Guppedanta Manasu November 14th: చిక్కుల్లో పడ్డ దేవయాని- తండ్రికి దగ్గరగా రిషి, వాళ్ళని చూస్తాడా?
Guppedantha Manasu November 14th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
రిషి తండ్రి గురించి బాధపడతాడు. పెదనాన్న వచ్చి డాడ్ గురించి అడిగితే తనేం చెప్పాలి అని రిషి తన బాధని వసుతో చెప్తాడు.
రిషి: డాడ్ కి నా మీద కోపం వచ్చింది సరే, మీ మేడమ్ అయిన డాడ్ కి సర్ది చెప్పి తీసుకురావాలి కదా, మీ మేడమ్ కూడా కఠినంగా ఆలోచిస్తున్నారేమో
వసు: రిషి సర్ ని బాధపెడుతున్నారు మహేంద్ర సర్
రిషి వాళ్ళ పెదనాన్న వస్తున్నారు, ఆయన ఏమి అనకపోయిన అన్నట్లుగా రిషికి చాలా చెప్పాను ఇప్పుడు దాన్ని ఎలా కవర్ చేయాలో అని దేవయాని తలపట్టుకుని కూర్చుంటుంది. జగతి, మహేంద్ర వెళ్లిపోయారని సంతోషించాల్సిన నేను, ఈయన రావడం వల్ల టెన్షన్ పడాల్సి వస్తుందని మనసులో తిట్టుకుంటుంది. అప్పుడే ధరణి కాఫీ తీసుకుని వస్తుంది. జగతి, మహేంద్ర ఎక్కడికి వెళ్లారని ధరణిని అడుగుతుంది తెలియదని చెప్తుంది. వాళ్ళకి అసలు వెళ్లిపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని మళ్ళీ దేవయాని అంటే తనకేం తెలుసని ధరణి అంటుంది.
Also Read: తగలబెట్టుకుంటానన్న మోనిత, పట్టించుకోని కార్తీక్- ఉగ్రరూపం దాల్చిన దీప
వసు జగతికి మెయిల్ చేస్తుంది. నా గురించి ఆలోచించడం మానేసేయ్ మా వల్ల నువ్వు రిషికి దూరం కావొద్దని జగతి మనసులో అనుకుని బాధపడుతుంది. అప్పుడే మహేంద్ర వస్తాడు. కొన్నాళ్ళు వేచి ఉండాలి తప్పదు అని ఇద్దరు మాట్లాడుకుంటుంటే రిషి, వసు... గౌతమ్ ఇంటికి వస్తారు. వెంటనే మహేంద్ర గౌతమ్ కి ఫోన్ చేసి రిషి వచ్చాడని చెప్తాడు. ఇద్దరు రిషి ఇంట్లోకి వచ్చేలోపు వెళ్ళి గదిలో దాక్కుంటారు. రిషి గౌతమ్ ని పిలుస్తూ ఇంట్లో ఉన్న గదులన్నీ వెతుకుతాడు. గౌతమ్ కంగారుగా ఇంటికి బయల్దేరతాడు.
ఎంత పిలిచినా పలకడం లేదంటే ఇంట్లో లేరేమో అని వసు అంటుంది. రిషి నిలబడిన గది లోపలే మహేంద్ర వాళ్ళు ఉంటారు. రిషి గది తలుపు తియ్యబోతుంటే వెనుకాలే మహేంద్ర వాళ్ళు తమని ఎక్కడ చూస్తారో అని టెన్షన్ పడతారు. గదిలోకి వెళ్లబోతుంటే గౌతమ్ వచ్చి పిలుస్తాడు. దీంతో రిషి ఆ గదిలోకి వెళ్ళకుండా వెనక్కి వచ్చేస్తాడు. డాడ్ వాళ్ళ గురించి కంప్లైంట్ ఇద్దామని రిషి అంటాడు. వద్దని గౌతమ్ చెప్పినా కూడా రిషి వినడు. ఎన్నాళ్ళు వెయిట్ చెయ్యాలి, పెదనాన్న వస్తున్నారని రిషి చెప్తాడు. వీడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తను ఇరుక్కుపోతా అని గౌతమ్ మనసులో అనుకుంటాడు.
Also Read: నిజం ఒప్పుకున్న యష్- ఖుషిని తీసుకుని వెళ్ళిపోయిన వేద
మహేంద్ర వాళ్ళ కోసం రిషి ఎంత బాధపడుతున్నాడో వసు చెప్తుంది. అదంతా చాటుగా మహేంద్ర వాళ్ళు వింటూనే ఉంటారు. పెదనాన్న వస్తున్నారని అంకుల్ కి మెయిల్ చెయ్యి, ఫ్యామిలీ మేటర్ పోలీస్ స్టేషన్ కి ఎందుకని నచ్చజెప్పడానికి చూస్తాడు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో నీకేమైన తెలుసా అని రిషి గౌతమ్ ని నిలదీస్తాడు. పెదనాన్న వస్తున్నారని మెయిల్ చెయ్యి రెండురోజులు చూడు అప్పటికి రాకపోతే అప్పుడు చూద్దామని గౌతమ్ చెప్తాడు. అందుకు రిషి సరే అని వెళ్ళిపోతాడు. జగతి రిషి మాటలు తలుచుకుని బాధపడుతుంది. ఈ దాగుడుమూతలకి ముగింపు పలుకుదాం, అన్ని ఆపేసి వెళ్లిపోదాం పద అని జగతి మహేంద్రతో చెప్తుంది. రిషిని బాధపెట్టడం కరెక్ట్ కాదని గౌతమ్ కూడా మహేంద్రకి నచ్చజెప్పడానికి చూస్తాడు.