By: ABP Desam | Updated at : 10 Nov 2022 10:35 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu November 10th Today Episode 604 ( (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 10th Today Episode 604)
వసుధార యూనివర్శిటీ టాపర్ అవడంతో జగతి-మహేంద్ర-గౌతమ్ సంతోషిస్తారు.ఈ అజ్ఞాతవాసం ఎందుకు అంకుల్.. అంతా హ్యపీగా ఉన్నారు ఈ సంతోషంలో మీరుకూడా ఇంటికి వస్తే బావుంటుంది కదా..రిషి ఈరోజు మిమ్మల్ని ఎంత మిస్సయ్యాడో అని గౌతమ్ అంటాడు
మహేంద్ర: పరుగులు తీయడానికి సిద్ధంగా ఉన్న గుర్రంలా ఉంది నా మనసు కానీ నేనే కంట్రోల్ చేసుకుంటున్నా.. కానీ కొన్నాళ్లు ఆగక తప్పదు
గౌతమ్: మీకోసం వాడు వెయిట్ చేస్తున్నాడు..వాడికోసం మీరు బాధపడుతున్నారు..ఎందుకిదంతా.. మేడం మీరైనా చెప్పండి..
మహేంద్ర: రిషి బాగుకోసం ఇంకొన్నాళ్లు ఈ అజ్ఞాతం తప్పదు అనేసి అక్కడి నుంచి లేచెళ్లిపోతాడు మహేంద్ర...
కట్ చేస్తే.. రిషి వసు కార్లో వెళుతుంటారు... తాను సాధించిన విజయాన్ని శుభాకాంక్షలు తలుచుకుని సంతోషపడుతుంది వసుధార..
రిషి: ఏంటి ఆలోచిస్తున్నావ్..ఎట్టకేలకు సాధించావ్
వసు: ఈ విజయం వెనుక చాలామంది ఉన్నారు
రిషి:ముందు సెలబ్రేట్ చేసుకోవాలి.. నీకు ఏం కావాలో కోరుకో..నువ్వు అడిగి చూడు కాదనే సమస్యే లేదు
వసు: నిజంగా కాదనరా
రిషి: ఒక్కసారి మాటిస్తే వెనక్కు వెళ్లడు
జగతి మేడం అని వసు మొదలెట్టగానే...ఇంకా మాట పూర్తికాకుండానే రిషి కారుని రోడ్డుపక్కకు ఆపేస్తాడు..ఏం కోరుతుందో అనుకుంటాడు...
వసు: నా ప్రతి విజయానికి తనే కారణం..ఎక్కడో ఉన్న నేను ఇక్కడకు వచ్చాను..మీ పక్కన నేను కూర్చుని ఉన్నానంటే అంతా మేడమే..మేడంకి నేను చాలా రుణపడి ఉన్నాను సార్..ఇంతపెద్ద విజయం సాధించిన తర్వాత కూడా నేను తనకి ఏమీ చేయలేకపోతే ఎలా సార్
రిషి: ఇంతకీ నీకు ఏం కావాలి
వసు: ఆ దేవతకి పాదాభివందనం చేయాలి..తనను నేను చూడాలి
రిషి:ఇవన్నీ ఓకే...ఏదో అడుగుతాను అన్నావ్ కదా అడుగు
వసు: మీకు నచ్చకపోవచ్చు
రిషి: నీకుకావాల్సింది అడగమన్నాను..నాకు నచ్చేది కాదు..
వసు: చెప్తాను సార్ మీరు కారు పోనివ్వండి...
Also Read: మోనితకు చుక్కలు చూపిస్తోన్న కార్తీక్-దుర్గ, తమ్ముడికోసం వచ్చిన హిమ తండ్రిని చూస్తుందా!
ఇద్దరూ ఓ చెరువు పక్కన కూర్చుని ఉంటారు..మళ్లీ పడవలు చేస్తుంది వసుధార..
వసు: జగతిమేడం రావాలని రాస్తున్నా సార్..అంటే మహేంద్ర సార్ కూడా వస్తారు కదా
రిషి: ఇవన్నీ కేవలం నీకోసమే చేస్తున్నా..నేను చేయనా అంటూ పేపర్ తీసుకుని పడవ చేస్తాడు..
వసు: సార్..ఇంత తొందరగా ఎలా చేశారు...మీకొచ్చా
రిషి: వచ్చు..నాకు ఒకరు నేర్పించారులే..వసుధార అనే అమ్మాయి నేర్పించింది..
వసు: ఎప్పుడు సార్
రిషి: ఆరోజు లైబ్రరీలో.. ( అప్పట్లో లైబ్రరీలో చిక్కుకున్నప్పుడు వసుధార నేర్పిస్తుంది). నువ్వే కదా అన్నావ్ ప్రేమంటే నమ్మకం అని నీపై ప్రేమ ఉందంటే నమ్మకం ఉన్నట్టే కదా..నువ్వేం చెప్పినా నీకోసం నీ సంతోషం కోసం నేను నమ్ముతాను
వసు: థ్యాంక్యూ సార్..
రిషి: నేను తీసుకోవడం లేదు..
వసు: మీరు తీసుకుంటారు సార్..నాకు తెలుసు
Guppedantha Manasu - Promo | 10th Nov 2022 | Mon-Sat at 7 pm Only on #StarMaa#StarMaaSerials#GuppedanthaManasu pic.twitter.com/D3dKnbqWxV
— starmaa (@StarMaa) November 10, 2022
Also Read: వసుధారకి గుడ్ న్యూస్ చెప్పిన రిషి, ఈగోని మళ్లీ తట్టిలేపిన పొగరు
ఇంట్లో దేవయాని పరమ చిరాగ్గా ఉంటుంది..ఇంకా ఎవ్వరూ ఇంటికి రావడం లేదేంటో అనుకుంటూ ధరణి అని కోపంగా పిలుస్తుంది.
ధరణి: వసుధార మంచి విజయం సాధించింది కదా రిషి స్వీట్స్ చేయమన్నాడు
దేవయాని: నాకు చెప్పాల్సిన పనిలేదా
ధరణి: సరే వద్దులెండి..ఆపేస్తాను..రిషి అడిగితే మీరు వద్దన్నారని చెబుతాను
దేవయాని: నన్నెందుకు రాక్షసిని చేయాలని అనుకుంటున్నావ్..ఈ భూమ్మీద ఎన్నిరకాల స్వీట్స్ ఉంటాయో అన్నీ చేయి
ధరణి: మీరు కూడా ఓ చేయి వేస్తారా..ఇంతకీ గ్రీన్ టీ కావాలా వద్దా
దేవయాని: నాకు మాట్లాడే ఓపిక లేదు..గ్రీన్ టీ తీసుకొచ్చి ఇవ్వు..
అటు రిషి-వసుధార ఇద్దరూ పడవలు వదిలేందుకు చెరువులోకి వెళతారు. పడిపోతావ్ జాగ్రత్త అంటే..పట్టుకునేందుకు మీరున్నారు కదా అంటుంది.. ఇద్దరూ పడవలు వదులుతారు.. జగతి మేడం రావాలని వసు అనుకుంటే.. వసు నమ్మకం నిజమవ్వాలి డాడ్ వాళ్లు ఇంటికి తిరిగిరావాలని కోరుకుంటాడు రిషి. రంగురంగు పడవలు చూసి వసు మురిసిపోతుంది.. వసుని చూసి రిషి మురిసిపోతాడు..ప్రకృతిపై ఓ చిన్న క్లాస్ తీసుకుంటుంది వసుధార... ఆ తర్వాత సంబరంగా నీట్లో ఎగురుతూ కిందపడుతుంది వసుధార..రిషి కంగారుపడతాడు...బట్టలు తడిచిపోయానని వసు అంటే..నాకోటు వేసుకో అని ఇస్తాడు రిషి..
అటు ఇంట్లో గౌతమ్..దేవయాని ముందు కూర్చుని వసుధార గురించి గొప్పగా మాట్లాడుతుంటాడు...నేను చాలా వీడియోలు తీశాను చూస్తారా అని గౌతమ్ అంటే ధరణి చూపించిందిలే అంటుంది దేవయాని. అవును పెద్దమ్మా వీడింకా రాలేదేంటని గౌతమ్ అంటే.. పొద్దున్న నుంచీ సాయంత్రం వరకూ మీరిద్దరూ కలసి తిరుగుతారు..నువ్వు నాకు చెప్పాలి కానీ నన్ను అడుగుతావేంటి అంటుంది దేవయాని..
ఎపిసోడ్ ముగిసింది..
The Goat Life Release Date: ఎడారి దేశంలో భారతీయ కూలీ కష్టాలు - మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సినిమా విడుదలకు రెడీ!
ఫ్రీగా ‘సలార్’ టికెట్లు, ‘కాలింగ్ సహస్ర’కు థియేటర్ల కరువు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...
Allu Arjun: అభిమాని కోసం బన్నీ సెల్ఫీ వీడియో - 30 వేల ఫాలోవర్లు టార్గెట్!
Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్ సినిమా ఎక్కడ - 'యానిమల్' దెబ్బకు షోస్, స్క్రీన్స్ గల్లంతు
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
Rajasthan Exit Poll 2023 Highlights:రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి షాక్ తప్పదు! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనా
/body>