News
News
X

Guppedantha Manasu November 15th Update: వసు ముందు తడబడిన గౌతమ్, దేవయానిని నిలదీసిన ఫణీంద్ర, రిషి ఏం చేయబోతున్నాడు!

Guppedantha Manasu November 15th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
 

గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  November 15th  Today Episode 608)

ఎన్నాళ్లిలా బాధపడతారు..ఇది కరెక్ట్ కాదంటాడు గౌతమ్..ఆ మాటలకు మహేంద్ర బాధపడతాడు
మహంద్ర: మీ ఇద్దరికన్నా, రిషి కన్నా ఈ మహేంద్ర భూషణ్ కే ఎక్కువ బాధ కలుగుతోంది..ఆ బాధని భరిస్తూచెప్పుకోలేక తట్టుకోలకే సతమతమవుతున్నాను.. తల్లిగా జగతి బాధ, ఫ్రెండ్ గా నీ బాధని అర్థం చేసుకుంటాను కానీ తండ్రిగా నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు. రిషికి శిక్ష వేసింది నేనే కానీ రిషి కన్నా ఎక్కువగా ఆ శిక్షకు బాధపడుతున్నది నేనే తెలుసా మీకు..
జగతి: ఎందుకిలా మాట్లాడుతున్నావ్
మహేంద్ర: నేను రిషి బాధని కావాలనే చూస్తూ ఊరుకుంటున్నా అనుకుంటున్నారా..ఈ విషయంలో కూడా మీకు స్పష్టత ఇవ్వాలికదా.. ఇనుమును కొలిమిలో కాల్వాలి, ఆ తర్వాత కాలిన ఇనుమును సుత్తితో కొట్టాలి అప్పుడే అనుకున్న ఆకారం వస్తుంది..ఇప్పుడు రిషి కొలిమిలో కాలుతున్న ఇనుము..ఆ రిషిని దేవయాని వదిన ముట్టుకోలేదు..తనకు ఇష్టం వచ్చినట్టు ఆటలాడిన వదినగారి ఆటలు ఇక సాగవ్..వదినగారికి మనుషుల బలం,బలహీనతలు తెలుసు..ఎదుటివారి బలహీనతలను తనకు బలంగా మార్చుకుంటుంది..ఇప్పుడు రిషిని తను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు..ఎందుకంటే..ఎక్కువ చేస్తే రిషి తన చేతుల్లోంచి జారిపోతాడని భయపడుతుంది..ఆవిడ ఆట కట్టించాలి,రిషి-వసు బంధంబలంగా ఉండాలనే కదా ఇదంతా చేస్తోంది..
జగతి: రిషిని ఇంతలా బాధపెట్టి...చివరికి
మహేంద్ర: ఫలితం దక్కతని బాధపడుతున్నావా..ఓపికగా ఎదురుచూస్తే ఫలితం తప్పకుండా దక్కుతుంది.. ఇప్పుడు ఫలితం దక్కబోతోంది..రిషి-నువ్వు మీరిద్దరూ నాకు ప్రాణసమానం..రిషికి దూరమై నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు..మళ్లీ ఏమవుతుందో అని భయపడుతున్నావ్  అంతేకదా...మన బంధాల మధ్య అడ్డుగోడలు నిర్మిస్తోన్న వదినగారి ఆటలు కట్టించాలన్నా, రిషి మనసు కడిగిన ముత్యంలా మారాలన్నా, వసు-రిషి బంధం బలపడాలన్నా ఈ అజ్ఞాతవాసం ఇంకొన్నాళ్లు తప్పదేమో.. ఒక్కోసారి చేదుగా ఉన్నా ఆరోగ్యం బాగుపడడం కోసం తాగక తప్పదు కదా ఇది కూడా అంతే అనుకో...
వసుధార రిషికి అండగా ఉంది..వసు రిషి పక్కన నిలబడింది అంటే ఏంటి అర్థం.. గౌతమ్ బాగా ఆలోచించు వసుధార రిషితోనే ఉంది..మేం తనని వదిలేశామని తను ఒంటరి అవుతాడని ఆలోచించి బాసటగా నిలుస్తోంది..రిషిని కంటికిరెప్పలా చూసుకుంటోంది..వసుధార ఆలోచనల్లో మార్పు మొదలైనట్టే కదా.. రిషి విషయంలో ఎంతోకొంత తన పంతాన్ని తగ్గించుకున్నట్టే కదా.

Also Read: దీప-కార్తీక్ ను సౌందర్య చూస్తుందా,ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!

కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ గురించి మీటింగ్ జరుగుతుంది. మరి మహేంద్ర సార్ అని లెక్చరర్లు అడిగితే..వస్తారు మేడం వాళ్లు వచ్చేవరకూ ఏ పనులూ ఆగకూడదు అంటాడు. ఆ మాటలు విన్న వసుధార...మీకు ఎంత నమ్మకం ఉంది సార్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లికాలేజీ మెట్లపైకూర్చుని బాధపడుతుంటుంది. మేడం జీవితంలో విజయం సాధించిన తర్వాత కూడా మీరు రాకుండా ఇలా నన్ను సాధిస్తున్నారా..మీరు లేని విజయం నా విజయం అనిపించుకోదు..ఎప్పుడొస్తారు.. మీరు వెళ్లి నన్ను-రిషి సార్ ని బాధపెడుతున్నారా అనుకుంటుంది...ఇంతలోకాల్ వస్తుంది... మీడయా వాళ్లు ఇంటర్యూ కి వస్తున్నామని చెబుతారు.. ఈ ఇంటర్యూ ఇప్పుడు చేయలేను ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి అంటుంది. ఇప్పుడు వాయిదా వేస్తే ఎప్పుడో చెబుతారా అని అడిగితే మీకు మళ్లీ ఇన్ఫామ్ చేస్తాను సారీ అనేస్తుంది.

News Reels

Also Read: చిక్కుల్లో పడ్డ దేవయాని- తండ్రికి దగ్గరగా రిషి, వాళ్ళని చూస్తాడా?

అటు  ఇంటికొచ్చిన భర్తతో..చూశారుగా ఈ మొగుడు పెళ్లాం ఎలా వెళ్లిపోయారో అంటుంది దేవయాని
ఫణీంద్ర: ఏం చేశావ్ నువ్వు
దేవయాని: మీరు నన్ననడం కరెక్ట్ కాదు..నేను జగతిని చెల్లిలా చూసుకున్నాను..రిషిని పట్టించుకోకుండా వెళ్లిపోయారు
ఫణీంద్ర: నేను అడుగుతున్నది కాఫీ గురించి...సరేకానీ అసలు వాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి..గొడవేమైనా జరిగిందా.. ఊరికెళ్లారని చెప్పావ్.. ఇంటి పెత్తనం అంతా నాదే అంటావ్..నువ్వు చేసే పెత్తనం ఇదేనా.. నాకు నిజం చెబుతావా లేదా
దేవయాని: దొంగ ఏడుపు మొదలుపెట్టిన దేవయాని..డ్రామా స్టార్ట్ చేస్తుంది.. ఆ జగతి చిన్నప్పుడే వెళ్లిపోతే రిషిని చూసుకున్నాను. ఇప్పుడు మాయమాటలు చెప్పి ఇంట్లోకి వచ్చింది..ఇప్పుడేమైందో తెలియదు ఇంట్లోంచి వెళ్లిపోయారు.. ఇంటిగుట్టు బయటపెట్టడం ఎందుకని పోలీస్ కంప్లైంట్ ఎందుకు అన్నాను..ఇదికూడా నా తప్పేనా.. అయినా న్యాయానికి రోజుల్లేవు...నా ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారు..అయినా నేనేం అంటాను.. జగతిని అనడానికి తనెక్కడుంటుంది.. పొద్దున్న కాలేజీకి వెళితే రాత్రికి వస్తుంది..మొగుడు పెళ్లాం మాట్లాడేందుకే టైం సరిపోదు..వాళ్లని ఎలా పిలిపిస్తారో మీరే చూసుకోండి అనేసి ఏడుస్తుంది
ఫణీంద్ర: ఏం జరిగిందో కాస్త ఊహించగలను..మిగిలినది చెప్పమని అడుగుతున్నాను..
ఇదంతా చూసిన ధరణి...అత్తయ్యగారూ మీ నటనకు నమస్కారం అని ఫణీంద్ర అనుకుని కాఫీ ఇవ్వమ్మా అని పిలుస్తాడు..

అటు కాలేజీలో కూర్చుని ఆలోచిస్తున్న వసుధార దగ్గరకు వచ్చిన గౌతమ్..నువ్వేంటి ఇక్కడున్నావ్..రిషి ఎక్కడ అని అడుగుతాడు.  ఇప్పుడేం పని అని గౌతమ్ అడిగితే.. అడ్మిషన్స్  స్టార్ట్ అవుతున్నాయి, మిషన్ ఎడ్యుకేషన్ పనులున్నాయి అన్నీ రిషిసారే చూసుకుంటున్నారు..మహేంద్ర సార్ ఉంటే బావుండేది అంటుంది
గౌతమ్: జరుగుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనం నిర్ణయాలు తీసుకోవాలి..అంకుల్ -జగతి మేడం రారు.. 
వసు: మీరెలా చెబుతున్నారు
గౌతమ్: మీ పెళ్లి విషయంలో ఓ నిర్ణయం తీసుకుని ఒక్కటైతే తప్ప వాళ్లు రారు అనిపిస్తోంది
వసు: ఈ మాటలు మీరే అంటున్నారా..మీతో ఎవరైనా అనిపిస్తున్నారా...
గౌతమ్: నాతో ఇంకెవరు అనిపిస్తారు చెప్పు..
వసు: లేదు సార్..మీరైతే ఇలా ఆలోచించరు..ఇంతదూరం ఆలచన చేయరు కదా
గౌతమ్: చేయాలి వసుధార..పరిస్థితికి తగ్గట్టుగా మారాలి అంటున్నాను.. ఎంతసేపూ డాడ్ రాలేదని వాడు..మేడం రాలేదని నువ్వూ బాధఫడడం ఎందుకు..పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోండి వాళ్లే వస్తారు
వసు: మహేంద్ర సార్ వాళ్లూ ఎక్కడున్నారు...మీకు తెలుసుకదా సార్...
గౌతమ్: ఏమంటున్నావ్..నాకేం తెలుసు..
వసు: మా పెళ్లి విషయంలో ఓ అడుగు ముందుకేస్తే వాళ్లు వస్తారని మీరెలా అంటారు
గౌతమ్: నేను అలా అనుకుంటున్నాను..అంతే...గుచ్చిగుచ్చి ఎందుకు అడుగుతున్నావ్..
వసు: సార్ వాళ్లు ఎక్కడున్నారో మీకు తెలిస్తే చెప్పండి..
గౌతమ్: ఈ మాట ఇప్పుడన్నావ్ కానీ రిషి ముందు అనకు..వాడు వింటే నాపీక నొక్కేస్తాడు..మీరు ఒక్కటైతేనే వాళ్లొస్తారు..
వసు: వాళ్లిద్దరూ లేకుండా మేం ఎలా ఒక్కటవుతాం అది అసంభవం కదా..
ఎపిసోడ్ ముగిసింది

Published at : 15 Nov 2022 09:13 AM (IST) Tags: Guppedantha Manasu Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy Guppedantha Manasu November 15th Guppedantha Manasu Today Episode 608

సంబంధిత కథనాలు

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

Priyanak Jain- Amardeep: షూటింగ్ సెట్‌లో అమర్ దీప్, ప్రియాంక జైన్ మధ్య పెద్ద గొడవ - షాకైన ‘జానకి కలగనలేదు’ టీమ్

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

NTR For SDT: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ - పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్న తారక్!

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు

టాప్ స్టోరీస్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Bansilalpet Stepwell : పర్యాటక హంగులతో బన్సీలాల్ పేట్ మెట్ల బావి, ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Mlas Bribery Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, బీఎల్ సంతోష్ జగ్గూ స్వామికి హైకోర్టులో ఊరట!

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

Ex MP Harsha Kumar : వైసీపీ గూటికి మాజీ ఎంపీ హర్షకుమార్‌!, ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో అధిష్ఠానం?

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!

ENG Vs PAK: పాకిస్తాన్‌పై 74 పరుగులతో ఇంగ్లండ్ ఘనవిజయం  - టీ20 తరహాలో సాగిన బ్రిటిషర్ల బ్యాటింగ్!