Karthika Deepam November 8th Update: ఇన్నాళ్లూ నా ప్రేమనే చూశావ్ ఇకపై నా పంతాన్ని చూస్తావ్, కార్తీక్ ని టార్గెట్ చేసిన మోనిత
కార్తీకదీపం నవంబరు 8 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam November 8th Episode 1504 (కార్తీకదీపం నవంబరు 8 ఎపిసోడ్)
కార్తీక్ ఇంకా ఇంటికిరాలేదేంటని మోనిత కంగారుపడుతుంటుంది..ఇంతలో కార్తీక్ వస్తాడు. రాగానే నీకోసం కంగారుపడుతున్నా ఎక్కడికి వెళ్లిపోయావ్ అని అడుగుతుంది.
కార్తీక్: ఏంటి దుర్గ ఇంట్లో లేరా..నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నావ్.. అయినా ఒక్కసారి నటన అని తెలిసిన తర్వాత మళ్లీ మళ్లీ నటించకూడదు
మోనిత: షాక్ అయిన మోనితకార్తీక్ వెళ్లిన వైపే చూస్తుండిపోతుంది. ఇకపై నీకు గతం గుర్తొచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఇన్నాళ్లూ నా ప్రేమనే చూశావ్..ఇకపై నా పంతాన్ని చూస్తావ్ అనుకుంటుంది..
ఆ తర్వాత దీప-కార్తీక్..ఇంద్రుడు ఇంటికి వెళతారు. ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలిసి నా అనుమానమే నిజమైంది డాక్టర్ బాబు అంటుంది దీప. లోపలకు వెళ్లిచూద్దాం అని చెప్పి కార్తీక్ దీపను తీసుకెళతాడు. ఇల్లంతా వెతికిన దీపకు ఓ ఫొటో దొరుకుతుంది..అది శౌర్య ఫంక్షన్ ఫొటో...అది చూసి దీప గుండె ముక్కలవుతుంది. శౌర్య కోసం వచ్చినప్పుడు వేరే అమ్మాయిని చూపించిన విషయం గుర్తుచేసుకుంటాడు కార్తీక్. ఆ రోజు శౌర్యకి బదులు మనకు వేరే అమ్మాయిని అలంకరించి చూపించారని దీప ఏడుస్తుంది.
కార్తీక్: మనం ఇవన్నీ కొనిచ్చేసరికి వాళ్లకి అనుమానం వచ్చి ఉంటుంది..అందుకే అమ్మాయిని మార్చి చూపించారని కార్తీక్ అంటాడు. నువ్వు మళ్లీరావడం నేను గట్టిగా అడగడంతో శౌర్యని తీసుకెళ్లిపోయారు
దీప: వాళ్లకి నేను ఏం అన్యాయం చేశాను..ఎందుకు నా బిడ్డని నాకు దక్కనీయకుండా చేశారు. ఏ తల్లైనా బిడ్డ తొలి పండుగ తన చేతులమీదుగా చేయాలి అనుకుంటుంది కానీ నేను నా బిడ్డకి అక్షింతలు కూడా వేయలేకపోయాను.. కనీసం నా బిడ్డని నాకు చూపించలేదు..
కార్తీక్: చూపిస్తే తీసుకెళ్లిపోతాం కదా..అందుకే చూపించలేదు
దీప: వాళ్లు వెళ్లిపోమ్మనగానే ఎందుకు వెళ్లిపోయాను..ఆవిడ వద్దన్నా బలవంతంగా అయినా చూస్తే శౌర్య కనిపించేది నాకు నా బిడ్డ దొరికి ఉండేది..తప్పు చేశాను డాక్టర్ బాబు
కార్తీక్: నువ్వు మాత్రం ఏం చేస్తావ్..కచ్చితంగా తెలియనప్పుడు ఎవరో ఇంటికొచ్చి బలవంతం చేయలేం కదా.. మనం తెలుసుకునే లోపు వాళ్లు జాగ్రత్త పడిపోయారు..
దీప: శౌర్యని వాళ్లెక్కడికి తీసుకెళ్లారు..నా బిడ్డ నాక్కావాలి డాక్టర్ బాబు...శౌర్య నాకు కావాలి
కార్తీక్: శౌర్యని తీసుకొచ్చి నీకు అప్పగించే పూచీ నాది...ఏడవకు అని ధైర్యం చెబుతాడు...
Also Read: మోనితకి నిజం చెప్పేసిన దుర్గ - శౌర్యని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయిన ఇంద్రుడు
మనం ఇప్పుడు ఎక్కడుంటాం అని శౌర్య అడిగితే..సంగారెడ్డి పక్కనే ఉన్న ఊర్లో అని బదులిస్తాడు ఇంద్రుడు. అదేంటి బాబాయ్..అమ్మానాన్నని సంగారెడ్డిలో వెతుకుదాం అన్నావు కదా మరి ఆ పక్క ఊర్లో ఉండడం ఏంటని అడుగుతుంది. లేదమ్మా...సంగారెడ్డిలో అద్దెలు ఎక్కువున్నాయి పక్కఊర్లో ఉన్నప్పటికీ నిత్యం సంగారెడ్డి వచ్చి మీ అమ్మానాన్నని వెతుకుందా అని చెబుతాడు.
మరోవైపు గుడికి వెళ్లిన దీప..గతంలో శౌర్యని కలిసే అవకాశం వచ్చి కలవకపోయిన విషయాలు గుర్తుచేసుకుంటుంది. కార్తీక్ కూడా శౌర్య గొంతు విన్న విషయం గుర్తుచేసుకుంటాడు.ఎవరికి వారే శౌర్య మిస్సైందనే బాధలో ఉంటారు..శౌర్యని మనకు దూరంగా ఉంచాలని ఆ దేవుడు మనిద్దరితో ఆడుతున్న ఆట అనుకున్న కార్తీక్...ఇంటికి వెళదాం రా దీప అంటాడు
దీప: నా తలరాత ఇలా రాసేవేంటని ఎప్పుడూ ఆ దేవుడిని నిందించేదాన్ని కానీ ఈ రోజు నారాత నేనే చెరిపేసుకున్నాను... ఆ రోజు దసరా ఉత్సవాల్లో నన్ను చూడాలని నా బిడ్డ కబురుపెడితే కుదరదన్నాను..అప్పుడే వెళ్లి ఉంటే నా బిడ్డ నాకు దక్కేది కదా...కాళ్ల దగ్గరకు వచ్చిన బిడ్డను కాదనుకున్నాను..నేను కోరి వెళ్లినప్పుడు కనబడకుండా చేశాడు..
కార్తీక్: ఇది అనుకోకుండా జరిగింది అంతే..వాళ్లకి శౌర్యని అప్పగించాలనే ఉద్దేశం లేనప్పుడు ఎలాగైనా తప్పించుకుని తీసుకెళ్లిపోయేవారు...
దీప: మీకు గతం గుర్తొచ్చేవరకూ నేను ఏం చెప్పినా అర్థంకాదు అనుకుంటుంది
కార్తీక్: నాకు గతం గుర్తొచ్చింది దీపా..కానీ మోనిత నిన్ను ఏం చేస్తుందో అని భయంలో చెప్పలేదు అనుకుంటూ.. శౌర్యని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను ఇంటికెళదాం రా అని చేయిపట్టుకుని తీసుకెళతాడు...శౌర్య ఇక్కడుంటే మరి హిమ ఎక్కడుందనే ఆలోచనలో పడతాడు కార్తీక్.. హిమ అమ్మానాన్నలతో వెళ్లిపోతే శౌర్య ఇక్కడెందుకు ఇలా ఉండిపోయింది.. ముందు మోనితని వదిలించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి...
Also Read: తల ఆరబెట్టుకుంటూ వసు, రిషి రొమాన్స్ - మహేంద్ర షాకింగ్ నిర్ణయం తెలిసి రిషిలో కలవరం
మరోవైపు ఇంద్రుడు-చంద్రమ్మ-శౌర్య గుడికి వెళతారు. గుడిలో మీ అమ్మా నాన్న పేర్లు చెప్పమ్మా అనగానే దీప -కార్తీక్ అని శౌర్య చెప్పేలోగా ఇంద్రుడు-చంద్రమ్మ అని తమ పేర్లు చెబుతాడు ఇంద్రుడు. శౌర్య షాక్ అవుతుంది..
ఎపిసోడ్ ముగిసింది
రేపటి(బుధవారం) ఎపిసోడ్ లో
అక్కడ స్టాఫ్ ఉన్నారు మీ ఏకాంతానికి భంగం కలుగుతుందని ఇక్కడికి వచ్చారా అని మోనితని అడుగుతాడు కార్తీక్ ( దీప ఇంట్లో ఉంటుంది మోనిత). డాక్టర్ బాబు నాకు మాట్లాడేందుకు ఓపిక లేదు మోనితను తీసుకెళ్లండి అని దీప అనగానే... డాక్టర్ బాబు అని పట్టుకుని వేలాడుతున్నావ్ సిగ్గులేదా అంటుంది. స్పందించిన కార్తీక్ నోర్ముయ్..ఎవరు ఎవర్ని పట్టుకుని వేలాడుతున్నారని క్వశ్చన్ చేస్తాడు... అంటే కార్తీక్ కి గతం గుర్తొచ్చిందా అని షాక్ అవుతుంది మోనిత...