Karthika Deepam November 9th Update: కార్తీక్ కొట్టిన చెంపదెబ్బకి మోనిత రియాక్షన్, కార్తీకదీపం కథలో మరో కీలక మలుపు
కార్తీకదీపం నవంబరు 9 ఎపిసోడ్: టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Karthika Deepam November 9th Episode 1505 (కార్తీకదీపం నవంబరు 9 ఎపిసోడ్)
గుడిలో కార్తీక దీప పేర్లు శౌర్య చెబుతుండగా ఆపి తమ పేర్లు చెబుతాడు ఇంద్రుడు. ఎందుకలా చేశావ్ అని శౌర్య అడిగితే ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాన్న పేర్లు చెబితే వీళ్లెవరు అని అడుగుతారు..అప్పుడు కథ మొత్తం చెప్పాలి...ఒకవేళ మీ నానమ్మ తాతయ్య వాళ్ళు వస్తే తెలిసిపోతుందని ఇలా చెప్పానని కవర్ చేస్తాడు ఇంద్రుడు. ఆ తర్వాత సంగారెడ్డికి ఎప్పుడెళదాం బాబాయ్ అని అడిగితే..అక్కడికి ఎందుకు అనేస్తాడు. షాక్ అయిన శౌర్య..అమ్మను వెతికేందుకే కదా ఇక్కడకు వచ్చాం అని అంటుంది. అప్పుడు చంద్రమ్మ అలా ఎలా మర్చిపోతాడు లేమ్మా ...ఇప్పుడే వచ్చాం కదా ఇల్లు సర్దుకుని అప్పుడు వెళదాంలే అనేస్తుంది. నీలో మార్పు వచ్చింది బాబాయ్.. నువ్వు ఎందుకో భయపడుతున్నావ్ అని శౌర్య అడిగేస్తుంది..ఇంద్రుడు-చంద్రమ్మ షాక్ అవుతారు..
కార్తీక్ ఇంకా రాలేదేంటనే ఆలోచనతో వంటలక్క ఇంటిదగ్గర వెయిట్ చేస్తుంటుంది మోనిత. అక్కడికి దుర్గ వచ్చి దీపమ్మా అని పిలిస్తే ఆ దీప ఇంట్లో లేదు రా అని అంటుంది. మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్.. ఇంటికి కుక్కలా కాపలా కాస్తున్నావా అని సెటైర్ వేస్తాడు. దీప కార్తీక్ వాళ్లకు కావాల్సిన టైమ్ లో లేచిపోతారు..ఇప్పుడుకూడా కలసే వస్తారు చూడు అనగానే ఫైర్ అవుతుంది మోనిత. అప్పుడే దీప-కార్తీక్ కలిసొస్తారు. వాళ్ళని చూసి మోనిత షాక్ అవుతుంది.
కార్తీక్: నీకు ఆ ఇల్లు సరిపోలేదా ఇక్కడకు వచ్చావ్.. ఓ అక్కడ స్టాఫ్ ఉంటారని దుర్గతో కలసి ఇలా వచ్చావా మోనితా
మోనిత: నేను ఇక్కడకి వచ్చింది మీ సంగతి తేల్చడానికి, అసలు మీ అవతారం ఏంటి
దీప: మోనితతో గొడవ పడే ఓపిక తీరిక నాకు లేవు.. ప్లీజ్ మోనితను తీసుకెళ్లండి డాక్టర్ బాబు
మోనిత: నా మొగుడుతో ఊరంతా తిరిగేకి నీకు టైమ్ ఉంటుంది. నాతో మాట్లాడేకి లేదా అని ముందుముందుకు
కార్తీక్: నోరు ముయ్యి ఎవరు ఎవరిని పట్టుకుని వేలాడుతున్నారు.. వంటలక్క బాధపడుతుంటే సాయం చేస్తున్నాను.. నీకు తన ముఖం చూస్తే తెలియడం లేదా బాధలో ఉందంటూ మోనితను అక్కడినుంచి తీసుకెళ్లిపోతాడు.
ఆతర్వాత వంటలక్క శౌర్య ఫోటో చూసి కన్నీళ్లు పెడుతుంది.
Also Read: ఇన్నాళ్లూ నా ప్రేమనే చూశావ్ ఇకపై నా పంతాన్ని చూస్తావ్, కార్తీక్ ని టార్గెట్ చేసిన మోనిత
ఆనంద రావు, హిమ ఇద్దరూ హోటల్ లో భోజనం చేసేందుకు వెళ్తే అక్కడ లక్ష్మణ్ కనిపిస్తాడు. అప్పుడు ఆనంద్ ను ఇంటికి తీసుకురమ్మని హిమ అడిగితే..మోనిత ఆంటీ దగ్గరే ఉన్నాడని చెబుతాడు.. అప్పుడు ఆనందరావు లక్ష్మణ్ ని అక్కడినుంచి పంపించేస్తాడు. నువ్వు చదువుపై దృష్టిపెడితే నేను శౌర్యను తీసుకురావడంపై దృష్టి పెడతాను..ఇంతవరకూ శౌర్య ఇష్టం అని వదిలేశాను..రేపు మీ నానమ్మ వచ్చాక వదిలే ప్రసక్తే లేదు శౌర్యను తీసుకొద్దాం..రేపు మోనిత ఆంటీ దగ్గరకు వెళ్లి ఆనంద్ ని చూసి వద్దాం అంటాడు....
Also Read: మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానంటూ వసు కన్నీళ్లు, ఇప్పుడు రిషి ఏం చేయబోతున్నాడు!
కార్తీక్ కి గతం గుర్తొచ్చిందా రాలేదా తెలుసుకోవాలని కార్తీక్ పర్సు తీసి చూసిన మోనిత...ఇంత డబ్బు కార్తీక్ దగ్గరకు ఎలా వచ్చిందని అనుకుంటుండగా కార్తీక్ అక్కడికి వస్తాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి చిల్లర కోసం వెతుకుతున్న అని కవర్ చేస్తుంది
కార్తీక్: చిల్లర వేషాలు వేయకు మోనితా నేను బయటే ఉన్న కదా నన్ను అడగాల్సింది..ఇలా దొంగచాటుగా పర్స్ వెతకాల్సిన అవసరం లేదు..నీకు ఏదో డౌట్ వచ్చింది ఏంటో అడుగు
మోనిత: ఆ వంటలక్కతో ఎక్కడికి వెళుతున్నావ్..ఏం చేస్తున్నావ్...అంతకుముందు వంద కావాలన్నా అడిగేవాడివి ఇప్పుడు రూపాయి కూడా అడగడం లేదు.. ఈ డబ్బంతా నీకు ఎక్కడ నుంచి వచ్చింది
కార్తీక్: గొలుసు తాకట్టు పెట్టాను
మోనిత: ఏంటి గొలుసు తాకట్టు పెట్టావా? అంత అవసరం నీకు ఏం వచ్చింది? నేనున్నాను కదా నన్ను అడగొచ్చు కదా
కార్తీక్: నీపై బతకడం నాకు ఇష్టం లేదు
మోనిత: అలా అంటావు ఏంటి కార్తీక్ నేను ఏం తప్పు చేశానని నన్ను ఇలా వేధిస్తున్నావు
అప్పుడే దుర్గ ఎంట్రీ ఇస్తాడు...మోనిత నా గోల్డ్ చైన్ ఎలా ఉంది
మోనిత: నాకు ఎందుకు చూపిస్తున్నావు
దుర్గ: నువ్వు కొనిపెట్టిన చైన్ నీకు చూపించకపోతే ఎలా
కార్తీక్: నా మెడలో చైన్ లేకపోతే ఏంటి నువ్వు అభిమానించే వారి మేడలో ఉంది కదా
మోనిత: ఆ చైన్ కు నాకు ఎటువంటి సంబంధం లేదు కార్తీక్
కార్తీక్: నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చానని ఎందుకు చెప్తారుఅనేసి వెళ్లిపోతాడు
దుర్గ వెళ్ళిపో ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అంటే నువ్వు కార్తీక్ ను వదిలెయ్ అంటాడు... మోనిత కోపంగా చూస్తుంటుంది..
ఎపిసోడ్ ముగిసింది
రేపటి( గురువారం) ఎపిసోడ్
ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా గుడిలో దీపం వెలిగించి పూజ చేస్తే మంచి జరుగుతుంది..అడగానికే ఏదోలా ఉంది 600 రూపాయలు ఇస్తారా అని దీప అడిగితే..ఇంకెప్పుడూ డబ్బుల గురించి ఇబ్బంది పడకు అంటూ డబ్బులు తీసి ఇస్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మోనిత ఆడబ్బులు అందుకుని దీప గురించి తప్పుగా మాట్లాడుతుంది..( ఇప్పుడు కొడితే కార్తీక్ కి గతం గుర్తొచ్చినట్టే అనుకుంటుంది) కార్తీక్ లాగిపెట్టి కొడతాడు...