Akhanda Release Date: 'అఖండ' విడుదల తేదీ ఖరారు... బాలకృష్ణతో భారీ చిత్రాల సందడి మొదలు!
అగ్ర హీరోలు అందరిలో ముందుగా థియేటర్లలోకి రావడానికి బాలకృష్ణ రెడీ అయ్యారని సమాచారం. డిసెంబర్ తొలి వారంలో 'అఖండ' సినిమా విడుదల కానున్నదని తెలుస్తోంది. Nandamuri Balakrishna, Akhanda Movie
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా 'అఖండ'. 'సింహ', 'లెజెండ్' చిత్రాల తర్వాత వీళ్లిద్దరి కలయికలో హ్యాట్రిక్ సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు అంచనాలు పెంచాయి. ఇప్పటివరకూ బాలకృష్ణతో తీసిన రెండు సినిమాల్లోనూ ఆయనతో ద్విపాత్రాభినయం చేయించారు బోయపాటి. మరి, 'అఖండ'లో రెండు పాత్రల్లో చూపించారో? లేదంటే రెండు కోణాల్లో చూపించారో? డిసెంబర్ 2న ప్రేక్షకులకు తెలుస్తుంది. మాస్ హీరోగా, అఘోరాగా రెండు లుక్స్ విడుదలయ్యాయి. రెండూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో మూడో సినిమా 'అఖండ' డిసెంబర్ 2న విడుదల కానుందని సమాచారం. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకు ఆ విడుదల తేదీ గురించి సమాచారం ఇచ్చారట. దాంతో వాళ్లు ప్రీమియర్ షోలు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'అఖండ' విడుదలైన తర్వాత రోజున వరుణ్ తేజ్ 'గని' విడుదల కానుంది. ఆ తర్వాత డిసెంబర్ 17న 'పుష్ప', జనవరి 7న 'ఆర్ఆర్ఆర్', 14న 'రాధే శ్యామ్' విడుదల కానుంది. బాలకృష్ణతోనే భారీ సినిమాల సందడి మొదలు కానుంది.
ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న 'అఖండ'లో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. బాలకృష్ణతో ఆమె తొలిసారి నటించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో బాలకృష్ణతో 'డిక్టేటర్', బోయపాటితో 'సరైనోడు' సినిమాలకు తమన్ పని చేశారు. ఇటీవల సినిమాలో 'భం... భం... అఖండ' టైటిల్ సాంగ్ విడుదల చేశారు. నటసింహం ఇమేజ్ కు తగ్గట్టు తమన్ సాలిడ్ సౌండింగ్, బీట్స్ తో సాంగ్ కంపోజ్ చేశారు. సినిమాలతో మాత్రమే కాకుండా 'అన్ స్టాపబుల్' టాక్ షోతోనూ బాలకృష్ణ ప్రజలను అలరిస్తున్నారు. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న విధానం, షోలు సరదా సంగతులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.
Also Read: భార్య పేరు కలిసి వచ్చేలా... ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన హీరో
Also Read: ప్రకటనల్లో నటించిన వారే అన్నింటికీ బాధ్యులా ? అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సిందేనా ? సెలబ్రిటీల ప్రకటనలపై వివాదాలెందుకు ?
Also Read: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..
Also Read: బిగ్ బాస్ హౌస్ లో హనీ మూన్ కపుల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...ఓ రేంజ్ లో ఆడేసుకున్న సన్నీ...
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి