News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Guppedantha Manasu November 8th Update: మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానంటూ వసు కన్నీళ్లు, ఇప్పుడు రిషి ఏం చేయబోతున్నాడు!

Guppedantha Manasu November 8th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  November 8th  Today Episode 602)

అక్కడి వరకూ వచ్చి మహేంద్ర వాళ్లు కలవకుండా వెళ్లిపోవడంపై రిషి ఎమోషన్ అవుతాడు. ఈ రిషి... డాడ్ కి అవసరం లేదా.. ఎప్పటికీ నా దగ్గరకు రారా అని బాధపడతాడు. ఎక్కడికి వెళ్లినా ఎగ్జామ్ రిజల్ట్ రోజు కచ్చితంగా రావాలి కదా సార్ వస్తారు లెండి అని ధైర్యం చెబుతుంది వసుధార. ఈ సమస్యని మరింత పెద్దది చేస్తున్నారా..రిషి సార్ ని ఎందుకు బాధపెడుతున్నారు ఈ సమస్యకి పరిష్కారం నేనూ చూస్తాను అనుకుంటుంది వసుధార. ఆ తర్వాత ఇంటికెళతారు..

ఎంటంకుల్ రిషికి కనిపించారా మీరు అని అడుగుతాడు గౌతమ్.. లేదులే గౌతమ్ కొద్దిలో తప్పించుకున్నాం అని రిప్లై ఇస్తాడు మహేంద్ర. అంకుల్ ఇవన్నీ అవసరమా ఇప్పటికైనా వదిలేయవచ్చు కదా అని గౌతమ్ అంటే..ఇద్దరం బాధపడుతున్నాం ఇంకా నేనొకటి అనుకుంటున్నాను అది జరగాలి అంటుంది. ఇంతకీ వసుధార మనసులో ఏముందని మహేంద్ర అడగడంతో..  రిషిని ఆ బాధనుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది అని చెబుతాడు..ఇంతలో దేవయాని అక్కడకు రావడంతో గౌతమ్ కాల్ కట్ చేస్తాడు. ఫోన్ తీసుకున్న దేవయాని..నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసు..మీ పెదనాన్నికి ఇక్కడి సిట్యుయేషన్ చెబుతున్నావా ఇవన్నీ చెప్పి ఆయన్ని టెన్షన్ పెట్టకు అంటుంది. హమ్మయ్య అనుకున్న గౌతమ్..  మీరు చాలా తెలివైన వాళ్లు పెద్దమ్మా అంటాడు...ఇంతలో రిషి వసు వస్తారు..
దేవయాని: ఏంటి నాన్నా అలా ఉన్నావేంటి..వెళ్లిన పని ఓకేనా..ఏమైంది నాన్నా
రిషి: డాడ్ ఏం చేశారో తెలుసా...
దేవయాని: మహేంద్ర వచ్చాడా
రిషి: వచ్చే ఉద్దేశం డాడ్ కు లేనట్టుంది..మినిస్టర్ గారిదగ్గరకు వచ్చారు..నేను వెళ్లేలోపే వెళ్లిపోయారు.. డాడ్ ఇలా ఎందుకు చేస్తున్నారు
దేవయాని: మనుషుల స్వరూపాలు కొందరు ఈ ఇంటికి వచ్చాక మారిపోయాయి..నువ్వు ఎక్కువ ఆలోచించి మనసు పాడుచేసుకోవద్దంటూ ఇన్ డైరెక్ట్ గా జగతిని ఉద్దేశించి మాట్లాడుతుంది
వసుధార: అందరి స్వరూపాలు బాగానే ఉన్నాయి..మీ నిజస్వరూపం తెలిస్తే అప్పుడుంటుంది అనుకుంటుంది వసుధార
నువ్వు పద నాన్నా అని లోపలకు తీసుకెళ్లిపోతుంది దేవయాని.. వసుధార కూడా అక్కడినుంచి వెళ్లిపోతుంది

Also Read: ఇన్నాళ్లూ నా ప్రేమనే చూశావ్ ఇకపై నా పంతాన్ని చూస్తావ్, కార్తీక్ ని టార్గెట్ చేసిన మోనిత

రూమ్ కి వెళ్లిన రిషి తండ్రిని గుర్తుచేసుకుని బాధపడతాడు.. ఇంతలో ద్వారం దగ్గర మహేంద్ర నిల్చుని ఉంటాడు.. డాడ్ అనుకుంటూ రిషి పరిగెత్తుకుని వెళతాడు..మీరొస్తారని నాకు తెలుసు థ్యాంక్యూ డాడ్ అని ఎమోషన్ అవుతాడు.. అక్కడున్నది గౌతమ్ ( రిషి మహేంద్ర అనుకుని ఫీలవుతాడు).
గౌతమ్: అంకుల్ వచ్చారనుకుంటున్నావా
రిషి: నేను ఏం తప్పుచేశానో కూడా నాకు తెలియదు..డాడ్ వదిలేసి వెళ్లిపోయారు. డాడ్ నన్ను వదిలేసి వెళ్లిపోతే ఆనందంగా ఎలా ఉంటాను..
గౌతమ్: ఎప్పటికైనా వస్తారులేరా..
రిషి: ఇంకా వస్తారని నేనైతే అనుకోవడం లేదు..కావాలనే తప్పించుకుని తిరుగుతున్నారు..నేనే ఎదోఒకటి చేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యానురా
గౌతమ్: అరేయ్..పోలీస్ కంప్లైంట్‌ అవసరమా..
రిషి: వాళ్లు కావాలని తప్పించుకుని తిరుగుతున్నారు..ఈ బాధని ఎన్నాళ్లని భరించాలి 
గౌతమ్: నా మాట విని ఆ కంప్లైంట్ ఆలోచన మనసులోంచి తీసెయ్
రిషి: కాసేపు నన్ను ఒంటరిగా వదిలెయ్ రా ప్లీజ్...
గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు..నాపై ఏం కోపం డాడ్ అంటూ రిషి బాధపడతాడు...

Also Read: తల ఆరబెట్టుకుంటూ వసు, రిషి రొమాన్స్ - మహేంద్ర షాకింగ్ నిర్ణయం తెలిసి రిషిలో కలవరం

మేడపైన నిల్చున్న వసుధార ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడుతుంది. రిషి కూడా ఒంటిరిగా మేడపై నిల్చుని మహేంద్ర గురించి ఆలోచిస్తాడు.. ఇంతలో వసుధారని చూస్తాడు...
రిషి: వసుధారా..ఇంకా నిద్రపోలేదేంటి
వసు: నిద్రరావడం లేదు..రిజల్ట్ గురించి ఆలోచిస్తేనే టెన్షన్ గా ఉంది
రిషి: నువ్వుకూడా భయపడితే అర్థం ఉందా..నువ్వు కాలేజీ టాపర్ వి
వసు: మీరు ధైర్యం చెబుతున్నారో..వెటకారంగా మాట్లాడుతున్నారో అర్థంకావడం లేదు..నాకు భయంగా ఉంది
వసు చేయిపట్టుకుని దగ్గరకు తీసుకున్న రిషి..నీకు చాలా ధైర్యం చెప్పగలను కానీ ధైర్యం చెప్పించుకునే స్థాయిలో నువ్వు లేవు నీపై నాకు నమ్మకం ఉంది..నీపై నువ్వు నమ్మకం పెట్టుకో..వెళ్లి ప్రశాంతంగా పడుకో...అయినా రిజల్ట్ కోసం నువ్వు భయపడతావేంటి.. వసుధార వసుధార లానే ఉండాలి..నువ్వు బెదురుబెదురుగా ఉంటే నాకు కొత్తగా ఉంది భయపడకు అంటూ హగ్ చేసుకుంటాడు

తెల్లారగానే వసుధార కూరగాయలు కట్ చేస్తుంటుంది.. 
ధరణి: అన్నిపనులూ చకచకా చేస్తావ్..ఏ పని చెప్పినా చేస్తావ్ విసుక్కోవు..ఇది చాలా మంచి అలవాటు
వసు: అలా చేయడం..మన మనసుకి హాయిగా ఉంటుంది
ధరణి: నీ దగ్గర చాలా నేర్చుకోవాలి వసుధారా..
వసు: ఎవరికి మేడం కాఫీ
ధరణి: అత్తయ్యగారికి
వసు:నేను తీసుకెళతాను అనుకుంటూ తీసుకెళ్లిన వసుధార డోర్ తడుతుంది..
కాఫీ తీసుకొస్తే లోపలకు రావాలి కానీ తలుపుతట్టడం ఎందుకని అడుగుతుంది దేవయాని... తలుపుతట్టి తీసుకురావడం మర్యాద కదా మేడం అని ఎంట్రీ ఇస్తుంది వసుధార.. నా కోడలేది అని అడిగితే..నేనుకూడా కోడలు..లాంటిదాన్నే కదా అంటుంది
దేవయాని: అసలేంటి నీ ప్లాన్.. ఎన్నాళ్లు తిష్టవేస్తావ్..
వసు: ప్లాన్స్ తో జీవితం నడవదు...అయినా ఇప్పుడు రిషిసార్ ని ఒంటరిగా వదిలివెళ్లడం కరెక్ట్ కాదు..ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉంటా
దేవయాని: ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నావ్
వసు: కావాలనే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను..నాక్కూడా తెలుసు
దేవయాని: నీకు రిషిఅండగా ఉన్నాడనే ధైర్యం కదా..
వసు: నేను ఏం చేసినా డైరెక్ట్ గా చేస్తాను..కొంతమందిలా ఇన్ డైరెక్ట్ గా చేయడం నచ్చదు.. చెప్పి చేయడం మంచి లక్షణం
దేవయాని: నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాను..బాగా గమనిస్తున్నాను.. జగతి చెంప దెబ్బ కొట్టినందుకే రిషి అలా మాట్లాడాడు కాబట్టి నీకు బలం ఎక్కువైంది..

రేపటి(బుధవారం) ఎపిసోడ్ లో
రిజల్ట్స్ వచ్చాయి పదండే అని కాలేజీలో అందరూ నోటీస్ బోర్డుదగ్గరకు వెళతారు..ఇంతలో పుష్ప వచ్చి వసుధారా నీ నంబర్ లేదని చెబుతుంది.. నేను ఫెయిలయ్యాను సార్ , అందరి నమ్మకాలూ పోగొట్టాను అంటూ రిషి దగ్గర ఏడుస్తుంది వసుధార...

Published at : 08 Nov 2022 09:45 AM (IST) Tags: Guppedantha Manasu Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy Guppedantha Manasu November 8th Guppedantha Manasu Today Episode 602

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: ప్రియాంక చేస్తే కరెక్ట్, శివాజీ చేస్తే తప్పు - గౌతమ్ ఆరోపణలకు నాగార్జున కౌంటర్

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Bigg Boss 7 Telugu: అమర్‌కు నాగార్జున ఊహించని సర్‌ప్రైజ్ - దాంతో పాటు ఒక కండీషన్ కూడా!

Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

Nagarjuna Shirt Rate: బిగ్ బాస్‌లో నాగార్జున ధరించిన ప్యాచ్ షర్ట్ రేటు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువ?

Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: చిక్కుల్లో పడిన ప్రియాంక - గ్రూప్ గేమ్ వద్దంటూ నాగ్ సీరియస్

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్

Congress Complaint: బీఆర్ఎస్ పై సీఈవోకు కాంగ్రెస్ ఫిర్యాదు - రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్ భేటీ ఉండొచ్చన్న ఉత్తమ్
×