Karthika Deepam November 11th Update: ఇవాల్టితో నీ దీపం ఆరిపోతుందన్న మోనిత - నీ పాపం పండిందన్న దీప, కార్తీక్ కి ఏం జరగబోతోంది!
కార్తీకదీపం నవంబరు 11 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam November 11th Episode 1507 (కార్తీకదీపం నవంబరు 11 ఎపిసోడ్)
మోనిత కార్తీక్ కు గతం గుర్తొచ్చినట్టా రానట్టా అంటూ ఆలోచించుకుంటూ ఇంటికి వస్తుంది. బోటిక్ లో ఆనంద్ రావు, హిమ వెయిట్ చేస్తుంటారు. ఎందుకు ఇక్కడకు వచ్చారని మోనిత కంగారుగా అడగడంతో..నన్ను చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు ఆనందరావు. అంకుల్ ప్లీజ్ ఇక్కడినుంచి వెళ్లిపోండని మోనిత అనడంతో..ఆనంద్ ని నీదగ్గర్నుంచి తీసుకెళ్లిపోవాలి అనుకుంటున్నాం అని చెప్పి..లోపల హిమ బాబుతో ఆడుకుంటోంది మాట్లాడాలి రా అని పిలుస్తాడు. కార్తీక్ వస్తాడేమో అని మోనిత టెన్షన్ పడుతుంటుంది.
హిమ: తమ్ముడిని మాతో తీసుకెళతాం
మోనిత: వద్దు వాడు నాతోనే ఉంటాడు
ఆనందరావు: ఎప్పుడూ వాడిని వదిలి ఉండనట్టు బిహేవ్ చేస్తున్నావేంటి..హిమ అడుగుతోంది కదా కొద్దిరోజులు మా దగ్గరే ఉంటాడు
మోనిత: ఇప్పుడు బాబుని పంపిద్దామంటే..బాబు ఏడని కార్తీక్ అడిగితే ఏం చెప్పాలి, పంపించకపోతే వీళ్లు కదిలేలా లేరు అనుకుంటుంది. ఈ లోగా కార్తీక్ వస్తే ప్రమాదం అనుకుంటూ..శివలతా బాబు బట్టలు సర్దు అని చెప్పేసి కంగారుగా బయటకు వెళుతుంది
Also Read: చెరువులో పడిపోయిన వసుధార, కంగారులో రిషి -రగిలిపోతున్న దేవయాని
బయటికి వచ్చిన మోనిత..ఇప్పుడు కార్తీక్,దుర్గ, వంటలక్క ఎవరు అంకుల్ నిచూసినా ప్రమాదమే అనుకుంటూ వంటలక్క ఇంటికి వెళ్లి కార్తీక్ ఏడని అడుగుతుంది
దీప: నీకు డాక్టర్ బాబు కావాలా దుర్గ కావాలా చెప్పు దుర్గా కావాలంటే నేను ఇక్కడి నుంచి నా డాక్టర్ బాబును తీసుకొని వెళ్ళిపోతా మోనిత: ఏయ్ విసిగించకు కార్తీక్ ఎక్కడున్నాడో చెప్పు
అక్కడినుంచే వస్తున్నాను కదా మా ఇంటికిరాలేదే అనుకుంటూ మళ్లీ కంగారుగా ఇంటికి పరుగులు తీస్తుంది. ఇంతలో కార్తీక్ లోపలకు వెళుతుండగా ఫోన్ చేసి కార్తీక్ ను ఆపేస్తుంది. ఏమైందని అడిగితే...శివకు యాక్సిడెంట్ అయిందంటూ అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే శివ కారు దగ్గరకు వస్తాడు.
కార్తీక్: నీకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారు నువ్వు బాగున్నావ్
మోనితకు ఏం చెయ్యాలో తెలియక వణికిపోతుంది..
కార్తీక్:ఎవరో ఫోన్ చేశారన్నవ్ కదా ఏది ఫోన్ చూపించు అని అంటే ఏం నామీద నమ్మకం లేదా అంటే నువ్వు చెప్పేవి అన్నీ అబద్దాలు నిన్ను ఎలా నమ్మాలి . అసలు ఇక్కడ నుంచి ఎందుకు పంపించాలనుకుంటున్నావ్ నీ ప్లాన్ ఏంటి ఇంట్లో ఎవరు ఉన్నారు అంటూ కార్తీక్ ఇంట్లోకి వెళ్లాలనుకుంటాడు.
అప్పటివరకు ఇంట్లో ఉన్న ఆనంద్ రావు వాళ్లని పనిమనిషి అక్కడి నుంచి పంపించేస్తుంది.. చెప్పాను కదా ఇంట్లో ఎవరూ లేరని అంటుంది మోనిత
Also Read: మోనితకు చుక్కలు చూపిస్తోన్న కార్తీక్-దుర్గ, తమ్ముడికోసం వచ్చిన హిమ తండ్రిని చూస్తుందా!
లోపలకు వచ్చిన కార్తీక్ ఇంతకీ ఆనంద్ ఎక్కడున్నాడు అని అడిగితే..ఇప్పుడు వాడి గురించి ఎందుకు? మళ్లీ నన్ను ఏదో ఒక రకంగా అనుమానించాలా అంటూ మోనిత సీరియస్ అవుతుంది. దీంతో కార్తీక్ అక్కడినుంచి వెళ్లిపోతాడు. అప్పుడే వచ్చిన శివ చెంప పగలగొట్టి కాసేపయ్యాక రావాల్సింది కదా అని ఫైర్ అవుతుంది. అటు హిమ...ఆనంద్ ని చూసి మురిసిపోతుంది...ఇకపై శౌర్య గురించి ఆలోచించకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలంటాడు ఆనందరావు. ఇకపై తమ్ముడితో ఆడుకుని బుద్ధిగా చదువుకో..శౌర్య గురించి నేను-మీనానమ్మ చూసుకుంటాం ఆ బాధ్యత మాది అంటాడు. మరోవైపు మోనిత... సమయానికి శివలత వాళ్లిద్దర్నీ పంపించేసి మంచిపని చేసిందని పొగుడుతుంది...మరోవైపు శివలతకి నిజం తెలిసిపోయిందనుకుంటూ..ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని చెబుతుంది. మేం ఇద్దరం కలసి ఉండేలా ప్లాన్ చేయాలి అనుకుంటుంది...
ఎపిసోడ్ ముగిసింది