News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedantha Manasu November 9th Update: వసుధారకి గుడ్ న్యూస్ చెప్పిన రిషి, ఈగోని మళ్లీ తట్టిలేపిన పొగరు

Guppedantha Manasu November 9th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  November 9th  Today Episode 603)

దేవయానికి కాఫీ తీసుకెళ్లిన వసుధార కాసేపు సెటైర్స్ వేస్తుంది. దేవయాని కూడా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నా బాగా గమనిస్తున్నా...జగతి నిన్ను చెంపదెబ్బ కొట్టినందుకే రిషి అలా ఫీలయ్యాడంటే నువ్వేంటో అర్థమైంది. మీరు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ మేడం..మా ఇద్దరికీ మా మనసేంటో తెలుసు..మిగిలిన వాళ్లు  ఏమనుకున్నా అనవసరం.. ఓ చీర ఇచ్చి కట్టుకుంటుందా లేదా అని ప్లాన్స్ వేశారు..ఆ ప్రయత్నం ఎవరు చేశారో నాకు తెలుసు ( దేవయానికి డౌట్ వస్తుంది)..ప్రశాంతంగా ఉండండి మేడం అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి రిషిసార్ నాకోసం ఎదురుచూస్తుంటారు అంటూ వెళ్లిపోతుంది. వసుధారా నీ పద్ధతేం బాలేదు..ఇస్తా అనుకుంటుంది దేవయాని.

Also Read: కార్తీక్ కొట్టిన చెంపదెబ్బకి మోనిత రియాక్షన్, కార్తీకదీపం కథలో మరో కీలక మలుపు

రిషి- గౌతమ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతుంటారు. ఈ టైమ్ లో డాడీ ఉండాల్సింది అని రిషి బాధపడతాడు. అప్పుడే వసుధార రావడంతో అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ అని గౌతమ్ చెబుతాడు. అప్పుడే చెప్పకండి సార్ రిజల్ట్స్ వచ్చాక చూద్దాం.... నాకు కొంచం భయంగా ఉంది..లాస్ట్ పరీక్ష కష్టంగా రాశాను అని అంటుంది. నువ్వు టెన్షన్ పడొద్దని ధైర్యం చెబుతాడు రిషి. ఆ తర్వాత అందరూ కాలేజీకి బయలుదేరుతారు. కాలేజీలో ఎంట్రీ ఇవ్వగానే రిజల్ట్స్ వచ్చాయని అంతా మాట్లాడుకుంటారు. నోటీస్ బోర్డు దగ్గరకు వెళ్లిన వసుధార..రిజల్ట్స్ చూడాలంటే భయపడి పుష్పను చూడమని చెబుతుంది. చూసొచ్చిన పుష్ప...నా నెంబర్ కనిపించింది సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను.. నీ నెంబర్ ఇక్కడ కనిపించడం లేదంటుంది..

ఆ మాటలకు షాక్ అయిన వసుధార..అక్కడ నుంచి బాధగా వెళ్లిపోతుంది. నేను రిషి సార్ నమ్మకాన్ని, మేడమ్ మహేంద్ర సార్ అందరి నమ్మృకాన్ని ఒమ్ము చేశాను.. నేను ఓడిపోయాను మేడం.. నేను ఓడిపోయాను అంటూ వసుధార ఏడుస్తూ ఉంటుంది. రిషి అక్కడకు రావడంతో...నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పి ఏడుస్తుంటుంది...కాసేపు చూసిన రిషి..కంగ్రాట్స్ వసుధార అని చెబుతాడు..ఏంటి సార్ ఫెయిల్ అయినా కంగ్రాట్స్ చెబుతారా అని అంటే ఎవరన్నారు నువ్వు ఫెయిల్ అయ్యావ్ అని నువ్వు పాస్ అయ్యావు అంటే ఆనందంతో వసుధార మళ్లీ షాక్ అవుతుంది. నా నెంబర్ లిస్ట్ లో లేదు కదా అంటే యూనివర్సిటీ నెంబర్ లిస్ట్ లో అవసరమా అని నేనే ప్రింట్ చెయ్యలేదు అని అంటాడు. అప్పుడు  వసుధార ఆనందంతో నేను సాధించాను అంటూ గట్టిగా అరుస్తుంటుంది. గౌతమ్ వచ్చి కంగ్రాట్స్ చెబుతాడు. అప్పుడే స్టూడెంట్స్ అందరూ వచ్చి యూనివర్సిటీ టాపర్ అంటూ పొగుడుతారు. 

Also Read: మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానంటూ వసు కన్నీళ్లు, ఇప్పుడు రిషి ఏం చేయబోతున్నాడు!

దేవయాని దగ్గరకు వచ్చిన ధరణి మన వసుధార టాప్ వచ్చిందంటూ చెబితే చిరాకుగా పక్కకువెళ్లు అని ఫైర్ అవుతుంది.మరోవైపు గౌతమ్...వసుధార వీడియో తీసుకెళ్లి జగతి మహేంద్రలకు చూపిస్తాడు. వాళ్ళు ఇద్దరు తెగ సంతోషపడతారు. నా వసుధార విజయం సాధించింది అంటూ జగతి ఆనందపడుతుంది. మహేంద్రను ఇంకా ఈ అజ్ఞాతం ఎందుకు ఇంటికి వెళ్లిపోదాం అంటుంది..
ఎపిసోడ్ ముగిసింది

రేపటి (గురువారం) ఎపిసోడ్ లో
యూనివర్శిటీ టాపర్ వసుధార...వినడానికి ఎంత బావుందో అని అంటాడు. ఏదైనా కోరుకో కాదనే సమస్యే లేదని రిషి అనగానే.. వసు జగతి మేడం అంటుంది... కారు ఆపేస్తాడు...

Published at : 09 Nov 2022 10:07 AM (IST) Tags: Guppedantha Manasu Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy Guppedantha Manasu November 9th Guppedantha Manasu Today Episode 603

ఇవి కూడా చూడండి

‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్‌డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్‌డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!

Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Nani: 'సరిపోదా శనివారం' విడుదల ఎప్పుడో చెప్పేసిన నాని!

Nani: 'సరిపోదా శనివారం' విడుదల ఎప్పుడో చెప్పేసిన నాని!

Redin Kingsley Marriage: సీరియల్ నటితో కమెడియన్ రెడిన్‌ వివాహం, నెట్టింట్లో ఫోటోలు వైరల్

Redin Kingsley Marriage: సీరియల్ నటితో కమెడియన్ రెడిన్‌ వివాహం, నెట్టింట్లో ఫోటోలు వైరల్

టాప్ స్టోరీస్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ

Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ