అన్వేషించండి

Karthika Deepam November 12th Update: దీపను చంపబోయిన మోనిత, కాపాడి ఇరుక్కుపోయిన కార్తీక్

కార్తీకదీపం నవంబరు 12 ఎపిసోడ్:టీవీ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ కు గతం గుర్తుకురావడంతో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Karthika Deepam November 12th  Episode 1508 (కార్తీకదీపం నవంబరు 12 ఎపిసోడ్)

ఇంద్రుడు-చంద్రమ్మ విషయంలో శౌర్య ఏదో ఆలోచిస్తుంది..మీరు ఇంతకు ముందులా లేరు మారిపోయారు అంటుంది. అంతా నీకోసమే కదా అని అన్నాసరే..నా ఫంక్షన్ కి ముందు ఆ తర్వాతా చాలా మార్పొచ్చింది అనేసి వేచి వెళ్లిపోతుంది. మరోవైపు మోనిత-కార్తీక్ ఇద్దరూ గుడికి వెళతారు. అడగ్గానే గుడికి వచ్చావ్ ఈ రోజంతా నాతోనే ఇలాగే ఉండు అంటూ ఏదేదో మాట్లాడుతుంటుంది మోనిత..కార్తీక్ అక్కడినుంచి వెళ్లిపోతాడు. అది గమనించిన మోనిత..కార్తీక్ కోసం వెతుకుతూ ఓ దగ్గర కనిపించడంతో ఎక్కడికి వెళుతున్నావ్ అని నిలదీస్తుంది. నాతో పాటే ఉండాలని చెప్పానుకదా అంటుంది... ఇదిగో కశ్చీఫ్  నా బదులు ఉంచుకుని దీపాలు పెట్టుకో అనేసి వెళ్లిపోతాడు..

Also Read: మచ్చలేని స్వచ్ఛమైన భావాలేవో ఉరకలేసే, ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రిషికి వసు హగ్

గుడిలో కార్తీకదీపం వెలిగిస్తున్న దీప దగ్గరకు వెళతాడు కార్తీక్.. ప్రేమగా మాట్లాడతాడు..మీకోసమే చూస్తున్నా డాక్టర్ బాబు దీపాలు విలిగించండి అని అడుగుతుంది..కార్తీక్ దీప వెలిగిస్తాడు..కొండెక్కిపోతుండగా ఆ దీపానికి దీప-కార్తీక్ ఇద్దరూ చేతులు అడ్డం పెడతారు...అప్పుడే అక్కడకు ఎంట్రీ ఇచ్చిన మోనిత ఇదంతా చూసి రగిలిపోతుంది. 
మోనిత: నాతో కలసి దీపం వెలిగించమంటే కశ్చీఫ్ చేతిలో పెట్టి ఇక్కడ దీపతో కలసి దీపం వెలిగిస్తావా..నేను పిలవగానే గుడికి బయలుదేరగానే ఏదో అనిపించింది..దీనికోసం వచ్చావన్నమాట..ఏ దీపం అయితే వెలిగించావో ఆదీపంతోనే దాన్ని తగలబెట్టేస్తా అనుకుంటుంది..ఇంతలో శివలత వచ్చి మోనితను లాక్కెళుతుంది.. గుడిలో గొడవవద్దు వెళదాం రండి అని తీసుకెళ్లిపోతుంది
కార్తీక్-దీప: దీపాలు వెలిగించడం అయిపోయిందా అని కార్తీక్ అడిగితే.. పొద్దుపోయాక వెలిగించి నీళ్లలో వెలిగించేదే కార్తీకదీపం అసలైన దీపం..అది కూడా మీ చేత్తో వెలిగిస్తారా అని అడుగుతుంది. సరే పద అంటాడు... మెట్లపై నుంచి దీప తూలిపడబోతుంటే కార్తీక్ పట్టుకుంటాడు. మళ్లీ చూసిన మోనిత గొడవకు సిద్ధమవుతుండగా శివలత లాక్కెళ్లిపోతుంది. నాకోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఇవే జాగ్రత్తలు నా డాక్టర్ బాబులా తీసుకుంటే బావుంటుంది అనుకుంటుంది మనసులో..
మోనిత: నిన్న పూజకోసం పదివేలు ఇచ్చాడు..ఇప్పుడు తనతో కలసి దీపం వెలిగించాడు..కార్తీక్ ను వంటలక్క మాయ చేస్తోంది..తనచుట్టూ తిరిగేలా చూసుకుంటోంది.. 
శివలత: కళ్లముందే భర్త...వేరే ఆడదానితో తిరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు.. మీ దగ్గర లేనిదేంటి తన దగ్గర ఉన్నదేంటి 
మోనిత: దీప..కార్తీక్ భార్య అన్నవిషయం శివలతకు తెలియదు అనుకుంటూ.. ఈ రోజు దాని సంగతి చూడాల్సిందే అనుకుంటుంది..
శివలత: ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి దీపాలు ఎవరు వెలిగిస్తే వాళ్లకి వాళ్ల భర్త దక్కుతాడు..తను వెలిగిస్తే తన భర్త తనకి దక్కుతాడు మీకేంటి..ఇన్నాళ్లూ సార్ వంటలక్క చుట్టూ తిరిగితే భరించారు కదా..ఈ ఒక్కరోజు భరించి దీపాలు వెలిగించండి అంతా మంచే జరుగుతుంది. ముందు దీపాలు వెలిగించండి రండి మేడం వెళదాం...

Also Read: ఇవాల్టితో నీ దీపం ఆరిపోతుందన్న మోనిత - నీ పాపం పండిందన్న దీప, కార్తీక్ కి ఏం జరగబోతోంది!

సాయంత్రం దీపాలు వెలిగించమని చెప్పి..దీప వాటిని తీసుకెళ్లేందుకు వెళుతుండగా..మోనిత ఎదురుపడుతుంది.
మోనిత: నువ్వు ఎన్నిదీపాలు వెలిగించినా కార్తీక్ నీ సొంతం కాలేడు
దీప:ఆయనకు ఏమీ గుర్తులేకపోయినా..నా పక్కనే ఉండి దీపం వెలిగించేలా చేశాడు దేవుడు..ఇంతకన్నా కావాల్సింది ఏంటి. అదీ భార్య భర్త బంధం అంటే. ఎప్పటికైనా మిగిలేది అదే...మధ్యలో వచ్చినదానివి మధ్యలోనే కొట్టుకుపోతావు
మోనిత: ఎవరు కొట్టుకు పోతారో చూద్దాం
దీప: డాక్టర్ బాబు ఇప్పుడు నావైపు ఉన్నారు..గతం గుర్తుకురావడం మాత్రమే మిగిలింది
మోనిత: నువ్వు గతంలోనే ఉంటావు..భవిష్యత్ లో ఉండవ్
దీప: డాక్టర్ బాబు నా పక్కనే ఉన్నారు రక్షణగా..ఇప్పుడేం చేస్తావ్
మోనిత: ఆ రక్షణ గోడనే కూల్చేస్తాను..నాకు నచ్చింది దక్కించుకునేందుకు ఎంత పోరాటం అయినా చేస్తాను.. నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కనివ్వను...
దీప: ఏం మాట్లాడుతున్నావ్
మోనిత: జరగబోయేదే మాట్లాడుతున్నాను... కార్తీక్ నీవైపు వచ్చేలా చేయకుండా ఉండాల్సింది..నీతో పాటూ కార్తీక్ కూడా చాలా తప్పు చేశాడు...అంతా మర్చిపోయి నీతో ఏ సంబంధం లేదు నేనే భార్యనని నూరిపోశాక కూడా నీవైపు నిలబడ్డాడు చూడు ఇది తట్టుకోలేకపోతున్నాను
దీప: నా భర్త నాతో కలసి దీపం వెలిగిస్తే నువ్వు తట్టుకోలేకపోవడం ఏంటి..
మోనిత: నా భర్త నా ప్రియుడు నా కార్తీక్...

సోమవారం ఎపిసోడ్ లో
దీప గుడిలో దీపాలు వెలిగిస్తుండగా..నీటిలో తోసేయ్యాలని మోనిత ప్రయత్నిస్తుండగా కార్తీక్ వెళ్లి మోనితను లాక్కొస్తాడు. నీకు నాకు మధ్య ఎవ్వరు అడ్డొచ్చినా బతకనివ్వను అన్న మోనిత..ఈ రోజు నుంచి వంటలక్కతో మాట్లాడను అని నాకు మాటివ్వు అంటుంది..కార్తీక్ ఆలోచనలో పడతాడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Bhatti Vikramarka: ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
ప్రాణహిత కడతాం, ఉమ్మడి ఆదిలాబాద్ రైతులకు సాగునీళ్లు ఇస్తాం: భట్టి విక్రమార్క
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Embed widget