Ghani Update: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
గద్దలకొండ గణేష్ సినిమాతో వరుణ్ తేజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతడు నటిస్తున్న గని సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
గద్దలకొండ గణేష్, ఎఫ్2 సినిమాలు వరుణ్ తేజ్ కెరీర్లో మైలురాళ్లని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ మెగా హీరో నటిస్తున్న మరో సినిమా గని. అందులో వరుణ్ మాస్ లుక్ ఇప్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. సినిమా విడుదల కోసం వెయిట్ చేసేలా చేసింది. తాజాగా మూవీ మేకర్స్ గని ప్రపంచం ఇదేనంటూ ఓ వీడియో విడుదల చేశారు. వారంతా సినిమాలో గనితో పాటూ కనిపించే పాత్రలు. హీరోయిన్ నుంచి విలన్ వరకు కీలకమైన పాత్రలన్నింటినీ చూపించారు. వీడియోలో మొదట నదియా, ఆ తరువాత నరేష్ కనిపించారు. తరువాత క్రమంగా తనికెళ్ల భరణి, నవీన్ చంద్ర, సాయి మంజ్రేకర్, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్ర కనిపించారు. ఈ సినిమాలో చాలా మంది పెద్దనటులు నటిస్తున్నారు. వీరిలో కొంతమందికి గనికి ఆప్తులు, మరికొందరు శత్రువులు. ఈ వీడియోను బట్టి చూస్తే గని క్యాస్టింగ్ మామూలుగా లేదు. సినిమాపై ఇప్పటికే బోలెడు అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాస్టింగ్ ను చూస్తే అంచనా రెట్టింపు అయ్యేలా కనిపిస్తుంది. సినిమా టీజర్ ను నవంబర్ 15న విడుదల చేయనున్నారు.
ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. సినిమాలెోని తొలి లిరికల్ సాంగ్ ప్రోమోను కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు. ఆ పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంది. ‘గని ఫస్ట్ పంచ్’ గ్లింప్స్ కు కూడా చాలా ప్రేక్షకాదరణ లభించింది. ఇప్పుడు ‘వరల్డ్ ఆఫ్ గని’ వీడియోకు కూడా వ్యూస్ బాగానే వస్తున్నాయి.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. తొలిసారి వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అల్లు వెంకటేష్, సిద్ధు ముద్దా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మూవీ మేకర్స్. ఇందులో బాలీవుడు నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
View this post on Instagram
Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు
Also read: ఉల్లిపాయ అధికంగా తింటే మేలే కాదు, కీడు కూడా చేస్తుంది
Also read: చలికాలంలో వేడి పుట్టించే నువ్వులు తినడం అవసరమే
Also read: ఈ అలవాట్లు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి