(Source: ECI/ABP News/ABP Majha)
Sudhakar Komakula: భార్య పేరు కలిసి వచ్చేలా... ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన హీరో
హీరోలు నిర్మాతలుగా మారడమనే ట్రెండ్ తెలుగులో ఎప్పటి నుంచో ఉంది. స్టార్ హీరోలందరూ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ట్ చేశారు. చిన్న హీరోలూ అదే బాటలో నడుస్తున్నారు. ఈ జాబితాలో సుధాకర్ కోమాకుల కూడా చేరారు.
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో నాగరాజుగా నటించిన సుధాకర్ కోమాకుల గుర్తున్నారు కదా! ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. సుఖ మీడియా (Sukha Media) పతాకంపై సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. Sudhakar Komakula తన పేరులో Su, ఇంటి పేరులో K... భార్య హారిక (Harika) పేరులో Ha కలిపి... Sukha Media (సుఖ మీడియా) అని ప్రొడక్షన్ హౌస్‌కు పేరు పెట్టారు. కొత్త జానర్ కథలతో దర్శకులు ఎవరైనా వస్తే... తమ బ్యానర్ భాగస్వామ్యంతో ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అని సుధాకర్ కోమాకుల వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న 'నారాయణ అండ్ కో', 'జీడీ' (గుండెల్లో దమ్ముంటే) సినిమాలు సుఖ మీడియా భాగస్వామ్యంతో నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఓ వైపు హీరోగా నటిస్తూ, మరో వైపు మంచి క్యారెక్టర్లు వస్తే ఇతర సినిమాల్లో కూడా సుధాకర్ కోమాకుల చేస్తున్నారు. 'రాజా విక్రమార్క' సినిమాలో ఏసీపీ గోవింద్ పాత్రలో ఆయన నటించారు. శుక్రవారం ఆ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ "దర్శకుడు శ్రీ సరిపల్లి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ కథ కూడా తెలుసు. కార్తికేయ హీరోగా చేస్తున్నాడని తెలుసు. ఒక రోజు ఫోన్ చేసి ఏసీపీ రోల్ చేయాలని చెప్పాడు. నా ఫ్రెండ్ కాబట్టి కాదనలేక సినిమా చేశా. నా కాస్ట్యూమ్స్, లుక్స్ పరంగా శ్రీ కేర్ తీసుకున్నాడు. కార్తికేయ ఇప్పుడు యంగ్ సెన్సేషన్. అతనితో నటిస్తే నా కెరీర్ కు హెల్ప్ అవ్వడంతో పాటు ప్రేక్షకులకు ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేములో చూడటం బావుంటుంది కదా! ఈ సినిమాలో అందరి ఆర్టిస్టులతో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. నా క్యారెక్టర్ లో షేడ్స్ కూడా ఉంటాయి. మా నిర్మాత '88' రామారెడ్డి, ప్రజెంటర్ ఆదిరెడ్డి .టి ఖర్చుకు వెనుకాడకుండా సినిమా తీశారు. ప్రేక్షకులు అందరికీ సినిమా నచ్చుతుంది" అని చెప్పారు.
గత ఏడాది చిరంజీవి పుట్టినరోజుకు భార్య హారికతో కలిసి 'ఇందువదన' కవర్ సాంగ్ చేశారు సుధాకర్ కోమాకుల. ఈ ఏడాది ఓ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో సాంగ్ చేశారు. ఆయనకు జోడీగా '30 వెడ్స్ 21' ఫేమ్ అనన్య నటించిన ఆ పాట త్వరలో విడుదల కానుంది. దానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
Also Read: ప్రకటనల్లో నటించిన వారే అన్నింటికీ బాధ్యులా ? అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సిందేనా ? సెలబ్రిటీల ప్రకటనలపై వివాదాలెందుకు ?
Also Read: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..
Also Read: బిగ్ బాస్ హౌస్ లో హనీ మూన్ కపుల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...ఓ రేంజ్ లో ఆడేసుకున్న సన్నీ...
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి