![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
3 Roses Trailer: ‘3 రోజెస్’ ట్రైలర్.. అందరికీ విజయ్ దేవరకొండే కావాలంటే ఎలా.. ఇది పెద్దలకు మాత్రమే!
‘3 రోజెస్’ ట్రైలర్ వచ్చేసింది. అయితే, ఈ వెబ్‌సీరిస్ కేవలం పెద్దలకే సుమా!
![3 Roses Trailer: ‘3 రోజెస్’ ట్రైలర్.. అందరికీ విజయ్ దేవరకొండే కావాలంటే ఎలా.. ఇది పెద్దలకు మాత్రమే! 3 Roses Trailer: Payal Rajput Eesha Rebba and Purna's bold web series will release soon 3 Roses Trailer: ‘3 రోజెస్’ ట్రైలర్.. అందరికీ విజయ్ దేవరకొండే కావాలంటే ఎలా.. ఇది పెద్దలకు మాత్రమే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/11/7704e0140bd28bfc5c58d28d57116f1b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇషా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించిన ‘3 రోజెస్’ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఈ ముగ్గురు భామలు చాలా బోల్డ్‌గా కనిపిస్తున్నారు. కనిపించడమే కాదు.. వారి మాటలు కూడా చాలా బోల్డ్‌గా ఉన్నాయి. పాపం.. ప్రేమ.. పెళ్లి.. మోహంలో ఏది సరైన దారో తెలియక తికతికమక పడుతున్న ఈ ముగ్గురు భామలు నేటి సమజాన్ని పచ్చి బూతులతో తిట్టేస్తున్నారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. యూత్‌కు అవసరమైన మసాలాలన్నీ ఈ సీరిస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇషా రెబ్బాను రీతూగా, పాయల్ రాజ్‌పుత్‌ను జాహ్నవీగా, పూర్ణాను ఇందుగా పరిచయం చేశారు. ఇష్టంలేని వ్యక్తితో పెళ్లి ఫ్రస్ట్రేషన్‌లో రీతూ, వయస్సు మీద పడుతున్నా పెళ్లి చేసుకోడానికి తగిన జోడీ దొరక్క బాధపడుతున్న అమ్మాయిగా జాహ్నవీ.. పెళ్లికి ముందే అబ్బాయిలతో అడ్వాన్స్‌గా ఉండే జాహ్నవీల జీవితాల్లో ఏం జరిగిందనేది ‘3 రోజెస్’ కథనం.
చెప్పాలంటే.. 3 రోజెస్‌లో అడల్ట్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్‌ను చాలా బోల్డ్‌గా చూపించారు. పెళ్లయ్యాక ‘అది’ జరగాల్సిందే కదా అని ముందే చేసేశాను అని స్నేహితులతో చెప్పడం.. చివర్లో వైవా హర్షా.. ‘‘అందరికీ విజయ్ దేవరకొండ కావాలంటే.. మాలాంటి వైవా హర్ష లాంటి వారి పరిస్థితి ఏమిటీ? అసలు మా సింగిల్‌గాళ్ల కష్టాలు మీకు ఏం తెలుసండి? చేతి రేఖలు అరిగిపోతున్నాయ్’’ అని ఇషా రెబ్బాతో అంటాడు. దీంతో ఇషా.. అదేంటి అని అడుగుతుంది. ‘‘చెప్పను.. చెబితే సెన్సార్ చేసి పడదొబ్బుతారు’’ అని అంటాడు.
Also Read: ‘ది ఎక్సొర్సిజం అఫ్ ఎమిలీ రోజ్’ రియల్ స్టోరీ.. ఆరు ప్రేతాత్మలు ఆమెకు నరకం చూపాయ్!
‘మారుతీ షో’ పేరుతో దర్శకుడు మారుతీ సమర్పిస్తున్న ‘3 రోజెస్’కు మగ్గీ దర్శకత్వం వహించారు. నిర్మాత ఎస్‌కేఎన్. సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చారు. ఈ వెబ్‌సీరిస్ ఈ నెల (నవంబరు) 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి, ఇందులోని రంగు, రుచి, సువాసన... ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూడాలి. ‘3 రోజెస్’ ట్రైలర్ ఇక్కడ చూసేయండి.
Extremely happy to release the trailer of biggest girly Telugu series #3Roses,
— Rakul Singh (@Rakulpreet) November 11, 2021
premieres only on @ahavideoIN from tomorrow
▶️https://t.co/r82ovgtN98
All the best to @sknonline @DirectorMaruthi @Maggifilmmaker@starlingpayal @YoursEesha @shamna_kkasim
👩🏻🦰👱🏻♀️🧔🏻♀️ #3RosesOnAHA
Also Read: కేక పుట్టించే 6 కొరియన్ వెబ్‌సీరిస్‌లు ఇవే.. థ్రిల్లే కాదు.. దిల్ కూడా దోచుకుంటాయ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)