొనసాగుతుందిలే అనుకున్నారంతా కానీ ఇప్పటికీ ఆ స్ఫూర్తి కంటిన్యూ అవుతోంది. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ చూసి మహేశ్ బాబు రిప్లై ఇవ్వడమే ఇందుకు నిదర్శనం.

Moved beyond words to learn that #Srimanthudu was an inspiration behind this school! We are incredibly humbled Subhash Reddy garu 🙏🙏🙏 You are a true HERO.. We need more people like you! https://t.co/iGIlK1VlsK pic.twitter.com/Y6DGFPoIuJ

ఇంతకీ విషయం ఏంటంటే మహేశ్‌ 'శ్రీమంతుడు' స్ఫూర్తితో కామారెడ్డి జిల్లా బీబీపేట్‌లో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. పుట్టిన ఊరికి, చదువుకున్న పాఠశాలకి తన వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ప్రశంసనీయమన్నారు మంత్రి కేటీఆర్. సుభాష్ రెడ్డి అంత కాకపోయినా తాను కూడా పక్కనే ఉన్న తన నానమ్మ ఊరు కోనాపూర్‌లోని ప్రాథమిక పాఠశాలను తాను బాగు చేయిస్తానని కేటీఆర్ మాటిచ్చారు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో ఈ పాఠశాల కట్టించారని ముందే తెలిస్తే.. మహేష్ బాబును తీసుకొచ్చే వాడిని అన్నారు. జూనియర్ కాలేజ్ కడుతున్నారు కదా? అది పూర్తయిన తర్వాత అప్పుడు మహేష్ బాబును తీసుకొద్దాం అన్నారు. ఆయన వస్తే ఇంకా పది మందికి ఈ విషయం తెలుస్తుందని, ఇంకో పది చోట్ల ఇలాంటి మంచి పనులు జరుగుతాయని కేటీఆర్ అన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కేటీఆర్‌ ట్విట్టర్లో షేర్‌ చేశారు. ఈ ఫొటోస్ చూసిన మహేశ్‌ కేటీఆర్‌ ట్వీట్‌కు రీట్వీట్‌ చేస్తూ.. శ్రీమంతుడు బృందంతో కలిసి పాఠశాలను సందర్శిస్తానంటూ రిప్లై ఇచ్చారు. బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి బీబీపేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఆ పాఠశాల భవనాన్ని సుభాష్‌రెడ్డి రూ.6 కోట్లతో ఆధునిక హంగులతో కార్పొరేట్‌ పాఠశాల తరహాలో పునర్నిర్మించారు. సమాజానికి సుభాష్‌రెడ్డి వంటి వాళ్లు ఎంతో అవసరమని ఈసందర్భంగా మహేశ్‌బాబు ట్విటర్‌లో పేర్కొన్నారు.
Also Read: 'అఖండ' విడుదల తేదీ ఖరారు... బాలకృష్ణతో భారీ చిత్రాల సందడి మొదలు!
Also Read:  భార్య పేరు కలిసి వచ్చేలా... ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసిన హీరో
Also Read: ప్రకటనల్లో నటించిన వారే అన్నింటికీ బాధ్యులా ? అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సిందేనా ? సెలబ్రిటీల ప్రకటనలపై వివాదాలెందుకు ?
Also Read: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..
Also Read: బిగ్ బాస్ హౌస్ లో హనీ మూన్ కపుల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...ఓ రేంజ్ లో ఆడేసుకున్న సన్నీ...
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Nov 2021 02:56 PM (IST) Tags: Mahesh Babu ktr tweet Kamareddy School Opening Srimanthudu

సంబంధిత కథనాలు

Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

Cadaver Review - కడవర్ రివ్యూ : డెడ్ బాడీ చెప్పిన కథ, అమలా పాల్ సినిమా ఎలా ఉందంటే?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!

Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

టాప్ స్టోరీస్

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?