అన్వేషించండి

Karthika Deepam November 7th: మోనితకి నిజం చెప్పేసిన దుర్గ - శౌర్యని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయిన ఇంద్రుడు

‘కార్తీక దీపం’ - సోమవారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? నిజం తెలిసిన తర్వాత మోనిత ఏం చేస్తుంది?

కార్తీక్, దీప శౌర్య, ఇంద్రుడు కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఆనందరావు శౌర్యని బలవంతంగా కారులో తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ కారు వెనుక ఇంద్రుడు ఆటో కూడా ఉంటుంది. శార్య గొంతు విని దీప కార్తిక్ కి చెప్పడంతో ఆ కారు వెంట పడతారు. కానీ కారు వేగంగా వెళ్లిపోతుంది. దీంతో కార్తిక్ వాళ్లు కారు మిస్ అవుతారు.

ఇంద్రుడు వెళ్లి కారు ఆపేసరికి శౌర్య వెంటనే తన దగ్గరకి వెళ్లిపోతుంది. ఆనందరావు శౌర్యని తీసుకెళ్లడానికి బలవంతంగా ట్రై చేస్తుంటే ఇంద్రుడు వచ్చి అడ్డుపడతాడు. నేను మీతో రాను మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీరు ఒక్క అడుగున ముందుకు వేసినా నా మీద ఒట్టే అని శౌర్య అనేసరికి ఆనందరావు హిమ చాలా ఎమోషనల్ అయిపోతారు. చేసేదేమీ లేక ఆనందరావు వెళ్లిపోవడంతో శౌర్య ఇంద్రుడు ఆటో ఎక్కి ఏడుస్తూ వెళ్తుంది. ‘‘నానమ్మ నన్ను వదలదు బాబాయ్. ఎలాగైనా ఎక్కడికి వచ్చి నన్ను తీసుకొని వెళ్తుంది’’ అనేసి అని శౌర్య అనేసరికి ఇంద్రుడు ‘‘అయితే ఈ ఊరు వదిలి వెళ్లి పోదాం’’ అని అంటాడు.

‘‘ఊరు వదిలి వెళ్లిపోవడం ఎంటి? అమ్మ, నాన్న ఇక్కడే ఉన్నారు కదా బాబాయ్’’ అని శౌర్య అంటుంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే వాళ్లు వస్తారని ఇంద్రుడు అంటాడు. దసరాకి మనం సంగారెడ్డి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు అక్కడ కనిపించారన్నారు కదా మనం అక్కడికి వెళ్లి వెతుకుదాం అని ఇంద్రుడు అంటాడు. ఆ మాటకి నిజమే బాబాయ్ అమ్మ సంగారెడ్డి లోనే ఉండి ఉంటుంది. మనం అక్కడికే వెళదామని శౌర్య కూడా ఒప్పుకుంటుంది. క్షమించు తల్లి మీ అమ్మానాన్న ఇక్కడే ఉన్నారు. నీ కోసమే వెతుకుతున్నారు. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాను అని ఇంద్రుడు బాధపడతాడు.

మోనిత కార్తీక్ కోసం దీప ఇంటికి వస్తుంది. ఇంటికి తాళం వేసి ఉండటం చూసి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దుర్గ నీబాధ భరించలేక లేచిపోయారని కౌంటర్ ఇస్తాడు. భార్యాభర్త లేచిపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అని సీరియస్ అవుతుంది. ఏం ప్లాన్స్ చేస్తున్నారా మీరు అందరూ కలిసి అని మోనిత దుర్గని నిలదీస్తుంది. నీకు ఇంకొక షాకింగ్ వార్త చెప్పనా? డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చేసింది అని దుర్గ చెబుతాడు.

‘‘కంగారుగా ఏం మాట్లాడుతున్నావ్ రా’’ గతం గుర్తుకు రావడం ఏమిటి? అని మోనిత టెన్షన్ పడుతుంది. గతం గుర్తొచ్చిందంటే నమ్మడం లేదా నీ మీద ఒట్టు బంగారం అని దుర్గ అనేసరికి మోనిత షాక్ అవుతుంది. దీప కార్తీక్ ఇంద్రుడి వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. కొంపదీసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా ఏంటి అని దీప కార్తీక్ తో అంటుంది. పక్కింటి వాళ్ళని ఇంద్రుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడిగితే ఫ్యామిలీ అంతా కలిసి ఆటోలో ఎక్కడికి బయటికి వెళ్లారని చెప్తారు. సామాన్లు ఏమైనా తీసుకువెళ్లా రా? అని దీప కంగారుగా అడిగేసరికి ‘‘లేదమ్మా బయటికి వెళ్లారు. కాసేపట్లో వచ్చేస్తారు’’ అని అతను చెప్తాడు.

ఆటో వెనక అతికించిన ‘‘అమ్మా, నాన్న ఎక్కడున్నారు?’’ అనే పేపరు కార్తీక్ కంట పడుతుంది. అది చూసి ఇందాక నా అనుమానం కరెక్టే అని కార్తీక్ అనుకుంటాడు. దీప కూడా శౌర్య వాళ్ళ దగ్గరే ఉంది. కానీ మనకు ఇవ్వకుండా దాచాలని చూస్తున్నారని బాధపడుతుంది. ఇంద్రుడు వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉందామని కార్తీక్ కూర్చుంటే దీప వద్దని అంటుంది. మనం ఇంటికి వెళ్ళిపోదాం. పొద్దున్నే వచ్చి చూద్దాం అని కార్తీక్ నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకొని వెళుతుంది.

హిమ,ఆనంద రావు శౌర్య చేసిన పని గురించి ఆలోచిస్తూ చాలా బాధపడతారు. దీనంతటికీ కారణం నేనే తాతయ్య అని హిమ ఏడుస్తుంది. శౌర్య మనసు పూర్తిగా మార్చేశారని ఆనందరావు కోపంగా అంటాడు. ఇంద్రుడు వాళ్లకి పిల్లలు లేరు కదా శౌర్యని వాళ్ళ దగ్గరే ఉంచేసుకోవాలని ఇలా చేసి ఉంటారు అని బాధపడతాడు. 

మౌనిత  ఇంటికి వచ్చి డాక్టర్ బాబుకి గతం గుర్తుకు వచ్చింది అని దుర్గ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని రగిలిపోతుంది. ఆ దుర్గ గాడు చెప్పింది నిజామా కార్తీక్ , దీప లేచిపోయారా? కార్తీక్ కి గతం గుర్తుకొస్తే నాకు నాలుగు తగిలించి దీపని తీసుకొని వెళ్తాడు గాని ఇలా లేచిపోడు. అంటే.. ఆ దుర్గ గాడు చెప్పింది అబద్ధం అనుకోని మోనిత కార్తికే ఫోన్ ట్రై చేస్తుంది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు. అంటే వాడు చెప్పింది నిజమేనా కార్తీక్ లేచిపోయాడా అని ఆలోచిస్తుంది. 

తరువాయి భాగంలో..

కార్తీకదీపం ఇంద్రుడు వాళ్ళ ఇంటికి వస్తారు అక్కడ టులెట్‌ బోర్డు చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఇంట్లోకి వెళ్లిన దీపా, కార్తిక్ ఇల్లంతా వెతుకుతూ ఉంటే బిడ్డలు ఒకచోట శౌర్య ఇంద్రుడు చంద్రమ్మ కలిసి ఉన్న ఫోటో దీప కంట పడుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Embed widget