Ennenno Janmalabandham November 14th: నిజం ఒప్పుకున్న యష్- ఖుషిని తీసుకుని వెళ్ళిపోయిన వేద
మాళవిక, యష్ గురించి వేదకి నిజం తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద, అభిమన్యు యష్ వాళ్ళ దగ్గరకి వస్తారు. నేను ఇలా వచ్చి ఉండాల్సింది కాదు కానీ రావాల్సి వచ్చింది ఈ అభిమన్యు వల్లే. ఇతను నన్ను కలిసి మీరు నాకు అబద్ధాలు చెప్తున్నారంట, నా దగ్గర ఏదో రహస్యం దాచాలని ట్రై చేస్తున్నారంట, మాళవికని కాపాడటానికి ట్రై చేస్తున్నారంట, అమ్మకి యాక్సిడెంట్ చేసింది వేరే ఎవరో కాదు ఈ మాళవికనె అంట. మీరే షాక్ అయ్యారు కదా నేను కూడా మీలాగే షాక్ అయ్యాను, మీ గురించి ఒకటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. మీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్ముతానా, ఎన్ని చెప్పిన అతను వినడం లేదు అందుకే నేనే అతన్ని మీ దగ్గరకి తీసుకొచ్చాను, మీరే చెప్పండి.. అభిమన్యు చెప్పిన ప్రతి మాట అబద్ధం అని చెప్పండి’ అని వేద యష్ ని అడుగుతుంది.
Also read: మాధవ్ ని చంపేసిన సత్య, నేరం తన మీద వేసుకున్న రుక్మిణి- ముగిసిన 'దేవత' కథ
కానీ యష్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. మాళవిక యాక్సిడెంట్ చేసే ఉంటే తనని పోలీసులకి అప్పగించి ఊచలు లెక్కబెట్టేలా చేసేవాడు అని అభికి వేద వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా ఎందుకు మీరే చెప్పండి ఈ విషయం అని వేద యష్ గురించి గొప్పగా చెప్తూనే ఉంటుంది. యష్ ఏమి మాట్లాడకుండా బాధపడతాడు. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అని వేద మీద సీరియస్ అవుతాడు. ‘నేను దేవుడ్ని కాదు, మామూలు మనిషిని, నాకౌ ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉంటాయి. నా గురించి గొప్పగా మాట్లాడి నన్ను దేవుడ్ని చెయ్యకు. నేను ఈ పోరాటం చేయలేను’ అని గట్టిగా అరుస్తాడు. ఈ మాళవికనే అమ్మకి యాక్సిడెంట్ చేసిందా అని వేద అడుగుతుంటే యష్ షటప్ అని అరుస్తాడు.
ఇప్పటికైనా అర్థం అయ్యిందా నీ భర్త అబద్ధాలు ఆడతాడాని, మాలాగే మోసాలు చేస్తాడని అభి అంటాడు. ఆదిత్య వచ్చి అభిని పలకరిస్తే మాళవిక తనని బలవంతంగా అక్కడి నుంచి లాక్కుని వెళ్ళిపోతుంది. యశోధర్ మీద నీ నమ్మకం చూసి బాధేస్తుంది అని అభిమన్యు మంట పెట్టి వెళ్ళిపోతాడు. వేద కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇలా ఎలా చేయగలిగారు, ఇంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలిగారు, మాళవికని మీరు కాపాడాలని చూస్తున్నారా మనసు ఎలా వచ్చింది మీకు అని వేద ఏడుస్తూ అడుగుతుంది. చేస్తుంది తప్పని తెలుసు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలసి వచ్చిందని యష్ చెప్తాడు. కానీ వేద తన మాటలు నమ్మడానికి సిద్ధంగా ఉండదు.
Also Read: దీపను చంపబోయిన మోనిత, కాపాడి ఇరుక్కుపోయిన కార్తీక్
మన మధ్య నిజాయితీ అనే బంధాన్ని ఏర్పరుచుకున్నాం కానీ మీరు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు అని వేద యష్ ని నిలదీస్తుంది. అప్పుడే ఖుషి వస్తుంది. తనని పట్టుకుని వేద బాగా ఏడుస్తుంది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు అని ఖుషిని తీసుకుని వెళ్ళిపోతుంది. ‘ఎలా చెప్పాలి నీకు, ఇంత కంటే పెద్ద శిక్ష ఏముంటుంది, నేను నిన్ను మోసం చెయ్యలేదు, నన్ను నేను మోసం చేసుకుంటున్నా, నీకు నిజం చెప్పను అని ఆది మీద ఒట్టేశాను’ అని యష్ ఫీల్ అవుతాడు.