అన్వేషించండి

Karthika Deepam November 16th Update: మోనిత ఇంటికొచ్చిన సౌందర్య, డోర్ తీసిన దీప-కార్తీక్, పెద్ద ట్విస్టే ఇది!

కార్తీకదీపం నవంబరు 16 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam November 16th  Episode 1510 (కార్తీకదీపం నవంబరు 16 ఎపిసోడ్)

కార్తీక్-మోనిత
నువ్వు నా భార్యవి అయితే మరి ఆ వంటలక్కను ఎందుకు అడ్డు తొలగించాలని చూస్తున్నావ్. ఆ దీప నా భార్య కాబట్టి తన అడ్డు తొలగించి నువ్వు నన్ను దక్కించుకోవాలని చూస్తున్నావు కదా అనడంతో నో కార్తీక్ అని గట్టిగా అరుస్తుంది మోనిత. కలలో కూడా ఆ ఆలోచన రాకూడదు కార్తీక్ అనడంతో వచ్చేలా నువ్వే చేస్తున్నావు మోనిత అంటాడు కార్తీక్. అప్పుడు మోనిత ఏ ఆడది అయినా తన భర్త మరొక ఆడదానితో తిరిగితే సహిస్తుందా భర్తను ఎలాగో మార్చలేకపోయినా కనీసం దాన్నైనా జుట్టు పట్టుకుని గెంటేస్తుంది అంటుంది. సరేలే ఆ గొడవెందుకు ఆకలేస్తోందని కార్తీక్ అంటే.. ఆ వంటలక్క దగ్గరకే వెళ్లు అనేసి కోపంగా వెళ్లిపోతుంది మోనిత

దుర్గ-దీప
దుర్గ: దీపమ్మ నువ్వు అనుకున్నట్టుగానే డాక్టర్ బాబుకి గతం గుర్తుకు వచ్చిందని నాకు అనిపిస్తోంది. కానీ గతం గుర్తుకొస్తే ఇంకా ఆ మోనిత తోనే ఎందుకు ఉంటాడు అన్న అనుమానం వెంటాడుతోంది
దీప: నీకెందుకు అనిపిస్తోంది..ఎలా చెబుతున్నావ్
దుర్గ: మోనిత నిన్ను ఇంత టార్చర్ చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు..లోకం దృష్టిలో తన భార్యకదా ..  
దీప: తన భార్యకి ఎవరితోనైనా సంబంధం ఉందని తెలిస్తే పరువు పోకుండా భార్యని ఏదైనా చేస్తారు..కానీ నిన్ను పోలీసుల నుంచి కాపాడి ఇంకా ఇంట్లోనే ఉంచారంటే మోనితని భార్య అని అనుకోవడం లేదు
దుర్గ: నేను ఇంత టార్చర పెట్టినా మోనిత వెంటపడుతున్నా.కార్తీక్ సార్ ముఖంలో ఎలాంటి మార్పు లేదు
దీప: నిన్న గుడిలో కూడా మోనిత ఉండగా నాతో కలసి దీపాలు వెలిగించారు..శౌర్య విషయంలో నేను ఎంత బాధపడ్డానో డాక్టర్ బాబులో కూడా అంతే బాధ చూశాను...
దుర్గ: గతం గుర్తుకురాకపోతే నీతో ఎక్కువ సేపు ఉండరు
దీప: గతం గుర్తొస్తే డాక్టర్ బాబు ఇంకా మోనిత దగ్గరే ఎందుకుంటారు..నేను బాధపడుతుంటే చూస్తూ కూడా నిజం చెప్పకుండా దాస్తున్నారంటే పెద్ద కారణం అయి ఉండాలి లేదంటే నిజం తెలియకపోవాలి

Also Read:  వసు ముందు తడబడిన గౌతమ్, దేవయానిని నిలదీసిన ఫణీంద్ర, రిషి ఏం చేయబోతున్నాడు!

మరొకవైపు ఇంద్రుడు తన పాత ఇంటి దగ్గరికి డబ్బులు వసూలు చేయడానికి వెళుతుండగా శౌర్య.. నేను వస్తాను బాబాయ్ అని వెంటపడుతుంది. శౌర్యని తీసుకెళ్లడం ఇష్టంలేక ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తాడు. అప్పుడు శౌర్య మనిద్దరమే కాదు పిన్ని కూడా ఇక్కడేం చేస్తుంది..తనని కూడా తీసుకెళదాం అంటుంది. ముగ్గురూ బయలుదేరుతారు..

దీపబయటికి వెళుతుండగా ఇంతలో మోనిత ఎదురు పడుతుంది. నీప్రాణాలు తీయబోతున్నాను..తిరిగి నా ప్రాణాలు తీయడానికి నువ్వు ఇక్కడ ఉండవ్ అనిహెచ్చరిస్తుంది. డాక్టర్ బాబు కోసం నేను ఎంతకైనా తెగిస్తానని దీప అంటే.. కార్తీక్ కోసం నీప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడను వెళ్లు బతికిపో అంటుందిమోనిత. అక్కడి నుంచి రెస్టారెంట్ కి వెళ్లిన మోిత.... మరొకవైపు రెస్టారెంట్ కి వెళ్లిన మోనిత మీద కోపంతో గబగబా తింటూ ఉంటుంది. ఎంత డబ్బులిస్తే మాత్రం ఇంత తింటారా అంటాడు..నాఇష్టం డబ్బులిచ్చేది నేను తీసుకురా అనుకుంటాడు...

దీప-కార్తీక్ 
మోనిత అన్నమాటలు తలుచుకుని దీప కోపంతో రగిలిపోతుటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన కార్తీక్ ఏమైంది ఎందుకంత సీరియస్ గా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు మోనిత అన్న మాటలు కార్తీక్ కి చెప్పడంతో కార్తీక్ ఆశ్చర్యపోతాడు. ఈ రోజు మోనిత అంతు తేలుస్తా అని ఆవేశంగా బయలుదేరుతుండగా.. అనవసరంగా గొడవలు ఎందుకు అని సర్థి చెప్పినా కూడా దీప మాత్రం కోపంతో రగిలిపోతుంటుంది. మోనిత ఇంట్లో లేదని కార్తీక్ చెప్పినా...వచ్చేవరకూ ఇంట్లోనే ఎదురుచూస్తా అంటుంది...

Also Read: దీప-కార్తీక్ ను సౌందర్య చూస్తుందా,ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!

రెస్టారెంట్లో మోనిత తింటుండగా అక్కడకు వచ్చిన సౌందర్యను చూసి షాక్ అవుతుంది. 
సౌందర్య: నువ్వేంటి అంతతిన్నావ్ అది కడుపా ఇంకేమన్నానా
మోనిత: ఏదో ఆకలేసి
సౌందర్య:ఆకలిపై ఉన్నావా కోపంలో ఉన్నావా..కోపంమీద ఉన్నవాళ్లూ కసిగా తింటారు
మోనిత: కార్తీక్ దూరమైన బాధ..అంకుల్ వచ్చి ఆనంద్ ని తీసుకెళ్లిపోయారు..అందుకే ఎక్కువ తిన్నా
సౌందర్య: ఏసీలో చెమటలు పడుతున్నాయి ఎందుకో భయపడుతున్నట్టున్నావ్...
మోనిత: వేడిగా,కారంగా ఉన్న ఫుడ్ తిన్నాకదా అందుకే చెమటలు
సౌందర్య: ఇంటికెళ్లి మాట్లాడుకుందాం పద..
మోనిత: ఎవరింటికి..ఇల్లెక్కడుంది..అది బొటిక్..బట్టలతో అంతా చిందరవందరగా ఉంటుంది..ఏదైనా హోటల్లో కూర్చుని మాట్లాడుకుందాం
సౌందర్య: నీ ఇంట్లో ఏమైనా చూడకూడనిది ఏదో ఉందా..మొన్న అంకుల్ వచ్చినప్పుడు కూడా ఇలాగే కంగారుపడ్డావట.. ఎప్పుడెప్పుడు వెళ్లిపోతారని చూశావట..
మోనిత: ఆనంద్ ని తీసుకెళ్లడానికి ఆనంద్ లేడుకదా..ఇప్పుడెందుకు కంగారు
సౌందర్య: నువ్వు ఇబ్బంది పడడం చూడలేకపోతున్నాను పద వెళదాం... ఇంత కంగారుపడుతోందంటే ఏదో ఉంది అనుకుంటూ పద అంటుంది
మోనిత: రండి ఆంటీ
సౌందర్య: నువ్వు ముందు వెళ్లు నీ వెనుకే నేను ఫాలో అవుతాను...వెనుక వస్తున్నానో లేదో చూసుకుని నిదానంగా వెళ్లు

మరోవైపు శౌర్య వాళ్లు మళ్లీ పాత ఇంటికి వస్తారు...ఇక్కడ బాగా అలవాటైపోయింది ఈ ఊరు అనవసరంగా వదిలేసి వెళ్లాం అనిపిస్తోంది అంటుంది..ఇక్కడే ఉంటే మీనానమ్మ, తాతయ్యలు వస్తారని కదా వెళ్లిపోయాం అని కవర్ చేస్తారు..

రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
ఈ రోజు మోనితతో నేను ఏం మాట్లాడినా మీరు అఢ్డుపడకూడదంటుంది దీప... ఇంతలో ఇంటికి చేరిన మోనిత.. దీప-కార్తీక్ లోపలే ఉండడం చూసి షాక్ అవుతుంది.. ఇంతలో సౌందర్య వచ్చి డోర్ కొడుతుంది.. దీప-కార్తీక్ డోర్ తీస్తారు...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget