News
News
X

'Khiladi' Release Date: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..

ఈ ఏడాది క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ తన నెక్ట్స్ మూవీ ఖిలాడీకి డేట్ లాక్ చేసేసుకున్నాడు. వచ్చేదెప్పుడంటే...

FOLLOW US: 

వరుస ఫ్లాపులతో కెరీర్ సందేహంలో పడిన సమయంలో వచ్చిన 'క్రాక్' సినిమా మాస్ మహారాజ్ రవితేజకి మంచి హిట్టించింది. రవితేజ ఈజ్ బ్యాక్ అనిపించింది.  ఈ ఏడాది ఆరంభంలో హిట్టు దక్కించుకున్నట్టే వచ్చే ఏడాది ఆరంభంలోనూ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటున్నాడు రవితేజ. అందుకే తదుపరి మూవీ 'ఖిలాడీ'కి ముందే డేట్ ఫిక్స్ చేశారు. 2022 ఫిబ్రవరి  11న థియేటర్లో విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్. ఈ డేట్ లాక్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. 

‘ఒక ఊరిలో’ సినిమాతో  కెరీర్‌ను ప్రారంభించిన డైరెక్ట‌ర్ ర‌మేశ్ వ‌ర్మ పెన్మత్స  'రైడ్‌', 'అబ్బాయితో అమ్మాయి', 'వీర', 'రాక్షసుడు' సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా రమేశ్ వర్మ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘ఖిలాడి’. డబ్బు, భావోద్వేగాల ప్రాధాన్యతల మధ్య ఏది ముఖ్యమో ఆలోచింపజేసేలా 'ఖిలాడి' సినిమా ఉంటుందన్నారు రమేశ్ వర్మ.  ఈ సినిమాలో చూడబోయే రవితేజ పాత్ర ఇంతకు ముందు కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుందని స్పష్టం చేశారు.  ఈ మూవీలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వాస్తవానికి ఈ సినిమాను   డిసెంబర్ 24 న నాని 'శ్యామ్ సింగరాయ్'తో పోటీగా దించాలని మేకర్స్ భావించారు. కానీ ఏవో కారణాలతో 2022 ఫిబ్రవరికి డేట్ లాక్ చేశారు.  

క్రాక్ సినిమాలానే ఖిలాడీ కూడా మంచి టాక్ సొంతం చేసుకుంటే మళ్లీ రవితేజ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చంటున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇంకా రవితేజ చేతుల్లో 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' అనే మరో రెండు సినిమాలున్నాయి. ఇవి పూర్తికాకుండానే కొత్తగా మరో సినిమా అనౌన్స్ చేశాడు రవితేజ. 'స్వామిరారా' సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా తన మార్క్ క్రియేట్ చేసిన సుధీర్ వర్మ ఆ తరువాత 'కేశవ', 'రణరంగం' లాంటి సినిమాలు తీశాడు. ఇవి సరిగ్గా ఆడలేదు. దీంతో గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు రవితేజతో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు. రవితేజ నటించే 70వ సినిమా ఇది. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరించనున్నారు.   
Also Read: ‘3 రోజెస్’ ట్రైలర్.. అందరికీ విజయ్ దేవరకొండే కావాలంటే ఎలా.. ఇది పెద్దలకు మాత్రమే!
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
Also Read: బిగ్ బాస్ హౌస్ లో హనీ మూన్ కపుల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...ఓ రేంజ్ లో ఆడేసుకున్న సన్నీ...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Nov 2021 10:38 AM (IST) Tags: Ramesh Varma Mass Maharaja Ravi Teja Satyanarayana 'Khiladi' Feb 2022

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu October 5th: జ్ఞానంబ ఇంటికి బాలత్రిపుర సుందరీ దేవి- వేడుకగా బొమ్మల కొలువు చేసిన జానకి, మల్లిక ప్లాన్ ఫెయిల్

Janaki Kalaganaledu October 5th: జ్ఞానంబ ఇంటికి బాలత్రిపుర సుందరీ దేవి- వేడుకగా బొమ్మల కొలువు చేసిన జానకి, మల్లిక ప్లాన్ ఫెయిల్

Gruhalakshmi October 5th Update: అనసూయ మాట విని షాకింగ్ నిర్ణయం తీసుకున్న సామ్రాట్- గాల్లో తేలిపోతున్న లాస్య

Gruhalakshmi October 5th Update: అనసూయ మాట విని షాకింగ్ నిర్ణయం తీసుకున్న సామ్రాట్- గాల్లో తేలిపోతున్న లాస్య

Karthika Deepam October 5th Update: నా గతం ఏంటో తెలియాలి ప్రూఫ్స్ కావాల్న కార్తీక్, మోనితకి భారీ షాక్ ఇచ్చిన దీప

Karthika Deepam October 5th Update: నా గతం ఏంటో తెలియాలి ప్రూఫ్స్ కావాల్న కార్తీక్, మోనితకి భారీ షాక్ ఇచ్చిన దీప

Devatha October 5th Update: బయటపడిన ఆదిత్య అబద్ధం, షాకైన సత్య- మాధవ్ కుట్ర వినేసిన రుక్మిణి

Devatha October 5th Update: బయటపడిన ఆదిత్య అబద్ధం, షాకైన సత్య- మాధవ్ కుట్ర వినేసిన రుక్మిణి

Guppedantha Manasu October 5th Update: పంటపొలాల్లో ప్రేమపక్షుల విహారం, మరోసారి విషం చిమ్మిన దేవయాని

Guppedantha Manasu October 5th Update: పంటపొలాల్లో ప్రేమపక్షుల విహారం, మరోసారి విషం చిమ్మిన దేవయాని

టాప్ స్టోరీస్

Godfather Twitter Review - 'గాడ్ ఫాదర్' ఆడియన్స్ రివ్యూ : చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ - మెగాస్టార్ హిట్ కొట్టారోచ్!

Godfather Twitter Review - 'గాడ్ ఫాదర్' ఆడియన్స్ రివ్యూ : చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ - మెగాస్టార్ హిట్ కొట్టారోచ్!

Hyderabad Traffic Restrictions: నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ రూట్లలో వెళ్తున్నారా, ఇది తెలుసుకోండి

Hyderabad Traffic Restrictions: నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ రూట్లలో వెళ్తున్నారా, ఇది తెలుసుకోండి

National Party Name: నేషనల్ పార్టీ పేరు ఫిక్స్, వంద పేర్లలో ఇదే ఫైనల్ చేసిన కేసీఆర్ - నేడే ప్రకటన

National Party Name: నేషనల్ పార్టీ పేరు ఫిక్స్, వంద పేర్లలో ఇదే ఫైనల్ చేసిన కేసీఆర్ - నేడే ప్రకటన

Dussehra Wishes: ధర్మ స్థాపనకు నిదర్శనం, తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలి: కేసీఆర్ సహా నేతల దసరా శుభాకాంక్షలు

Dussehra Wishes: ధర్మ స్థాపనకు నిదర్శనం, తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలి: కేసీఆర్ సహా నేతల దసరా శుభాకాంక్షలు