Karthika Deepam November 14th: తగలబెట్టుకుంటానన్న మోనిత, పట్టించుకోని కార్తీక్- ఉగ్రరూపం దాల్చిన దీప
కార్తీకదీపం నవంబరు 14 ఎపిసోడ్:టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
‘కార్తీక్ కి నా ప్రేమంటే విలువ లేకుండా పోయింది, నీకు నేనంటే భయం లేకుండా పోయింది, నన్ను అంటావ్ కదా నక్క, తోడేలు అని అవే అవుతాను. ఇక మీ ఇద్దరిలో ఒకరు పోవడం ఖాయం’ అని మోనిత దీపతో అంటుంది. ‘ఇప్పటి వరకు నువ్వు ఏం చేసిన ఎందుకు భరిస్తున్నానో తెలుసా డాక్టర్ బాబుని క్షేమంగా ఉన్నారన్న ఒకే ఒక కారణంతో, ఆయనకి ఏ మాత్రం కీడు తలపెట్టాలని ఆలోచన వస్తే నిలువునా చీరేస్తాను’ అని దీప వార్నింగ్ ఇస్తుంది. హిమ, ఆనందరావు శౌర్య గురించి మాట్లాడుకుని బాధపడతారు. దీప చెరువులో కార్తీకదీపాలు వదిలాడనికి వస్తుంది. ఆ వెనుకే మోనిత కూడా వస్తుంది. దీప దీపాలు వదలడానికి కిందకి వంగుతుంటే తోసేయడానికి చూస్తుంది, వెంటనే కార్తీక్ వచ్చి తనని ఆపి పక్కకి తీసుకొస్తాడు.
మోనిత: నువ్వు నాకు కావాలి, నీకోసం ఏమైనా చేస్తాను
కార్తీక్: తనేదో తన భర్త కోసం పూజ చేసుకుంటుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి
మోనిత: తన భర్త కోసం చేసుకుంటుంటే నువ్వు ఉండాల్సిన అవసరం ఏంటి? తనతో కలిసి దీపాలు వెలిగించాల్సిన అవసరం ఏంటి?
కార్తీక్: నిన్న నువ్వు పూజ కోసం డబ్బులు ఇచ్చావ్ కదా నేను తనకి పూజలో సాయం చేశాను తప్పేంటి
Also Read: మచ్చలేని స్వచ్ఛమైన భావాలేవో ఉరకలేసే, ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రిషికి వసు హగ్
మోనిత: ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా, నాతో కలిసి పూజ చేసి దీపం వెలిగించాలి. నేను అడిగితే కర్చీఫ్ చేతిలో పెట్టి వెళ్లిపోయావ్, భార్యని నన్ను వదిలేసి ఏ సంబంధం లేని తనతో ఏంటి ఇది
దీప: గుడిలో ఉన్నాం కాస్త నోరు అదుపులో పెట్టుకో
కార్తీక్: నువ్వు నేను భార్య భర్తలం కదా ఏంటి ఇదంతా, నేను ఏమైనా వంటలక్క భర్తని అంటున్నాన, చెప్పు నేను వంటలక్క భర్తనా
మోనిత: కావాలని చేస్తున్నావో, లేదా ఈ వంటలక్క ఆడిస్తున్నట్టు ఆడుతున్నావో తెలియడం లేదు. ఈరోజుతో దీనికి ముగింపు పలకాలి, వంటలక్కతో ఇక మాట్లాడను అని నాకు మాట ఇవ్వు.. లేదంటే ఇక్కడే నన్ను నేను తగలబెట్టుకుంటా
దీప: తగలబెట్టుకోవే.. చూస్తావ్ ఏంటి తగలబెట్టుకో, డాక్టర్ బాబు నన్ను కలుస్తారు, మాట్లాడతారు, నేను నిన్ను తగలబెట్టన
మోనిత: నన్ను తగాలబెడతావా గుళ్ళో ఉండి చెప్తున్నా రేపు ఈ పాటికి నువ్వో డాక్టర్ బాబు ఎవరో ఒకరు ఉంటారు, నాకు దక్కని వాడిని ఎవరికి దక్కనివ్వను
కార్తీక్: ఏంటి నీకు అంత కోపం వచ్చేసింది, నిజంగానే తగలబెట్టేస్తావ్ అనుకున్నావ్
Also Read: ఇవాల్టితో నీ దీపం ఆరిపోతుందన్న మోనిత - నీ పాపం పండిందన్న దీప, కార్తీక్ కి ఏం జరగబోతోంది!
శౌర్య ఇంద్రుడు, చంద్రుడు గురించి ఆలోచిస్తుంటే వాళ్ళు వచ్చి కావాలని తను వినేలాగా డ్రామా మొదలుపెడతారు. ఆటో అమ్మేశాం కదా వాళ్ళ అమ్మానాన్నని వెతకడం ఇష్టం లేక అలా చేశాను అనుకుంటుంది అని అబద్ధాలు చెప్తాడు. వాళ్ళ ఇద్దరి మాటలు విన్న శౌర్య బాధపడుతుంది. మీ గురించి ఇక తప్పుగా అనుకొను అని సోరి చెప్తుంది.
దీప గుడిలో జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటే కార్తీక్ టిఫిన్ తీసుకొచ్చి తినమని ఇస్తాడు. అది మోనిత చూస్తుంది. హడావుడిగా టిఫిన్ తీసుకొస్తుంటే ఎవరి కోసమే అనుకున్నా ఈవిడ గారి ఉపవాసం తీర్చడానికా, నేను కూడా ఉపవాసం ఉన్నా కదా నా గురించి పట్టించుకోకుండా వస్తావా, నీకు గతం గుర్తుకు వచ్చిందని నాకు అనుమానం రోజు రోజుకి బలపడుతుంది, తేలుస్తా మీ గురించి అని మనసులో అనుకుంటుంది. తగలబెట్టుకుంటున్నా అంటే చలనం లేదు కార్తీక గతం గుర్తుకు వచ్చిందా అని మోనిత ఆలోచిస్తూ ఉంటుంది.